అన్వేషించండి

Telangana BJP : తెలంగాణ బీజేపీకి కొత్త కమిటీలు - అసంతృప్త నేతలందరికీ పదవులు !

తెలంగాణ బీజేపీ ఎన్నికల కోసం కొత్త కమిటీల్ని నియమించారు. అసంతృప్త నేతలకూ కీలక బాధ్యతలిచ్చారు.

 

Telangana BJP :  తెలంగాణ  ఎన్నికల కమిటీలను బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. మొత్తం 14 కమిటీలను నియమించారు.  మేనిఫెస్టో, పబ్లిసిటీ కమిటీ చైర్మన్‌గా వివేక్ వెంకటస్వామి, కన్వీనర్‌గా మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కన్వీనర్‌గా కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్‌గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పబ్లిక్ మీటింగ్స్ ఇంఛార్జిగా బండి సంజయ్, ఛార్జ్ షీట్ కమిటీ చైర్మన్‌గా మురళీధర్ రావు, యాజిటేషన్ కమిటీ చైర్మన్‌గా విజయ శాంతిని నియమించినట్లుగా ప్రకటించారు.  నేతలందరినీ కమిటీల్లో సర్దుబాటు చేసింది. దాదాపుగా అందరికీ తలా ఓ పదవి వచ్చేలా ఈ కమిటీలను సిద్ధం చేశారు. ఒకరకంగా అసంతృప్తులను కూల్ చేసేందుకు ఈ కమిటీల్లో వారికి కీలక పదవులిచ్చారు.

ఇటీవల పార్టీతో అంటీ ముట్టనట్టుగా ఉంటున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఏకంగా స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. అభ్యర్థుల ఎంపికలో స్క్రీనింగ్ కమిటీది కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పటికే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ దరఖాస్తులను వడపోసి అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. రాజగోపాల్ రెడ్డి కొంత కాలంగా అసంతృృప్తిగా ఉన్నారు. ప్రధాని మోదీ రెండు బహిరంగసభలకూ హాజరు కాలేదు. ఆయన సోదరుడు వెంకటరెడ్డి ద్వారా కాంగ్రెస్ లో చేరి మళ్లీ మునుగోడు నుంచి పోటీ చేయాలనుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆయనకు అభ్యర్థులను ఖరారు చేసే స్క్రీనింగ్ కమిటీ పదవి ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.                    

నిరసనలు, ఆందోళన నిర్వహణ బాధ్యతలకు సంబంధించి అజిటేషన్ కమిటీకి చైర్మన్ గా విజయశాంతిని నియమించారు. విజయశాంతి ఇటీవలి కాలంలో  బీజేపీ అనే పేరు కూడా ప్రస్తావించకుండా సోషల్ మీడియాలో ప్రకటనలు చేస్తున్నారు. ఆమె కూడా అసంతృప్తిగానే ఉన్నారు. ఇక మేనిఫెస్టో, పబ్లిసిటీ కమిటీలకు చైర్మన్ గా గడ్డం వివేక్‌ వెంకటస్వామిని నియమించారు. వివేక్ కూడా అసంతృప్తిగా ఉన్నారని పార్టీ మారుతారన్న ప్రచారం జరుగుతోంది.             

సీనియర్ నేతలకు కీలక బాధ్యతలు ఇచ్చారు. పబ్లిక్‌ మీటింగ్‌ కమిటీ ఇన్ ఛార్జ్‌ గా బండి సంజయ్‌..  ఛార్జ్‌ షీట్‌ కమిటీ చైర్మన్‌ గా మురళీధర్‌ రావుని నియమించారు.   ప్రభావిత వ్యక్తులను కలిసే కమిటీ చైర్మన్ గా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలి పదవిలో ఉన్న డీకే అరుణను నియమించారు. ఎన్నికల కమిటీ చైర్మన్ గా మర్రి శశిధర్ రెడ్డి, సోషల్ మీడియా కమిటీ చైర్మన్ గా ధర్మపురి అర్వింద్‌ లకు అధిష్టానం బాధ్యతలు కేటాయించింది. మొత్తం 14కమిటీలను ఈరోజు బీజేపీ ప్రకటించింది.   తెలంగాణను ఆరు జోన్లుగా విభజించి, ఎన్నికల వ్యూహాలు అమలు చేయాలని బీజేపీ భావిస్తోంది. సునీల్‌ బన్సల్‌ అధ్యక్షతన ఈరోజు, రేపు సంస్థాగత కార్యక్రమాలు జరగబోతున్నాయి. జిల్లా పార్టీ అధ్యక్షులు, జిల్లా ఇన్ ఛార్జిలు, రాష్ట్ర పదాధికారులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బహిరంగ సభలకు తెలంగాణ బీజేపీ కసరత్తులు చేస్తోంది.                                

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Embed widget