Top Headlines Today: చంద్రబాబుకు అత్యవసర బెయిల్ కోరుతూ పిటిషన్; తెలంగాణ బీజేపీకి జేజమ్మ హ్యాండిస్తారా? - నేటి టాప్ న్యూస్
నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్
స్కిల్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ హైకోర్టులో గురువారం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్ పై అత్యవసర విచారణ జరపాలంటూ ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 3 నెలల క్రితం చంద్రబాబు ఎడమ కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ జరిగిందని పేర్కొన్నారు. ఇప్పుడు కుడి కంటికి ఆపరేషన్ జరపాల్సి ఉందని వివరించారు. శుక్రవారం వెకేషన్ బెంచ్ ముందుకు ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇంకా చదవండి
బీజేపీకి జేజమ్మ హ్యాండిస్తారా ?
తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో, ఏ పార్టీలో చేరతారో రాజకీయ విశ్లేషకులు అంచనా వేయలేకపోతున్నారు. తలపండిన మేధావులు కూడా తెలంగాణలో రాజకీయాలపై అవగాహనకు రాలేకపోతున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ కాంగ్రెస్ కు బూస్ట్ ఇచ్చాయి. అనేక సర్వేలు కాంగ్రెస్ కు మెజార్టీ సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నాయి. సర్వేల ఫలితమో, కర్ణాటక ఎన్నికల్లో గెలుపో కానీ, గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీకి జోష్ వచ్చింది. దీంతో హస్తం పార్టీని బీజేపీలో చేరిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు సొంతగూటికి చేరేందుకు తహతహలాడుతున్నారు. ఇంకా చదవండి
కేసీఆర్‌పై రేవంత్ మాత్రమే కాదు - కేటీఆర్, హరీష్‌లపైనా కీలక నేతల పోటీ!
తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేతలు బీఆర్ఎస్ అగ్రనేతలపై పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్‌లపై రేవంత్, ఉత్తమ్, కోమటిరెడ్డిలను నిలబెట్టాలని ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు. రెండో జాబితాలో ఇదే హైలెట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. గజ్వేల్‌లో ఆయనపై బీజేపీ తరపున ఈటల పోటీ చేస్తున్నారు. కామారెడ్డిలో రేవంత్ రెడ్డిని నిలబెట్టాలనే ఆలోచన కాంగ్రెస్ హైకమాండ్ చేస్తోంది. ఇంకా చదవండి
వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర ప్రారంభం
ఏపీలో పేదల బతుకులు బాగు చేసిన ఘనత సీఎం జగన్ దేనని వైసీపీ నేతలు ప్రశంసించారు. ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా వైసీపీ 'సామాజిక సాధికార యాత్ర' పేరుతో చేపట్టిన బస్సు యాత్రం గురువారం ఇచ్ఛాపురం నుంచి ప్రారంభంమైంది. మొత్తం 60 రోజుల పాటు మొత్తం 175 నియోజకవర్గాల్లో ఈ యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రలో ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు బయలు దేరారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, ప్రజలకు అందిన సంక్షేమాన్ని నేతలు ప్రజలకు వివరించనున్నారు. మధ్యాహ్నం ఇచ్ఛాపురం బస్టాండులో సామాజిక సాధికార యాత్ర బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇంకా చదవండి
మేడిగడ్డ కుంగడానికి కారణం అదేనా?
మేడిగడ్డ కుంగడానికి కారణాలను కేంద్ర నిపుణుల కమిటీ ప్రాథమికంగా నిర్ధారించింది. పునాదుల వద్ద ఇసుక కొట్టుకుకోవడం వల్లే మేడిగడ్డ బ్యారేజీలో పియర్స్‌కు నష్టం వాటిల్లినట్లు కేంద్ర జల సంఘం నియమించిన కమిటీ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. మేడిగడ్డ ఆనకట్టపైన కొంతభాగం కుంగిపోవడం, ఏడో బ్లాక్‌లోని పియర్‌కు పగుళ్లు ఏర్పడిన సంగతి తెలిసిందే. దీనిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వడానికి కేంద్ర జల సంఘం చీఫ్ ఇంజినీర్ అనిల్‌జైన్ ఛైర్మన్‌గా ఆరుగురు సభ్యులతో సీడబ్ల్యూసీ కమిటీని నియమించింది. ఇంకా చదవండి