అన్వేషించండి

Telangana Elections 2023 : కేసీఆర్‌పై రేవంత్ మాత్రమే కాదు - కేటీఆర్, హరీష్‌లపైనా కీలక నేతల పోటీ ! కాంగ్రెస్ ప్లాన్ చేస్తోందా ?

బీఆర్ఎస్ ముఖ్య నేతలపై కాంగ్రెస్ సీనియర్ నేతలు పోటీ చేసే అవకాశం ఉంది. స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

 

Congress Plan :   తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేతలు బీఆర్ఎస్ అగ్రనేతలపై పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు.   కేసీఆర్, కేటీఆర్, హరీష్‌లపై రేవంత్, ఉత్తమ్, కోమటిరెడ్డిలను నిలబెట్టాలని ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు. రెండో జాబితాలో ఇదే హైలెట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.  తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. గజ్వేల్‌లో ఆయనపై బీజేపీ తరపున ఈటల పోటీ చేస్తున్నారు. కామారెడ్డిలో రేవంత్ రెడ్డిని నిలబెట్టాలనే ఆలోచన కాంగ్రెస్ హైకమాండ్ చేస్తోంది. 
 
కామారెడ్డి నుంచి రేవంత్ పోటీకి హైకమాండ్ గ్రీన్ సిగ్నల్         

కామారెడ్డిలో పోటీకి రేవంత్ రెడ్డి సై అన్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.  కామారెడ్డి ఎవరికీ కంచుకోట కాదు. ఎప్పుడూ ఎకపక్ష ఎన్నికలు జరగలేదు. తెలంగాణ ఉద్యమం హైలో ఉన్నప్పుడు కూడా గట్టి పోటలే జరిగాయి.  గంపా గోవర్దన్‌  2009లో టిడిపి పక్షాన గెలిచినా, ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేసి ,టిఆర్‌ఎస్‌ లో చేరి తిరిగి ఉప ఎన్నికలో విజయం సాధించారు.    గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గంప గోవర్ధన్ కేవలం నాలుగు వేల ఓట్ల తేడాతోనే విజయం సాధించారు. గత రెండు ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ ఎక్కువగా ఉన్నప్పటికీ.. తక్కువ ఓట్లతోనే గంప గోవర్ధన్ బయటపడ్డారు. ఈ సారి రేవంత్ రెడ్డి బరిలోకి దిగితే.. పరిస్థితి వేరుగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం అంచనా  వేస్తోంది.  

కేటీఆర్, హరీష్‌పైనా కీలక నేతల పోటీ        
    
కేటీఆర్‌, హరీశ్‌లకు గట్టి పోటీనిచ్చేందుకు సీనియర్లను రంగంలోకి దింపాలనే చర్చ కాంగ్రెస్ ఎన్నికల కమిటీలో జరిగిందని తెలుస్తోంది.  సీఎం కేసీఆర్‌కు వారసుడిగా ఎన్నికల బరిలో ఉన్న మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మరో మంత్రి హరీశ్‌రావుపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పోటీ చేసేలా.. టికెట్లను ఖరారు చేయాలని ఆలోచిస్తున్నారు. రేవంత్ రెడ్డి పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఉత్తమ్, కోమటిరెడ్డిలు హైకమాండ్ కు ఏం చెప్పారన్నదానిపై స్పష్టత లేదు. హైకమాండ్ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.  మరో వైపు పార్టీలో మరోసారి చేరబోతున్న రాజగోపాల్ రెడ్డి గజ్వేల్ లో కేసీఆర్ పై పోటీ చేయడానికి సిద్ధమని ప్రకటించారు. ఆయన కావాలని అన్నారో.. కాంగ్రెస్ హైకమాండ్ కు అలాంటి ఆలోచన ఉందో స్పష్టత లేదు. 

హై ప్రోఫైల్ నియోజకవర్గాలుగా మారనున్న గజ్వేల్, కామారెడ్డి  !       
 
తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎప్పుడూ సేఫ్ గేమ్ ఆడతారు.  కానీ.. తప్పించుకోలేని  పరిస్థితిని హైకమాండ్ సృష్టిస్తోందని అంటున్నారు.  ఓ రకంగా  మగ్గురు అగ్రనేతలకు అగ్నిపరీక్షే.  అగ్రనేతలపై అగ్రనేతలు పోటీ పడితే.. ముఖాముఖి తేల్చుకున్నట్లు అవుతుంది. ఆ నియోజకవర్గాలు అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. అక్కడి పోరాటం రాష్ట్ర స్థాయి ఎన్నికలపై కూడా ప్రభావం చూపుతుంది. అందుకే... తెలంగాణ ఎన్నికల్లో పోటీ పడేవారి కాంబినేషన్లు సంచలనం సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి.. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CID VijayPal: ఏపీ సీఐడీ మాజీ డీఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్ - రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసుల దూకుడు!
ఏపీ సీఐడీ మాజీ డీఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్ - రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసుల దూకుడు!
Telangana Airports: తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
Akhil Akkineni Engagement: సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలుRail Bus in Mysore Rail Museum | తెలుగు రాష్ట్రాలకే ప్రత్యేకమైన రైలు బస్సు ఇలాగే ఉండేది | ABP DesamPrithvi Shaw Unsold IPL 2025 Auction | అద్భుతమైన భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకున్న పృథ్వీ షా | ABP DesamMS Dhoni Auction Plan CSK IPL 2025 Team | ధోని ప్లాన్ వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CID VijayPal: ఏపీ సీఐడీ మాజీ డీఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్ - రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసుల దూకుడు!
ఏపీ సీఐడీ మాజీ డీఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్ - రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసుల దూకుడు!
Telangana Airports: తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
Akhil Akkineni Engagement: సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
Jio Best Prepaid Plan: జియో బెస్ట్ 84 రోజుల ప్లాన్ ఇదే - ఫ్రీగా డిస్నీప్లస్ హాట్‌స్టార్ కూడా!
జియో బెస్ట్ 84 రోజుల ప్లాన్ ఇదే - ఫ్రీగా డిస్నీప్లస్ హాట్‌స్టార్ కూడా!
Zainab Ravdjee : అఖిల్ చేసుకోబోయే అమ్మాయి జగన్ సలహాదారు కుమార్తె -  జైనాబ్ రావడ్జీ గురించి కొన్ని విషయాలు ఇవే
అఖిల్ చేసుకోబోయే అమ్మాయి జగన్ సలహాదారు కుమార్తె - జైనాబ్ రావడ్జీ గురించి కొన్ని విషయాలు ఇవే
Maruti Suzuki Export Record: విదేశాల్లోనూ దూసుకుపోతున్న మారుతి సుజుకి - ఏకంగా 30 లక్షల అమ్మకాలతో..!
విదేశాల్లోనూ దూసుకుపోతున్న మారుతి సుజుకి - ఏకంగా 30 లక్షల అమ్మకాలతో..!
Maharastra: మహారాష్ట్రలోని ప్రతిపక్ష నేతలకూ జగన్ పరిస్థితే - ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరికీ లేదు !
మహారాష్ట్రలోని ప్రతిపక్ష నేతలకూ జగన్ పరిస్థితే - ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరికీ లేదు !
Embed widget