Top Headlines Today: చంద్రయాన్ ప్రయాణం మొదలు! విజయవంతంగా భూకక్ష్యలోకి - నేటి టాప్ న్యూస్
నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
విజయవంతంగా భూకక్ష్యలోకి చంద్రయాన్ 3, మూడు దశలు సక్సెస్ - ఇస్రో ప్రకటన
చంద్రయాన్ 3 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. మొత్తం మూడు దశలనూ దాటుకుని రాకెట్ కక్ష్యలోకి దూసుకెళ్లింది. ప్రపల్షన్ మాడ్యూల్ రాకెట్ నుంచి విడిపోయినట్టు ఇస్రో ప్రకటించింది. చంద్రయాన్ 3 ఉపగ్రహం చంద్రుడి వైపుగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టిందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ప్రకటించారు. చంద్రయాన్ 3 ని ఎల్వీఎం 3 రాకెట్ ద్వారా భూ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టామని తెలిపారు. 24 రోజుల పాటు ఇది భూమి చుట్టూ ప్రదక్షిణలు చేయనుంది. ఇంకా చదవండి
జనసేనలోకి పంచకర్ల రమేష్ బాబు - పెందుర్తి నుంచే పోటీకి రెడీ !
వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు జనసేన పార్టీలో చేరేందుకు సిద్దమవుతున్నారు. జులై 17న రమేష్ బాబు పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నారు.రెండు రోజుల క్రితం జిల్లా వైఎస్ఆర్‌సీపీ పార్టీ అధ్యక్ష పదవికి పంచకర్ల రమేష్ బాబు రాజీనామా చేశారు. పార్టీలో జరుగుతున్న పరిణమాలకు మనస్తాపం చెంది రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నో ఆశయాలు, ఆశలతో రాజకీయాల్లోకి వచ్చానని అవి చేసే పరిస్థితి లేనపుడు పదవిలో కొనసాగడం సరికాదని భావించి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో జరుగుతున్న పరిణామాలను అధిష్టానం దృష్టికి తీసుకు వచ్చేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఇంకా చదవండి
ఆగస్టు నుంచి పట్టాలెక్కబోతున్న గృహలక్ష్మీ పథకం
ఆగస్టు నెల నుంచి రాష్ట్రంలో గృహలక్ష్మీ పథకం ప్రారంభం కాబోతుంది. సొంతస్థలం ఉండి, ఇంటిని నిర్మించుకునేందుకు ఆసక్తి ఉన్న వాళ్లకు మంచి రోజులు వచ్చాయి. గృహలక్ష్మి పేరిట తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన నూతన పథకం వచ్చే నెల(ఆగస్టు) నుంచే మొదలు కాబోతుంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసింది. దశల వారీగా లబ్ధిదారులను ఎంపిక చేయబోతుంది. గృహలక్ష్మీ పథకం అమలుకు సంబంధించిన కార్యాచారణ విధానాల గురించి కూడా పూర్తిగా తెలియాల్సి ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి ఆ పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంకా చదవండి
చంద్రయాన్-3 మిషన్ - ల్యాండర్, రోవర్ తయారీలో హైదరాబాద్ సంస్థల కీలక భాగస్వామ్యం
చంద్రయాన్-3 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. శుక్రవారం (జూన్ 14) మధ్యాహ్నం 2.35 గంటలకు శ్రీహరి కోట నుంచి మార్క్ ఎం4 వాహన నౌక రోదసిలోకి దూసుకుపోయేందుకు సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించి కౌంట్ డౌన్ ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ - ఇస్రో గురువారం మధ్యాహ్నం 1.05 నిమిషాలకు ప్రారంభించింది. 2019 లో చెదిరిన కలను ఈసారి నిజం చేసి చూపాలన్న పట్టుదలతో ఈ ప్రయోగాన్ని అత్యంత ప్రతిష్టాత్మంగా తీసుకుని నిర్వహిస్తోంది. జులై 14వ తేదీన ప్రయోగం జరగనుంది. ఆగస్టు 23 లేదా 24న చంద్రుడిపై ల్యాండర్ దిగుతుంది. మొత్తం 40 రోజుల పాటు ప్రయాణించి చంద్రుడిని చేరుతుంది చంద్రయాన్-3. చంద్రయాన్-3 మిషన్ లో హైదరాబాద్ కు చెందిన సంస్థలు కీలక భూమిక పోషిస్తున్నాయి. హైదరాబాద్ లోని ఏరోస్పేస్ అండ్ ప్రెసిషన్ ఇంజినీరింగ్ కంపెనీలు జియోసింక్రోనస్ లాంచ్ వెహికల్ మార్క్ III (GSLV Mk-III) అంతరిక్ష నౌక ల్యాండర్, రోవర్ కు సంబంధించిన భాగాల తయారీలో భాగమయ్యాయి. ఇంకా చదవండి
ఎయిర్ పోర్టు మెట్రో రేసులో ఎల్ అండ్ టీ, ఎన్‌సీసీ
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును దక్కించుకునేందుకు ఎల్ అండ్ టీ (లార్సెన్ అండ్ టూబ్రో), ఎన్‌సీసీ లిమిటెడ్ (గతంలో నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ)లు రేసులో ఉన్నాయి. ఈ రెండు సంస్థలు మాత్రమే టెండర్ వేశాయి. మొత్తం 5,688 కోట్ల టెండర్ కోసం బిడ్‌లను సమర్పించాయి. రాయదుర్గ్ - ఎయిర్‌పోర్ట్ స్ట్రెచ్ కోసం ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్ (ఐపీసీ) కాంట్రాక్ట్‌ను హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ (హెచ్‌ఎఎమ్‌ఎల్) గురువారం ప్రారంభించింది. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో ప్రాజెక్ట్ కోసం గ్లోబల్ టెండర్‌లను ఆహ్వానించగా.. జూన్ 14న ప్రీ-బిడ్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆల్ స్టమ్, సైమెన్స్, టాటా ప్రాజెక్ట్స్, ఈర్కాన్, ఆర్వీఎన్ఎల్, బీఈఎంఎల్, పండ్రోల్ రహీ టెక్నాలజీస్, ఎల్ అండ్ టీ సహా 13 జాతీయ, ప్రపంచ సంస్థల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. కానీ గురువారం జరిగిన బిడ్డింగ్‌లో మాత్రం కేవలం రెండు సంస్థలే పాల్గొన్నాయి. ఇంకా చదవండి