(Source: ECI/ABP News/ABP Majha)
Chandrayaan 3 Launched: విజయవంతంగా భూకక్ష్యలోకి చంద్రయాన్ 3, మూడు దశలు సక్సెస్ - ఇస్రో ప్రకటన
Chandrayaan 3 Launched: చంద్రయాన్ 3 రాకెట్ విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశించినట్టు ఇస్రో ప్రకటించింది.
Chandrayaan 3 Launched:
చంద్రయాన్ 3 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. మొత్తం మూడు దశలనూ దాటుకుని రాకెట్ కక్ష్యలోకి దూసుకెళ్లింది. ప్రపల్షన్ మాడ్యూల్ రాకెట్ నుంచి విడిపోయినట్టు ఇస్రో ప్రకటించింది. చంద్రయాన్ 3 ఉపగ్రహం చంద్రుడి వైపుగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టిందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ప్రకటించారు. చంద్రయాన్ 3 ని ఎల్వీఎం 3 రాకెట్ ద్వారా భూ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టామని తెలిపారు. 24 రోజుల పాటు ఇది భూమి చుట్టూ ప్రదక్షిణలు చేయనుంది. ఆగస్టు 23 లేదా 24 న చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అవుతుందని ఇస్రో అంచనా వేస్తోంది. ఇక్కడ సాఫ్ట్‌ల్యాండింగ్ అయితే...ఈ ప్రయోగం పూర్తి స్థాయిలో విజయవంతం అయినట్టు లెక్క.ఈ ప్రయోగంపై స్పేస్ మినిస్టర్ డాక్టర్ జితేంద్ర సింగ్ స్పందించారు. ఈ చరిత్రలో భాగమవుతున్నందుకు ఎంతో గర్వంగా ఉందని వెల్లడించారు. ఇండియా మొత్తం గర్వపడేలా చేసినందుకు ఇస్రోకి అభినందనలు తెలిపారు. కౌంట్‌డౌన్ పూర్తైన వెంటనే రాకెట్ నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకెళ్లింది. మొత్తం మూడు దశల్లో ఒక్కో దశను సక్సెస్‌ఫుల్‌గా దాటుకుంటూ వెళ్లింది రాకెట్. ఆ తరవాత ప్రపల్షన్ మాడ్యూల్ విడిపోయి విజయవంతంగా చంద్రయాన్ 3 కక్ష్యలోకి చేరుకుంది. మూడో దశ పూర్తైన వెంటనే ఇస్రో శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేశారు. ఒకరికొకరు అభినందనలు చెబుతూ సంబరాలు చేసుకున్నారు. 3.5లక్షల కిలోమీటర్ల మేర ప్రయాణించిన తరవాత చంద్రయాన్ 3 చంద్రుడి కక్ష్యలోకి చేరుకుంటుంది.
LVM3 M4/Chandrayaan-3 Mission:
— ISRO (@isro) July 14, 2023
LVM3 M4 vehicle🚀 successfully launched Chandrayaan-3🛰️ into orbit.
మిషన్ లక్ష్యాలేంటి..?
1. చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్‌గా ల్యాండ్ అయ్యేలా చేయడం
2. రోవర్ సరైన విధంగా చంద్రుడిపై తిరిగేలా చేయడం
3.సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్2020 జనవరిలో ఇస్రో తొలిసారి చంద్రయాన్ 3పై ప్రకటన చేసింది. డిజైన్‌పై పని చేస్తున్నామని, త్వరలోనే స్పేస్‌క్రాఫ్ట్ అసెంబ్లింగ్ పూర్తవుతుందని అప్పట్లో వెల్లడించింది. చంద్రయాన్ 2 కన్నా పకడ్బందీదా దీన్ని డిజైన్ చేశారు. ముఖ్యంగా ల్యాండర్ లెగ్స్‌ని మరింత దృఢంగా తయారు చేశారు. నిజానికి 2021లోనే ప్రయోగించాలని భావించినా కొవిడ్ కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది. ఇక సెకండ్ వేవ్ వల్ల మరింత జాప్యం జరిగింది. అప్పటికే ప్రపల్షన్ సిస్టమ్ టెస్టింగ్ పూర్తైంది. ఇన్ని రోజుల తరవాత జులై 14న లాంఛ్ చేస్తామని ఇస్రో అధికారికంగా ప్రకటించింది. Launch Vehicle Mark 3 ద్వారా ఈ ప్రయోగం చేపట్టింది. ల్యాండర్, రోవర్ మాడ్యూల్ వేరువేరుగా ఉన్న ఈ స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడి సౌత్ పోల్కి సమీపంలో ల్యాండ్ అవ్వనుంది. ప్రపల్షన్ మాడ్యూల్ భూమి చుట్టూ పలుసార్లు తిరిగి చంద్రుడిపై దిగుతుంది. చంద్రుడిపై గ్రావిటీకి తగ్గట్టుగా మాడ్యూల్ మెల్లగా కిందకు దిగుతుంది. ల్యాండర్ విడిపోతుంది. లాంఛ్ అయినప్పటి నుంచి సరిగ్గా నెల రోజుల తరవాత చంద్రుడిపై మాడ్యూల్ దిగుతుంది. అయితే..చంద్రుడిపై సన్‌రైజ్ ఎలా ఉందన్న దానిపైనే ల్యాండింగ్ ఎప్పుడవుతుందన్నది ఆధారపడి ఉంటుంది. సన్‌రైజ్‌లో ఆలస్యం జరిగితే..ల్యాండింగ్ కూడా లేట్ అవుతుంది. అదే జరిగితే...ఇస్రో ల్యాండింగ్‌ని సెప్టెంబర్‌కి రీషెడ్యూల్ చేస్తుంది. కానీ...ఈ మిషన్‌లో అసలైన క్రూషియల్ పాయింట్ ఇదే. ల్యాండింగ్‌కి కనీసం 15 నిముషాల సమయం పడుతుంది.
Also Read: Chandrayaan 3: పిట్టల్ని తోలే టెక్నిక్‌తో చంద్రయాన్ 3 ప్రయోగం