Top Headlines Today: ఏపీలో కరెంటుపై తెలంగాణ మంత్రి సెటైర్లు; మళ్లీ తెరపైకి పసుపుబోర్డు - నేటి టాప్ న్యూస్
నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
మళ్లీ తెరపైకి పసుపు బోర్డు ఏర్పాటు
ఎన్నికలు వచ్చినా ప్రతిసారి నిజామాబాద్‌లో పసుపు బోర్డు తెరపైకి రావడం కామన్ గా మారిపోయింది. తాజాగా మరోసారి పసుపు బోర్డు ఏర్పాటుపై మళ్లీ జోరుగా చర్చ సాగుతోంది. సుగంధ ద్రవ్యాల బోర్డు పరిధిలోకే వచ్చే పసుపు పంటకు ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్ చాలా ఏళ్లుగా ఉంది. నిజామాబాద్ లో పసుపు బోర్డు కోసం ప్రజలు ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. వివిధ రకాల్లో నిరసనలు, ఆందోళనలు నిర్వహించినా ప్రజల డిమాండ్ మాత్రం నెరవేరలేదు. గత ఎన్నికల్లో బీజేపీ బోర్డు ఏర్పాటు చేస్తామని బీజేపీ హామీ కూడా ఇచ్చింది. ఇంకా చదవండి
ఏపీలో కరెంట్ తీగలపై బట్టలారేస్తున్నారు, తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి వ్యంగ్యాస్త్రాలు
ఏపీలో పరిస్థితులపై తెలంగాణ మంత్రులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మొన్న కేటీఆర్, నిన్న హరీశ్ రావు, నేడు ఎర్రబెల్లి దయాకర రావు...ఒకరి తర్వాత ఒకరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీలోని విద్యుత్ కోతలు, భూముల ధరలపై మంత్రి ఎరబెల్లి దయాకరరావు హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ వస్తే...కరెంట్ ఉండదని గతంలో ముఖ్యమంత్రులుగా పని చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి...అసెంబ్లీ అన్న వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుతం తెలంగాణలో 24 గంటల కరెంట్ ఇస్తుంటే.. ఏపీలో మాత్రం కరెంట్ లేక బట్టలు ఆరేసుకుంటున్నారని అన్నారు. తెలంగాణలో భూముల ధరలు పెరిగితే.. ఆంధ్రప్రేదశ్ లో మాత్రం భారీగా పడిపోయాయని ఆరోపించారు. ఇంకా చదవండి
చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామని ప్రకటన - ఎంపీ మాధవ్ హౌస్ అరెస్ట్ !
గుంతకల్లులో చంద్రబాబు సభను అడ్డుకుంటానని ప్రకటించిన ఎంపీ గోరంట్ల మాధవ్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అనంతపురంలో ఉన్న గోరంట్ల మాధవ్ ఇంట్లో నుంచి ఆయనను బయటకు రాకుండా పోలసులు అడ్డుకున్నారు. చంద్రబాబును అడ్డుకునేందుకు వెళ్లకూడదని పోలీసుల ఆంక్షలు విధించారు. దీంతో గోరంట్ల మాధవ్ తన అనుచరులతో కలసి ఇంటి వద్దనే నిరసన తెలిపారు. చంద్రబాబు దిష్టిబొమ్మ, ఫ్లెక్లీలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇంకా చదవండి
మార్గదర్శిపై మరో కేసు - ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన సీఐడీ ఏడీజీ !
మార్గదర్శి చిట్ ఫండ్స్ లో చిట్లు వేసి నష్టపోయానని అన్నపూర్ణదేవి అనే మహిళ ఫిర్యాదు చేయడంతో సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. అన్నపూర్ణాదేవితో పాటు సీఐడీ అధికారులు అమరావతిలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వివరాలు చెప్పారు. ఇంకా చదవండి
తిరుమలలో ఆపరేషన్ చిరుత కొనసాగుతుందన్న భూమన- భక్తుల క్షేమమే తొలి ప్రాధాన్యతని వివరణ
తిరుమల మెట్ల మార్గంలో మరో చిరుత బోనుకు చిక్కింది. అలిపిరి నడకమార్గంలో నరసింహస్వామి ఆలయం 7వ మైలు మధ్య ప్రాంతంలో బోనులో చిరుత చిక్కినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అక్కడికి చేరుకుని పరిశీలించారు. తిరుమల మెట్ల మార్గంలో ఆపరేషన్ చిరుత కొనసాగుతోందని తెలిపారు. రాత్రి పన్నెండు ఒంటి గంట మధ్య ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో మరో చిరుత చిక్కినట్లు చెప్పుకొచ్చారు. ఇంకా చదవండి