అన్వేషించండి

Tirumala: తిరుమలలో ఆపరేషన్ చిరుత కొనసాగుతుందన్న భూమన- భక్తుల క్షేమమే తొలి ప్రాధాన్యతని వివరణ

Tirumala: తిరుమలలో మరో చిరుత బోనుకు చిక్కింది. నరసింహస్వామి ఆలయం-7వ మైలు మధ్య ప్రాంతంలో చిక్కింది.

Tirumala: తిరుమల మెట్ల మార్గంలో మరో చిరుత బోనుకు చిక్కింది. అలిపిరి నడకమార్గంలో నరసింహస్వామి ఆలయం 7వ మైలు మధ్య ప్రాంతంలో బోనులో చిరుత చిక్కినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌ రెడ్డి అక్కడికి చేరుకుని పరిశీలించారు. తిరుమల మెట్ల మార్గంలో ఆపరేషన్ చిరుత కొనసాగుతోందని తెలిపారు. రాత్రి పన్నెండు ఒంటి గంట మధ్య ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో మరో చిరుత చిక్కినట్లు చెప్పుకొచ్చారు. 

రెండు నెలల కాలంలో మొత్తం ఐదు చిరుతలను అధికారులు పట్టుకున్నామని.. భక్తుల క్షేమం, భద్రత, సౌలభ్యం కల్పించడానికి టీటీడీ పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు టీటీడీ ఛైర్మన్ వెల్లడించారు. అటవీశాఖ అధికారుల సహకారంతో వారి నిరంతర పర్యవేక్షణలో అలుపెరగకుండా ఆపరేషన్ చిరుత కొనసాగుతుందని అన్నారు. గుంపులు గుంపులుగా ప్రయాణించమని భక్తులకి నిరంతరం విజ్ఞప్తి చేయడంతోపాటుగా వారి వెంట భద్రత సిబ్బందిని పంపుతున్నామని ఆయన చెప్పారు. భక్తులకు ఎలాంటి  ఇబ్బంది తలెత్తకుండా టీటీడీ ఈవో ధర్మారెడ్డి నేతృత్వంలో నిరంతర కృషి జరుగుతోందన్నారు. ఈ క్రమంలోనే రెండు నెలల్లో ఐదు చిరుతలను పట్టుకున్నట్లు చెప్పారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి చిన్న పిల్లలను, వారి తల్లిదండ్రులను నడక మార్గం గుండా అనుమతించడం లేదన్నారు. నిన్నటి నుంచి అలిపిరి నడక మార్గంలో ఊత కర్రలను ఇస్తున్నామని వెల్లడించారు. కర్రలపై ఇష్టం వచ్చినట్లుగా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని, కర్రలు ఇచ్చి మా పని అయిపోయిందని తాము ఎప్పుడు అనుకోవడం లేదని చెప్పుకొచ్చారు. కేవలం భక్తులకు ఆత్మస్థైర్యం అందించేందుకే కర్రలు అందిస్తున్నామన్నారు. 200 మంది అటవీశాఖ సిబ్బంది నిరంతరాయంగా శ్రమిస్తున్నారని, యాత్రికుల విషయంలో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని, విమర్శలకు, బూతులకు జడిసి భద్రతా కార్యక్రమాలను ఆపేది లేదంటూ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలియజేశారు. 

తాజాగా చిక్కిన చిరుతను క్వారంటైన్ కు తరలిస్తున్నట్లు తిరుపతి వైల్డ్ లైఫ్ డిఎఫ్ఓ సతీష్ రెడ్డి తెలిపారు. దాడి చేసిన చిరుతను గుర్తించేందుకు శాంపుల్స్ ని పంపించినట్లు చెప్పారు. నివేదిక వచ్చిన తర్వాత ఏ చిరుత దాడి చేసిందో నిర్ధారణకు వస్తుందన్నారు. నడకదారికి నలువైపులా వన్యమృగాల సంచారం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రెండు నడకమార్గాల్లో నిరంతరాయంగా అటవీ శాఖ అధికారుల పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు సతీష్ రెడ్డి తెలిపారు.

ఐదు చిరుతలు పట్టుకున్నారిలా!

24 జూన్‌ 2023 మొదటి చిరుతను టీటీడీ అధికారులు, అటవీశాఖ సిబ్బంది కలిసి బంధించారు. ఇకపై అంతా ప్రశాంతమే అనుకున్నారంతా కానీ ఆగస్టుల అసలు కథ మొదలైంది. చిరుతలో వైల్డ్ యాంగిల్‌ను ప్రపంచం చూసింది. 

చిన్నారి తినేసిన చిరుత వచ్చే మార్గాలను అన్వేషించారు అధికారులు. అది తిరిగే మార్గాల్లో ప్రత్యేక ట్రాప్‌లు ఏర్పాటు చేశారు కెమెరాలు ఫిట్ చేశారు. ఇలా అష్టదిగ్బంధం చేసిన తర్వాత మరో చిరుత బోనులో పడింది. ఆగష్టు 14 రెండో చిరుత అధికారుల ట్రాప్‌కు చిక్కింది. అక్కడకు మూడు రోజుల తర్వాత మూడో చిరుతను ఆగష్టు 17న పట్టుకున్నారు. 

ఇక చిరుతలు లేవేమో అనుకున్నారు కానీ భక్తుల్లో ఎక్కడో చోట భయం కలిగింది. కొందరు సీనియర్ అధికారులు మాత్రం ఇంకా చిరుతలు ఉండనే ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు. వారి అనుమానమే నిజమైంది. మరోసారి చిరుత జాడను పసిగట్టారు అధికారులు. 
దీంతో మరోసారి ట్రాప్‌ ఏర్పాటు చేశారు. అనుకున్నట్టుగానే ఎర కోసం వచ్చిన చిరుత ఆగష్టు 28న బోనులో చిక్కింది. అంతా ఊపిరి పీల్చుకున్న టైంలో వారం రోజుల తర్వాత ఇవాళ సెప్టెంబర్‌ 6వ మరో చిరుత చిక్కింది. ఇది ఇక్కడితో ఆగుతుందా ఇంకా ఉన్నాయా అన్న అనుమానం భక్తుల్లో పోవడం లేదు.

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Breaking News:తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget