Gorantla Madhav : చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామని ప్రకటన - ఎంపీ మాధవ్ హౌస్ అరెస్ట్ !
చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామని ప్రకటించడంతో హిందూ పురం ఎంపీ గోరంట్ల మాధవ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Gorantla Madhav : గుంతకల్లులో చంద్రబాబు సభను అడ్డుకుంటానని ప్రకటించిన ఎంపీ గోరంట్ల మాధవ్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అనంతపురంలో ఉన్న గోరంట్ల మాధవ్ ఇంట్లో నుంచి ఆయనను బయటకు రాకుండా పోలసులు అడ్డుకున్నారు. చంద్రబాబును అడ్డుకునేందుకు వెళ్లకూడదని పోలీసుల ఆంక్షలు విధించారు. దీంతో గోరంట్ల మాధవ్ తన అనుచరులతో కలసి ఇంటి వద్దనే నిరసన తెలిపారు. చంద్రబాబు దిష్టిబొమ్మ, ఫ్లెక్లీలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారని గోరంట్ల మాధవ్ విమర్శఇంచారు. చంద్రబాబు సీఎం జగన్ తో పాటు వైఎస్ విజయమ్మను కించపరిచారని ఆరోపించారు. చంద్రబాబును మహిళా లోకం క్షమించదు. ముక్కు నేలకు రాసి చంద్రబాబు.. వెంటనే క్షమాపణ చెప్పాలి. లేదంటే చంద్రబాబు పర్యటనను అడ్డుకుని తీరతామని అని హెచ్చరించారు . అనుచిత వ్యాఖ్యలపై చంద్రబాబు ను నిలదీస్తానని, అందుకోసం ఆయన శిబిరం వద్దకు వెళ్తానని ఎంపీ గోరంట్ల తెలిపారు. బుధవారం అనంతపురం జిల్లా రాయదుర్గం బహిరంగ సభలో ప్రభుత్వాన్ని విమర్శించిన చంద్రబాబు జగన్ పుట్టుకపై వ్యాఖ్యలు చేశారని.... చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని వైఎస్ఆర్‌సీపీ డిమాండ్ చేస్తోంది.
వాలంటీర్లతో వైసీపీ లీడర్ల రహస్య సమావేశం-నెల్లూరులో పొలిటికల్ హీట్
ఇటవలి కాలంలో చంద్రబాబు లోకేష్ పర్యటనల్లో ఉద్రిక్తలు ఏర్పడుతున్నాయి. చంద్రబాబు అంగళ్లు పర్యటన సందర్భంగా వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు నిరసన తెలిపిన సమయంలో ఏర్పడిన ఘటనలు ఉద్రిక్తతకు దారి తీశాయి. తర్వాత పుంగనూరులోనూ అదే పరిస్థితి ఏర్పడింది. అనంతర పరిణామాల్లో చంద్రబాబుపై హత్యాయత్నం కేసు కూడా నమోదయింది. ఉద్దేశపూర్వకంగానే పోలీసులు... వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తల నిరసనలకు అనుమతి ఇస్తున్నారని తద్వారా ఘర్షణలు చోటు చేసుకునే పరిస్థితి కల్పిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపమలు గుప్పిస్తున్నారు.
అప్పటి వరకూ రిజర్వేషన్‌లు ఉండాల్సిందే, అది వాళ్లకిచ్చే గౌరవం - RSS చీఫ్ మోహన్ భగవత్
అదే సమయంలో లోకేష్ పాదయాత్రోలనూ వివాదం ఏర్పడింది. భీమవరం నియోజకవర్గంలో జరిగిన రాళ్లదాడి ఘటనలో హత్యాయత్నం కేసులు పెట్టి యాభై మందికిపైగా యువగళం వాలంటీర్లు.. టీడీపీ నేతల్ని అరెస్ట్ చేశారు. ఇక్కడ కూడా దాడులు చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకోలేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇలాంటివన్నీ ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారని.. పోలీసులు సహకరిస్తున్నారని టీడీపీ నేతలంటున్నారు. గోరంట్ల మాధవ్ మరోసారి చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడానికి వెళ్తే .. అలాంటి ఘర్షణ ఏర్పడుతుదంన్న కారణంగా పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేసినట్లుగా భావిస్తున్నారు.