![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
రూ.12 కోట్లు పలికిన టైటానిక్ ప్రయాణికుడి గోల్డ్‌వాచ్, వేలంలో రికార్డు
Titanic Passengers: టైటానిక్ ప్యాసింజర్ పాకెట్‌వాచ్‌ని వేలం చేయగా అది రూ.12 కోట్లకు అమ్ముడుపోయింది.
![రూ.12 కోట్లు పలికిన టైటానిక్ ప్రయాణికుడి గోల్డ్‌వాచ్, వేలంలో రికార్డు Titanics passengers gold pocket watch sells for record $1.46mn రూ.12 కోట్లు పలికిన టైటానిక్ ప్రయాణికుడి గోల్డ్‌వాచ్, వేలంలో రికార్డు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/28/be78987dff923d8f2f22f76fbd88cb7a1714285158198517_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Titanic Passenger's Gold Watch: టైటానిక్ మునిగిపోయి 112 ఏళ్లు గడిచిపోయాయి. అయినా ఇప్పటికీ దాని గురించి ప్రపంచం మాట్లాడుకుంటూనే ఉంది. అది మునిగిపోయిన చోట శిథిలాలు చూసేందుకు ప్రత్యేకంగా టూర్ ప్యాకేజ్‌లూ అందుబాటులోకి వచ్చాయి. టైటానిక్‌కి ఎంత క్రేజ్ ఉందో మరోసారి రుజువైంది. ఈ ఓడలో ప్రయాణించిన ఓ సంపన్నుడి పాకెట్ వాచ్‌ని వేలం వేస్తే 1.46 మిలియన్ డాలర్లు పలికింది. అంటే మన కరెన్సీలో రూ.12 కోట్లపైమాటే. ఇప్పటి వరకూ టైటానిక్‌కి సంబంధించిన ఏ వస్తువూ ఈ స్థాయిలో ధర పలకలేదు. అప్పట్లో John Jacob Astor అనే ఓ బిజినెస్‌మేన్ టైటానిక్‌లో ప్రయాణించాడు. ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఆయన జేబులో దొరికిన ఈ Pocket Watch ని వేలం వేయగా అమెరికాకి చెందిన ఇద్దరు వ్యక్తులు కొనుగోలు చేశారు. టైటానిక్ షిప్ మునిగిపోయినప్పుడు ఓ వ్యక్తి వయోలిన్ వాయించాడని చెబుతారు. ఆ వయోలిన్‌ని వేలం వేయగా అది 1.1 మిలియన్ పౌండ్‌లకు అమ్ముడుపోయింది. ఇప్పుడు వాచ్‌ని వేలం వేసిన సంస్థే 2013లో ఈ వయోలిన్‌ని వేలం వేసింది.
అన్ని ఫీజ్‌లు, ట్యాక్స్‌లు కలుపుకుని గడియారానికి రూ.12 కోట్లు వసూలు చేసినట్టు ఆ సంస్థ వెల్లడించింది. టైటానిక్‌కి సంబంధించిన ఏ వస్తువుని వేలం పెట్టినా ఊహించని స్థాయిలో స్పందన వస్తోందని చెబుతోంది. ఇలాంటి అరుదైన వస్తువులు ఇంట్లో ఉంచుకోడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారని అంటోంది. ఈ షిప్‌లో ప్రయాణించిన 2 వేల మందికి పైగా ప్రయాణికుల కథలపై ఇప్పటికీ ప్రపంచానికి ఆసక్తి ఉందని వివరిస్తోంది. బిజినెస్‌మేన్ జాకోబ్ టైటానిక్ మునిగిపోతోందని తెలిసినా ఏ మాత్రం టెన్షన్ పడలేదట. లైఫ్‌బోట్ గురించి ఎదురు చూడకుండా నింపాదిగా కూర్చుని ఎవరితోనే ఛాటింగ్ చేస్తూ స్మోక్ చేశాడట. ఇంతలోనే ఓడ మునిగిపోయి అంతా చనిపోయారు. దాదాపు వారం రోజుల తరవాత సముద్రంలో జాకోబ్ మృతదేహాన్ని గుర్తించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)