ఈ ఏడాదిలో నెలకో మిషన్‌తో దూసుకుపోతాం,అదే మా లక్ష్యం - ఇస్రో చీఫ్ సోమనాథ్
ISRO XPoSat: ఎక్స్‌పోశాట్ ప్రయోగం విజయవంతం అయిన సందర్భంగా ఇస్రో చీఫ్ సోమనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ISRO XPoSat Launch:
సక్సైస్‌పై సంతోషం..
XPoSat మిషన్‌ని విజయవంతంగా ప్రయోగించింది ఇస్రో. ఈ ప్రయోగం సక్సైస్‌పై ఇస్రో చీఫ్ సోమనాథ్ ఆనందం వ్యక్తం చేశారు. కొత్త ఏడాదిని ఇలా మొదలు పెట్టినందుకు చాలా సంతోషంగా ఉందని వెల్లడించారు. ముందు ముందు ఇంకెన్నో సాధిస్తామని స్పష్టం చేశారు. PSLV-C58 XPoSat మిషన్ పూర్తైన తరవాత అందరినీ ఉద్దేశించి మాట్లాడారు సోమనాథ్.
"PSLV ప్రయోగంతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. రానున్న రోజుల్లో మరి కొన్ని కీలక ప్రాజెక్ట్‌లు చేపడతాం. PSLV-C58 XPoSat శాటిలైట్‌ని సరైన కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఈ ఏడాదిలో మొత్తం 12 నెలల్లో 12 మిషన్స్‌ని చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మా సామర్థ్యాన్ని బట్టి ఈ లక్ష్యాన్ని ఇంకా పెంచుకుంటాం. టెస్టింగ్ అంతా అనుకున్న సమయానికి జరిగితే కచ్చితంగా అనుకున్నది సాధిస్తాం. మొత్తంగా ఏడాది కాలంలో 12-14 మిషన్స్ చేపట్టాలనుకుంటున్నాం"
- ఎస్ సోమనాథ్, ఇస్రో చీఫ్
VIDEO | "On January 1, 2024, yet another successful mission of PSLV has been accomplished. PSLV-C58 has placed the primary satellite - XPoSat - in the intended orbit of 650 km with 6-degree inclination," says ISRO chairperson S Somanath on launch of space agency's maiden X-Ray… pic.twitter.com/NXCOd2zD20
— Press Trust of India (@PTI_News) January 1, 2024
మరి కొన్ని అప్‌డేట్స్..
ఇదే సమయంలో Aditya-L1 మిషన్‌కి సంబంధించిన అప్‌డేట్ కూడా ఇచ్చారు సోమనాథ్. జనవరి 6 సాయంత్రం 4 గంటల సమయానికి అది Lagrange Pointకి చేరుకుంటుందని వెల్లడించారు. చంద్రయాన్-3 విజయం సాధించడంపైనా ఆనందం వ్యక్తం చేశారు. ఈ సక్సెస్‌తో టీమ్‌కి చాలా ధైర్యం వచ్చిందని,భవిష్యత్‌లో ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. దాదాపు 14 రోజుల పాటు నిర్విరామంగా పని చేసిన రోవర్ ఇప్పుడు స్లీప్‌మోడ్‌లోకి వెళ్లిపోయిందని...దాన్ని కదిలించే ప్రయత్నం కూడా చేయద్దనుకుంటున్నామని తెలిపారు. కొన్ని సాంకేతికత కారణాల వల్ల రోవర్ స్లీప్‌మోడ్‌లోకి వెళ్లినట్టు వివరించారు. కానీ..14 రోజుల్లో సేకరించిన డేటాని సరైన విధంగా వినియోగించుకుంటామని స్పష్టం చేశారు.
VIDEO | "The primary payload is made by Raman Research Institute, and the second playload is made by the Astronomy Group of URSC (U R Rao Satellite Centre), like what we did for Aditya L-1. It shows how ISRO is collaborating with other scientific institutions and developing the… pic.twitter.com/G7ZhTyARmB
— Press Trust of India (@PTI_News) January 1, 2024
కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టిన తొలి రోజే ఇస్రో అద్భుతాన్ని చేసింది. భారత్ అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రపంచదేశంలోని అమెరికా తర్వాత మరో దేశం చేయని సాహసాన్ని చేసింది. బ్లాక్‌హోల్ పరిశోధ కోసం ఎక్స్‌పోశాట్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. ఎక్స్‌పోశాట్ శాటిలైట్‌ను ఉదయం 9.10నిమిషాలకు శ్రీహరి కోటలోని సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించారు. ప్రయోగం మొదటి నుంచి అనుకున్న లక్ష్యం దిశగా పీఎస్‌ఎల్‌వీ సీ 58 దూసుకెళ్లింది. ఈ వాహకంతో ఎక్స్‌పోశాట్‌తోపటు మరో పది ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లింది.