Heroine : జోథ్‌పూర్ ప్యాలెస్‌లో హీరోయిన్ జుబేదా ఆత్మ - సినిమాకు తీసిపోని ఈ మహరాజా లవ్ స్టోరీ ధ్రిల్లరే !
Jodhpur palace : ప్యాలెస్‌లో చనిపోయిన రాణి ఆత్మ తిరగడం గురించి చాలా సినిమాలు చూసి ఉంటారు. కానీ అలాంటి కథల్లో కొన్ని నిజాయింటాయని జుబేదా అనే హీరోయిన్ గురించి తెలుసుకుంటే అనిపిస్తుంది.
Actress Zubaida married Maharaja was killed her son was beheaded : సినీ తారల జీవితాలు ఎప్పుడూ కథలను మించి ఉంటాయి. వారి జీవితాల్లో అన్ని మలుపులు ఉంటాయి. హీరోలను పక్కన పెడితే హీరోయిన్ల విషయంలో అయితే ఇక చెప్పాల్సిన పని లేదు. అలాంటి ఓ మిస్టరీ హీరోయిన్ జుబేదా. ఆమె ఆత్మ ఇప్పటికీ జోథ్ పూర్ ప్యాలెస్ లో తిరుగుతోందని చెప్పుకుంటూ ఉంటారు. కారణం ఆమె స్టోరీనే.
జుబైదా.. 1940లలో అందమైన హీరోయిన్. పలు సినిమాలలో చేసింది. అయితే హీరోయిన్ గా ఫామ్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు తల్లి అయింది. అయితే తర్వాత భర్తతో సరిపడక విడాకులు తీసుకుంది . తన కెరీర్ కొనసాగిస్తున్న సమయంలో.. జైపూర్ లో జరిగిన ఓ పార్టీ ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ పార్టీకి జోత్ పూర్ మహారాజా హన్వంత్ సింగ్ హాజరయ్యారు. జుబైదా కూడా వెళ్లారు. ఆ పార్టీలో జుబైదాను చూసిన మహారాజ్ హన్వంత్ సింగ్.. కుదురుగా ఉండలకేపోయారు. జుబైదా తిరిగి ముంబై వచ్చేసిన తర్వాత ఆయన సేవలకులతో కబురు పంపించారు. పెళ్లి చేసుకుంటానని.. తిరస్కరించవద్దని ఒత్తిడి చేశాడు. ఆన్‌లైన్‌లో పరిచయంతో డేటింగ్ - ఆ అమ్మాయికి నాలుగేళ్ల నరకం !
అయితే తన కుమారుడు తనతో పాటే ఉండేలా షరతు మీద మహారాజ్ హన్వంత్ సింగ్ ను వివాహం చేసుకునేందుకు జుబైదా అంగీకరించారు. వారి పెళ్లి జరిగింది. 1952లో ఆమె జోథ్ పూర్ లోని ఉమైద్ భవన్ ప్యాలెస్ కు రాణిగా మారారు. అయితే వారి వివాహాన్ని హన్వంత్ సింగ్ కుటుంబం పూర్తి స్థాయిలో ఆమోదించలేదన్న ప్రచారం ఉంది. తర్వాత ఓ కార్యక్రమం కోసం.. హన్వంత్ సింగ్ జుబైదా వెళ్లి వస్తున్న సమయంలో విమాన ప్రమాదం జరిగి ఇద్దరూ చనిపోయారు. అయితే ఈ విమాన ప్రమాదంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి.
పెళ్లి తర్వాత వారికి పుట్టిన ఓ బిడ్డ పెరిగి పెద్దవాడయ్యాడు. రాజుకుటుంబం పెంచి పెద్ద చేసింది.అయితే అతను కూడా ఓ రోజు.. జోథ్ పూర్ లోనే అనుమానాస్పద స్థితిలోచనిపోయి కనిపించాడు.ఈ వ్యవహారం కూడా సంచలనం సృష్టించింది.
సెలవుల్లేకుండా 104 రోజుల డ్యూటీ - చనిపోయిన ఉద్యోగి - చైనాలో ఇలాంటివి మామూలేనా ?
జోథ్ పూర్ లోని ఉమైద్ భవన్ ప్యాలెస్ లో జుబైదా ఆత్మ ఇప్పటికీ ఉందని ఎక్కువ మంది నమ్ముతూ ఉంటారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరలేదని.. ఆ ప్యాలెస్ లో ఉండేందుకు ఎక్కువ మంది ఇష్టపడరు. 2001లో జుబైదా పేరుతోనే ఓ సినిమాను బాలీవుడ్ లో రూపొందించారు. ఈ సినిమాకు రూపొందించింది జుబైదా మొదటి భర్త ద్వారా పుట్టిన కుమారుడు ఖాలిద్ మహమ్మద్ . తన తల్లి మరణం వెనుక మిస్టరీ ఉందని.. ఆయన నమ్మకం. ఇప్పటికీ హీరోయిన్ జుబైదా ఇలా.. హాట్ టాపిక్ అవుతూనే ఉన్నారు.