China: సెలవుల్లేకుండా 104 రోజుల డ్యూటీ - చనిపోయిన ఉద్యోగి - చైనాలో ఇలాంటివి మామూలేనా ?
China Man : సెలవనేది లేకుండా పని చేయించుకుంది కంపెనీ. ఓవర్ టైమ్ చేయించుకుంది. ఇలా 104 రోజులు జరిగాక అతను చనిపోయాడు. అప్పుడు ఆ కంపెనీ ఏమన్నదంటే?
China Man dies of organ failure after working for 104 days : చైనాలో వర్క్ ఫోర్స్ చాలా చీప్ గా వస్తుందని అక్కడ పెద్ద పెద్ద కంపెనీలు తమ ఫ్యాక్టరీలను పెడుతూ ఉంటాయి. లేబర్ చట్టాలు కూడా అంత కఠినంగా ఉండవు. అందుకే చైనా తయారీ రంగానికి కేంద్రంగా మారింది. కానీ మరి ఆ పరిశ్రమల్లో పని చేసే వారి పరిస్థితి ఏమిటి ?. ఎలా చచ్చిపోయినా బయటకు తెలియదు. కానీ ఇటీవల కొన్ని ఘటనలు వెలుగు చూస్తున్నాయి. అవన్నీ ఇంత ఘోరమా అనిపించేలా ఉంటున్నాయి.
తాజాగా ఓ కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ తో చనిపోయాడు. దీనికి కారణం అతనికి ముందస్తు అనారోగ్యం ఉండటం కాదు. అతన్ని ఓ బానిసలా కంపెనీ వాడుకోవడమే. ఒకే ఒక్క రోజు ఆఫ్ ఇచ్చి 104 రోజుల పాటు పని చేయించుకుంది. అది కూడా ఎనిమిది గంటలు కాదు.. ఇంకా ఓవర్ టైమ్ కూడా చేయించుకుంది. ఆ పని చేసి చేసి శారీరకంగా దెబ్బతిని శరీర అవయవాలు ఫెయిల్ కావడంతో చనిపోయాడు.
కార్గిల్ కుట్ర తమ పాపమేనని అంగీకరించిన పాకిస్థాన్ - మొదటి సారి ఆర్మీ చీఫ్ ఒప్పుకోలు
వరుసగా నలభై ఎనిమిది గంటలు డ్యూటీ చేసిన తర్వాత .. ఫ్యాక్టరీలోే ఒక్కసారిగా పడిపోయాడు. ఉద్యోగులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఉద్యోగపరమైన శారరీక శ్రమతోనే అతని శరీరంలో ఆర్గాన్స్ ఫెయిలయినట్లుగా ఆస్పత్రి వర్గాలు ధృవీకరించాయి. అయితే కంపెనీ మాత్రం కనీస కన్సర్న్ చూపించలేదు.
ఆ ఉద్యోగి కుటుంబసభ్యులు కోర్టుకు వెళ్లారు. కోర్టులో ఆ కంపెనీ ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం ఇచ్చేది లేదని వాదించింది. మేము చైనా లేబర్ చట్టాల ప్రకారమే వ్యవహరించామని .. అతనికి వారంతపు సెలవులు ఇచ్చామన్నారు. అలాగే ఓవర్ టైమ్ పని చేయాలని చెప్పలేదని.. అలా చేయడం ఉద్యోగుల ఇష్టమని.. ఇష్టపూర్వకంగానే ఉద్యోగిఆ పని చేశాడని చనిపోయిన వ్యక్తిపైనే మొత్తం తోసేసింది కంపెనీ. అయితే.. అన్ని కంపెనీల యజమానులు అలా చెబుతారని.. కానీ చనిపోయేలా పని చేస్తారంటే..దానికి ఒత్తిడి ఉండటమే కారణమని ఉద్యోగి తరపున వాళ్లు వాదించారు.
షేక్ హసీనా నోరెత్తకూడదు - భారత్‌దే ఆ బాధ్యత - బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని యూనస్ హెచ్చరిక
చివరికి చైనా కోర్టు .. ఆ కంపెనీ .. లేబర్ చట్టాలను ఉల్లంఘించిందని తేల్చింది. 56వేల డాలర్ల పరిహార ఇవ్వాలని ఆదేశించింది. అంటే చైనా యువాన్లలో అది నాలగు లక్షలు. అంత చిన్న మొత్తం పరిహారం ఇచ్చారు ఎందుకంటే.. లేబర్ చట్టాల్లో అంతే ఉంటుంది మరి.