Lakshya SAT: తెనాలి యువతి తెలివి అమోఘం - 400 గ్రాముల బుల్లి ఉపగ్రహంతో సాయి దివ్య అద్భుతాలు
Lakshya SAT Weighing 400 Grams: ఉపగ్రహ కమ్యూనికేషన్ రంగములో పీహెచ్‌డీ స్కాలర్ అయిన సాయి దివ్య.. అందులో భాగంగా 'లక్ష్య శాట్' అనే పేరుతో బుల్లి ఉపగ్రహాన్ని తయారుచేసి విజయవంతంగా ప్రయోగించారు.
Tenali Woman Sai Divya Designs Satellite Lakshya Weighing 400 Grams: తెనాలికి చెందిన కూరపాటి సాయి దివ్య అనే యువతి అద్భుతం చేసింది. వాతావరణ సమాచారాన్ని సేకరించడానికి కేవలం 400 గ్రాముల పరిమాణంతో ఉపగ్రహాన్ని తయారుచేసి ఔరా అనిపించింది. ఉపగ్రహ కమ్యూనికేషన్ రంగములో పీహెచ్‌డీ స్కాలర్‌గా పరిశోధనలు చేస్తున్న సాయి దివ్య (Tenali Woman Sai Divya).. అందులో భాగంగా 'లక్ష్య శాట్' అనే పేరుతో బుల్లి ఉపగ్రహాన్ని తయారుచేసి విజయవంతంగా ప్రయోగించారు.
చదువులో మేటి..
కూరపాటి సాయి దివ్య స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. చిన్నప్పటినుంచీ చదువులో మేటి. బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఆపై కేఎల్ యూనివర్సిటీలో కమ్యూనికేషన్ అండ్ రాడార్ సిస్టమ్స్‌లో ఎంటెక్ చదివారు. ప్రస్తుతం పీహెచ్‌డీ చేస్తున్న సాయి దివ్య తెనాలి లోని తన ఇంట్లోనే- ఎన్–స్పేస్ టెక్ అనే సంస్థను ప్రారంభించారు. తన థియరీ నాలెడ్జ్‌ను ప్రాక్టికల్ నాలెడ్జ్‌గా మార్చుకుని, సొంత పరిజ్ఞానంతో ప్రయోగాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో లక్ష్య శాట్ పేరుతో కేవలం 400 గ్రాముల ఉపగ్రహాన్ని రూపొందించారు. ఉపగ్రహాల ప్రయోగానికి సంబంధించిన పేలోడ్, ప్రోగ్రాం కోడింగ్, సమాచార సేకరణ, నిర్వహణపై తనకున్న అతిచిన్న శాటిలైట్‌ను తయారుచేసి ఔరా అనిపించారు సాయి దివ్య.
గత నెలలో ప్రయోగం..
యూకే నుంచి బీ2 స్పేస్ అనే కంపెనీ సహాయంతో లక్ష్య శాట్ ఉపగ్రహాన్ని గత నెల 15న స్ట్రాటో ఆవణంలోకి విజయవంతంగా పంపించారు. ఈ క్యూబ్ సాట్ నమూనాను ఒక బెలూన్ సహాయంతో స్ట్రాటోస్పియర్ లోనికి పంపించినట్లు పంపినట్లు సాయి దివ్య పేర్కొన్నారు. లక్ష్య శాట్ ద్వారా వాతావరణ పరిస్థితులతో పాటు అక్కడి స్థితిగతుల సంబంధిత డేటాను సేకరించినట్లు తెలిపారు. ఈ లక్ష్య శాట్ భూతలము నుంచి 26 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లి స్ట్రాటోస్పియర్ లో దాదాపు 3 గంటల పాటు ఉందన్నారు. తాను సేకరించిన డేటాను ఇతర పద్ధతుల ద్వారా ప్రామాణిక సమాచారంతో పోల్చి చూసి విశ్లేషించడం తన పీహెచ్‌డీ థీసిస్‌కు ప్రయోజనకరంగా మారిందని తెలిపారు.
భారత్‌లో తక్కువ ఖర్చులో ఉపగ్రహాలు అందిస్తా..
ఈ చిన్న శాటిలైట్ తయారీకి దాదాపు రూ.2 లక్షల వరకు ఖర్చు చేశారు. అయితే లక్ష్య శాట్ ఎలాంటి లోపాలు లేకుండా విజయవంతంగా ప్రయోగించామని, భవిష్యత్తులో భారతదేశంలో అతి తక్కువ ఖర్చుతో సూక్ష్మ ఉపగ్రహాల నమూనా అందించాలన్నది తన లక్ష్యమని సాయి దివ్య పేర్కొన్నారు. తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల సహకారంతో భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తామని సాయి దివ్య ధీమా వ్యక్తం చేశారు.
Also Read: UK University: పైసా ఖర్చు లేకుండా యూకే యూనివర్శిటీలో చదువు- ఆసక్తి ఉన్న వారికి అద్భుత అవకాశం
Also Read: Kendriya Vidyalaya KV : కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీల కోటా రద్దు - కేంద్రం కీలక నిర్ణయం