UK University: పైసా ఖర్చు లేకుండా యూకే యూనివర్శిటీలో చదువు- ఆసక్తి ఉన్న వారికి అద్భుత అవకాశం

ఉద్యోగం చేస్తూనే ఉన్నత చదువులు చదువుకొని స్కిల్స్‌ పెంచుకోవాలనే ఆరాటం చాలా మందిలో కనిపిస్తుంది. అలాంటి వారి కోసం యూకే ఓపెన్ యూనివర్శిటీ ఓపెన్ ఆఫర్ ఇస్తోంది.

FOLLOW US: 

యూకే ఓపెన్ యూనివర్శిటీ(UK Open University) ఫ్రీ ఆన్‌లైన్‌ కోర్సులు(Online Courses) ఆఫర్ చేస్తోంది. భవిష్యత్‌లో ఉపయోగపడే స్కిల్స్(Skills) నేర్చుకునే వాళ్లకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. హెల్త్‌(Health), స్పోర్ట్స్‌(Sports), సైకాలజీ(Psychology), ఎడ్యుకేషన్(Education) అండ్‌ డెవలప్‌మెంట్‌(Development), హిస్టరీ(History) బ్రాంచ్‌లలో కోర్సులు అందజేస్తుంది. 

పూర్తి స్థాయిలో యూనివర్శిటీకి వెళ్లి చదువుకోలేని వారి కోసం డిజైన్ చేసిన కరికుళం ఇది. ఇష్టం ఉన్న రంగంలో ఇష్టం ఉన్న టైంలో చదువుకోవడానికి వీలుగా దీన్ని రూపొందించారు. దీనికి ఎలాంటి టైం లిమిట్ లేదు. ఫీజులు బాదరబందీ కూడా లేదు. నచ్చినప్పుడు ఈ కోర్సును ఫినిష్ చేయవచ్చు. 

 మీరు ఎంచుకున్న రంగంలో ఉన్నతంగా ఎదిగేందుకు అవసరమైన స్కిల్స్ నేర్చుకునేందుకు ఈ కోర్సులు ఉపయోగపడతాయి. ఇది ఎవరైనా చేసుకునేందుకు వీలుగా డిజైన్ చేశారు. ప్రతి కోర్సులో లెర్నింగ్ మాడ్యువల్స్ ఉంటాయి. కోర్సు పూర్తి చేసిన తర్వాత ఆన్‌లైన్ బ్యాడ్జ్‌ ఇస్తారు. 
విదేశీ యూనివర్శిటీల్లో చదవాలని అనుకునే వారికి ఇదో చక్కటి అవకాశం. ఇక్కడ నేర్చుకున్న అంశాలను మీమీ జాబ్‌ సెక్టార్‌లో ఉపయోగపడనుంది. 

యూకే ఓపెన్ యూనివర్శిటీ యూకేలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన విశ్వవిద్యాలయం. ఇలా తమ యూనివర్శిటీ నుంచి వేల మందికి  ఉచిత ఆన్‌లైన్ కోర్సులను అందిస్తారు. UK ఓపెన్ యూనివర్శిటీ ప్రపంచ స్థాయి విద్య, పరిశోధనలను అందించడంలో చాలా అనుభవాన్ని కలిగి ఉంది. UKలోని అత్యంత గౌరవనీయమైన విశ్వవిద్యాలయాలలో ఇది కూడా ఒకటి. UK ఓపెన్ యూనివర్సిటీ బిజినెస్‌, లా, ఇంజినీరింగ్‌, సోషల్ సైన్స్‌ విభాగాల్లో కూడా కోర్సులను అందిస్తుంది. 

ప్రపంచంలోనే గొప్ప విశ్వవిద్యాలయంలో ఎలాంటి ఖర్చుల్లేకుండానే ప్రపంచ స్థాయి విద్యను పొందాలనుకునే విద్యార్థులకు UK ఓపెన్ యూనివర్శిటీ ఇచ్చిన ఆఫర్‌ అద్భుతమైన ఎంపిక. 

యూనివర్శీటీకి సంబంధించిన మరింత సమాచారం. 

యూనివర్శిటీ పేరు:- యూకే ఓపెన్ యూనివర్శిటీ(Open University, United Kingdom)
కోర్సుల సంఖ్య:- 1000
అప్లై చేయడానికి గడువు:- ఎలాంటి గడువు లేదు. 

యూకే యూనివర్శిటీలో కోర్సు చేస్తే కలిగే ప్రయోజనం ఏంటి?

ఫ్రీ సర్టిఫికేట్
డిజిటల్‌ బ్యాడ్జ్‌
ఫీజు లేని చదువు 
వెయ్యికిపైగా కోర్సులు
తక్షణం జాయిన్ అయ్యే వెసులుబాటు
చదువుకోవడానికి నో టైం లిమిట్‌
కోర్సు కంప్లీట్ చేయడానికి గడువు లేదు. 

యూకే యూనివర్శిటీ అందించే కోర్సులు 

హెల్త్‌, స్పోర్ట్స్‌ అండ్‌ సైకాలజీ (Health, Sports & Psychology )
ఎడ్యుకేషన్ అండ్‌ డెవలప్‌మెంట్ (Education & Development)
హిస్టరీ అండ్‌ ది ఆర్ట్స్‌ (History & The Arts)
సైన్స్‌, మ్యాథ్స్ అండ్ టెక్నాలజీ (Science, Maths & Technology)
లాంగ్వేజ్‌లు (Languages)
మనీ అండ్ బిజినెస్ (Money & Business)
నేచర్ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ (Nature & Environment)

సొసైటీ, పాలిటిక్స్‌ అండ్ లా (Society, Politics & Law)

యూకే యూనివర్శిటీలో అప్లై చేయడానికి అర్హతలు ఏంటి 

ఏ దేశీయుపైనా జాయిన్ అవ్వొచ్చు 
ఎలాంటి ఏల్ లిమిట్ లేదు
అకాడమిక్‌ రిస్ట్రక్షన్స్‌ ఏమీ లేవు 
ఎంట్రీ టెస్టుల్లాంటివి ఏమీ లేవు 

యూకే యూనివర్శిటీలో చదవాలంటే ఎలా అప్లై చేయాలి.

యూకే యూనివర్శిటీ వెబ్‌సైట్‌కు వెళ్లాలి(అధికారిక వెబ్‌సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
అందులో ఆన్‌లైన్ కోర్సు అనే ఆఫ్షన్ ఉంటుంది దానిపై క్లిక్ చేయాలి
ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. 
తర్వాత కావాల్సిన కోర్సును ఎంపిక చేసుకోవాలి
కోర్సు రిజిస్ట్రేషన్ ప్రక్రియ చాలా సులభతరం, ఉచితం

Published at : 21 Apr 2022 06:52 PM (IST) Tags: Free Online Courses UK Open University Free Certificates Open Learn

సంబంధిత కథనాలు

AP TS 10th Exam Results: ఆ తేదీల్లో ఏపీలో టెన్త్ రిజల్ట్స్ విడుదలయ్యే ఛాన్స్ - తెలంగాణలో స్పాట్ వ్యాల్యుయేషన్ ప్రారంభం

AP TS 10th Exam Results: ఆ తేదీల్లో ఏపీలో టెన్త్ రిజల్ట్స్ విడుదలయ్యే ఛాన్స్ - తెలంగాణలో స్పాట్ వ్యాల్యుయేషన్ ప్రారంభం

Telangana Police Jobs: పోలీసు ఉద్యోగాలకు ఇంకా అప్లై చేయలేదా? ఇవాళే లాస్ట్ డేట్!

Telangana Police Jobs: పోలీసు ఉద్యోగాలకు ఇంకా అప్లై చేయలేదా? ఇవాళే లాస్ట్ డేట్!

Karimnagar: శాతవాహన యూనివర్సిటీలో 12బీ హోదా లొల్లి - UGCకి వర్సిటీ నుంచి వివాదాస్పద లేఖలు 

Karimnagar: శాతవాహన యూనివర్సిటీలో 12బీ హోదా లొల్లి - UGCకి వర్సిటీ నుంచి వివాదాస్పద లేఖలు 

TS SSC Exams: నేటి నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు, ఆ నిబంధన కచ్చితంగా పాటించాల్సిందే

TS SSC Exams: నేటి నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు, ఆ నిబంధన కచ్చితంగా పాటించాల్సిందే

Telangana TET Exam : తెలంగాణ టెట్ వాయిదాపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు

Telangana TET Exam : తెలంగాణ టెట్ వాయిదాపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు

టాప్ స్టోరీస్

Heavy Rush at Tirumala: తిరుమలకు వెళ్తున్న భక్తులకు టీటీడీ కీలక సూచనలు, కిలోమీటర్లు మేర క్యూలైన్లలో గోవిందా గోవిందా !

Heavy Rush at Tirumala: తిరుమలకు వెళ్తున్న భక్తులకు టీటీడీ కీలక సూచనలు, కిలోమీటర్లు మేర క్యూలైన్లలో గోవిందా గోవిందా !

Vijayashanthi: విజయశాంతి - వీకే శశికళ రహస్య భేటీ! మూడేళ్ల క్రితం సాధ్యంకానిది ఇప్పుడవుతుందా?

Vijayashanthi: విజయశాంతి - వీకే శశికళ రహస్య భేటీ! మూడేళ్ల క్రితం సాధ్యంకానిది ఇప్పుడవుతుందా?

Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?

Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?

Mahanadu Chandrababu : నేను వస్తా.. దోచినదంతా కక్కిస్తా - మహానాడులో చంద్రబాబు హెచ్చరిక !

Mahanadu Chandrababu :  నేను వస్తా.. దోచినదంతా  కక్కిస్తా - మహానాడులో చంద్రబాబు హెచ్చరిక !