Top Headlines Today: పవన్ కు ఏపీలో కనీసం ఓటు, ఆధార్ లేదు! యూట్యూబ్ ఛానెల్స్ పెట్టుంటే గెలిచేవాళ్లమన్న కేటీఆర్
AP Telangana Latest News 31 December 2023: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..

Telugu News Today: మెడికల్ కాలేజీలకు బదులు 32 యూట్యూబ్ ఛానెల్స్ పెట్టుంటే గెలిచేవాళ్లం - కేటీఆర్ ఆసక్తికర పోస్ట్
తెలంగాణ ప్రజల తీర్పుని బీఆర్ఎస్ ఏ కోణంలో అర్థం చేసుకుంటోంది. ప్రజా తీర్పుని ఆ పార్టీ గౌరవిస్తోందా, లేక ఇంకా ఆ తీర్పు తప్పు అనే అనుకుంటుందా..? నాయకుల మనసులో మాట ఎలా ఉన్నా.. బయటకు వేస్తున్న ట్వీట్లు మాత్రం సంచలనంగా మారుతున్నాయి. తాజాగా కేటీఆర్ వేసిన ట్వీట్ కూడా వైరల్ గా మారింది. తెలంగాణలో 32 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం. దానికంటే 32 యూట్యూబ్ ఛానెళ్లు పెట్టి ఉంటే బీఆర్ఎస్ గెలిచి ఉండేదని ఎవరూ ఓ కామెంట్ చేశారు. ఆ విశ్లేషణను కేటీఆర్ తన ట్విట్టర్లో పెట్టారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
'పవన్ కు ఏపీలో కనీసం ఓటు, ఆధార్ లేదు' - ప్రధానికి తాము కూడా లెటర్ రాస్తామన్న మంత్రి జోగి రమేష్
రాష్ట్రంలో 30 లక్షల మందికి పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చి, ఇళ్లు నిర్మిస్తుంటే అది జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు కనిపించడం లేదా.? అంటూ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ (Minister Jogi Ramesh) ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం పేరిట భారీ కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ ప్రధాని మోదీకి (PM Modi), పవన్ లేఖ రాయడంపై ఆయన మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పవన్ కు అసలు ఏపీలో ఆధార్ కార్డు, ఓటు కార్డు లేవని.. ఆయన చంద్రబాబు కోసమే పని చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఒక్కసారి జగన్ అపాయింట్మెంట్ ఇప్పించండి - డొక్కా ఆవేదన
మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఒక్కసారి సీఎం జగన్ అపాయింట్ మెంట్ ఇప్పించండి అంటూ ఆయన పార్టీ పెద్దల్ని వేడుకున్నారు. అది కూడా సామాజిక బస్సు యాత్ర వేదికపైనే ఆయన విన్నవించుకోవడం సంచలనంగా మారింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకోసం చేపట్టిన ఈ యాత్రలో అదే వర్గానికి చెందిన ఓ నేత సీఎం జగన్ అపాయింట్ మెంట్ కూడా తనకు లభించడంలేదని చెప్పుకోవడం నిజంగా విచిత్రమే. అందులోనూ ఆయన ఆషామాషీ నాయకుడు కాదు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
'వేగమొకడు, త్యాగమొకడు గతం మరువని గమనమే' - 'సలార్' సాంగ్ తో మంత్రి కోమటి రెడ్డి ఆసక్తికర ట్వీట్స్
కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్న వేళ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (KomatiReddy Venkat Reddy) ఆసక్తికర ట్వీట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), తానూ కలిసి ఉన్న ఫోటోలతో ఓ వీడియోను రూపొందించి దానికి సలార్' సాంగ్ ను జోడించారు. 'వేగమొకడు.. త్యాగమొకడు గతము మరువని గమనమే. ఒకరినొకరు నమ్మి నడిచిన బంధమే ఇదిలే..' అంటూ ఆయన షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
క్యాబ్ డ్రైవర్స్ మీ రైడ్ క్యాన్సిల్ చేస్తే ఈ నంబర్‌కు ఇలా కంప్లైంట్ చేయండి - పోలీసులు
క్యాబ్ కోసం బుక్ చేసుకున్న రైడ్ ను డ్రైవర్ క్యాన్సిల్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని మూడు కమిషనరేట్ల పరిధిలోని పోలీసులు తేల్చి చెప్పారు. ఆన్ లైన్ వెహికిల్ బుకింగ్ యాప్‌లో తరచూ రైడ్ బుక్ చేసుకొనే వారికి ఇలాంటి సమస్యలు ఎదురయ్యే ఉంటాయి. గమ్య స్థానం దూరంగా ఉందనో, ఇతర కారణాలతో డ్రైవర్లు కస్టమర్ బుక్ చేసుకున్న రైడ్ ను క్యాన్సిల్ చేస్తుంటారు. చికాకు తెప్పించే ఈ అనుభవాన్ని దాదాపు క్యాబ్ సర్వీసులు ఉపయోగించుకొనే అందరూ ఎదుర్కొనే ఉంటారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి





















