Minister Komati Reddy: 'వేగమొకడు, త్యాగమొకడు గతం మరువని గమనమే' - 'సలార్' సాంగ్ తో మంత్రి కోమటి రెడ్డి ఆసక్తికర ట్వీట్స్
Telangana News: తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నూతన సంవత్సర వేళ ఆసక్తికర ట్వీట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఉన్న ఫోటోలతో వీడియో చేసి సలార్ పాటను జోడించి షేర్ చేయగా వైరల్ అవుతోంది.
Minsiter KomatiReddy Venkat Reddy Interesting Tweets: కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్న వేళ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (KomatiReddy Venkat Reddy) ఆసక్తికర ట్వీట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), తానూ కలిసి ఉన్న ఫోటోలతో ఓ వీడియోను రూపొందించి దానికి సలార్' సాంగ్ ను జోడించారు. 'వేగమొకడు.. త్యాగమొకడు గతము మరువని గమనమే. ఒకరినొకరు నమ్మి నడిచిన బంధమే ఇదిలే..' అంటూ ఆయన షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. దీన్ని చూసిన కాంగ్రెస్ శ్రేణులు ఫుల్ జోష్ తో ఉన్నాయి. 'మీ స్నేహం ఇలాగే కలకాలం సాగాలి' అని ఆకాంక్షిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అంతకు ముందు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో (Bhatti Vikramarka) కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన ఆయన 'కలిసి కొత్త శకాన్ని నిర్మిద్దాం' అంటూ పోస్ట్ షేర్ చేశారు.
వేగమొకడు… త్యాగమొకడు
— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) December 31, 2023
గతము మరువని గమనమే.
ఒకరినొకరు నమ్మి నడిచిన బంధమే ఇదిలే
ఒకరు గర్జన… ఒకరు ఉప్పెన
వెరసి ప్రళయాలే.
సైగ ఒకరు… సైన్యం ఒకరు
కలిసి కదిలితే కదనమే...#AdminPost #KomatiReddyVenkatReddy #RevanthReddy #TelanganaPrajaPrabhutwam @revanth_anumula @INCTelangana pic.twitter.com/BPNdM4LuRZ
డిప్యూటీ సీఎంతో ఉన్న ఫోటో ట్వీట్
తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టి నెల రోజులు పూర్తి కావొస్తోంది. సీఎంగా రేవంత్ రెడ్డి సహా 11 మంది మంత్రులు పదవీ బాధ్యతలు చేపట్టారు. డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క, మంత్రిగా కోమటిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. భట్టి విక్రమార్కకు ఆర్థిక శాఖతో పాటు విద్యుత్ శాఖ కేటాయించగా, కోమటిరెడ్డికి రోడ్లు భవనాల శాఖతో పాటు సినిమాటోగ్రఫీ శాఖలు దక్కాయి. అయితే, శనివారం కోమటిరెడ్డి భట్టి విక్రమార్కతో కలిసి ఉన్న ఫోటో పెట్టి 'కలిసి కొత్త శకాన్ని నిర్మిద్దాం' అంటూ ట్వీట్ చేశారు. దీనిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి అయితే, ఇలా ట్వీట్ చేశారేంటీ అనే దానిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తునే చర్చ జరిగింది. దీనికి చెక్ పడేలా కోమటిరెడ్డి తాజాగా చేసిన ట్వీట్ కాంగ్రెస్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇటీవల అధికారం చేపట్టిన తర్వాత ఇరువురూ ఒకే వేదికలపై కనిపిస్తున్నారు. ఒకరిపై ఒకరు అభిమానం చాటుకుంటూ, ప్రజలకు మెరుగైన పాలన అందించేలా ముందుకు సాగుతున్నారు. ఈ వీడియో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి మధ్య ఉన్న స్నేహాన్ని తెలియజేస్తుందని కాంగ్రెస్ శ్రేణులు పేర్కొంటున్నారు.
కలిసి కొత్త శకాన్ని నిర్మిద్దాం...#KomatiReddyVenkatReddy #BhattiVikramarkaMallu #TelanganaPrajaPrabhutwam@Bhatti_Mallu @INCTelangana pic.twitter.com/suzRsjMIrA
— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) December 30, 2023
Also Read: Harish Rao in Metro Rail: సడెన్‌గా మెట్రో రైల్‌లో మాజీ మంత్రి హరీశ్ రావు, అవాక్కైన ప్రయాణికులు