Top Headlines Today: కుమారుని వివాహానికి చంద్రబాబుకు షర్మిల ఆహ్వానం! ఎమ్మెల్సీలుగా ఎవరికి అవకాశం దక్కేనో ?
AP Telangana Latest News 13 January 2024: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..
Telugu News Today: కుమారుని వివాహానికి చంద్రబాబుకు షర్మిల ఆహ్వానం - రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ నాయకురాలు షర్మిల (Sharmila) టీడీపీ అధినేత చంద్రబాబును (Chandrababu) శనివారం హైదరాబాద్ (Hyderabad) లోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా తన కుమారుని పెళ్లికి హాజరు కావాలని ఆయనకు వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్ కు సైతం ఆహ్వానం పలికారు. కాగా, షర్మిల కుమారుడు రాజారెడ్డికి.. ప్రియా అట్లూరితో ఈ నెల 18 నిశ్చితార్థం, ఫిబ్రవరి 17న వివాహం జరగనుంది. ఇప్పటికే షర్మిల సీఎం రేవంత్ సహా పలువురు ప్రముఖులను కలిసి ఆహ్వాన పత్రికను అందించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
నాలుగేళ్ల తర్వాత నర్సాపురం ఎంపీ రఘురామ - జగన్‌కు ధ్యాంక్స్ !
ఎంపీ రఘురామ కృష్ణరాజు ఈ సారి సంక్రాంతి పండుగను సొంత నియోజకవర్గంలో చేసుకోనున్నారు. ఢిల్లీ నంచి రాజమండ్రి విమానాశ్రయం చేరుకున్న ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. భారీ ఘజమాలతో ఘన స్వాగతం పలికిన ఎంపీ RRR అభిమానులు భీమవరం వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్టులో రఘురామ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఈ స్ధాయికి చేరడానికి కారణమైన సీఎం జగన్ కు ఆయన థ్యాంక్స్ చెప్పారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఎమ్మెల్సీలుగా ఎవరికి అవకాశం దక్కేనో..? నేడు ఖరారు చేయనున్న కాంగ్రెస్
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు కొద్ది రోజుల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఎమ్మెల్సీలుగా ఉంటూ ఎమ్మెల్యేలుగా బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎన్నికయ్యారు. దీంతో వాళ్లు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఈ రెండు స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ రెండు స్థానాల్లో అభ్యర్థులను ఎంపిక చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి సారించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
సొంతూరు వెళ్లాలంటే నెల జీతం ఇచ్చుకోవాల్సిందే- భారీగా పెరిగిపోయిన ఛార్జీలు
ఈ సీజన్ సామాన్యులకు పండగ ఎలా ఉన్నా సరే ట్రావెల్స్, ప్రభుత్వాలకు మాత్రం నిజమైన పడంగే. ఈ వారం రోజులు విపరీతంగా ఛార్జీలు పెంచేస్తుంటారు. ఇది ప్రైవేటు ఆపరేటర్లకే కాదు ప్రభుత్వ సంస్థలకు కూడా వర్తిస్తుంది. ప్రత్యేక బస్సుల పేరుతో ప్రభుత్వాలు కూడా ఛార్జీలను డబుల్ చేస్తున్నాయి. నలుగురు ఉన్న ఫ్యామిలీ హైదరాబాద్ నుంచి ఏపీలో ఉన్న ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా ఛార్జీలకే 10 నుంచి 15 వేలు పెట్టాల్సి వస్తుంది. ఈ ఖర్చులు చూసిన వాళ్లంతా బెదిరిపోతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
సీనియర్ల టికెట్లపై తేల్చని సీఎం జగన్, మాజీ మంత్రులకూ షాక్ తప్పదా ?
గెలుపే లక్ష్యంగా ఎత్తులు వేస్తున్న సీఎం జగన్ (Jagan)...టికెట్ల (Tickets)కేటాయింపులో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతర్గతంగా సర్వేలు చేయించుకుంటున్నారు. పార్టీ నేతలతో పాటు ఇంటెలిజెన్స్ నుంచి రహస్య రిపోర్టులు తెప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రజల్లో వ్యతిరేకతగా ఉన్న, ప్రజలకు అందుబాటులో ఉండని నేతలపై వేటు వేస్తున్నారు. నాలుగున్నరేళ్లుగా ఎమ్మెల్యేల పని తీరును సీఎం జగన్ పరిగణలోకి తీసుకుంటున్నారు. గడపగడపకు కార్యక్రమం, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లారు ? పూర్తి వివరాలకు క్లిక్ చేయండి