Top Headlines Today: వైసీపీకీ అంబటిరాయుడు రాజీనామా! బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గా నమ్మించడమే టాస్క్
AP Telangana Latest News 06 January 2024: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..
Telugu News: తెలుగుదేశం పార్టీకి విజయవాడ ఎంపీ కేశినేని నాని రాజీనామా!
బెజవాడ ఎంపీ కేశినేని నాని ఎంపీ పదవికి, టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్టు ప్రకటించారు. త్వరలోనే ఢిల్లీ వెళ్లి ఎంపీ పదవికి రాజీనామా చేసి అనంతరం తెలుగు దేశం పార్టీ నుంచి కూడా బయటకు వస్తానని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ప్రకటించారు. దానితో విజయవాడ రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. 2019 ఎన్నికల్లో ఎంపీగా గెలిచినప్పటి నుంచీ పార్టీపై పలు సందర్భాల్లో తన అసంతృప్తిని బయట పెట్టిన కేశినేని నానిది ఎప్పుడూ ముక్కుసూటి వ్యవహారమే. అయితే గత కొన్ని రోజులుగా ఆయనకు విజయవాడ ఎంపీ సీటు మరోసారి దక్కదు అనే ప్రచారం ఊపందుకుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
వైసీపీకీ అంబటిరాయుడు రాజీనామా - పార్టీలో చేరిన 10 రోజులకే వైదొలగుతున్నట్టు ప్రకటన
వైఎస్‌ఆర్‌సీపీకి షాక్‌ల మీద షాక్ ఇస్తున్నారు లీడర్లు. తాజాగా క్రికెట్ అంబటి రాయుడు షాక్ ఇచ్చారు. పార్టీలో జాయిన్ అయిన వారం రోజులకే పార్టీకి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. వైఎస్‌ఆర్‌సీపీ నుంచి వైదొలగుతున్నట్టు సోషల్ మీడియా వేదికగా అంబటి రాయుడు ప్రకటించారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నట్టు తెలిపారు. ఆ తర్వాత భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానంటూ వెల్లడించారు. డిసెంబర్ 28వ తేదీన పార్టీలో వైసీపీలో చేరారు. సరిగ్గా పది రోజుల్లో పార్టీని వీడుతున్నట్టు తెలపడం సంచలనంగా మారింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
అంగన్‌వాడీలపై ఎస్మా ప్రయోగం- ఆరు నెలల పాటు సమ్మెలు నిషేధం
సుమారు నెల రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్‌వాడీల ఉద్యమంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. వారిపై ఎస్మా ప్రయోగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు నెలల పాటు ఎలాంటి సమ్మెలు, ఆందోళనలు చేయొద్దని ఆదేశాల్లో పేర్కొంది. జీతాల పెంపు, గ్రాట్యుటీ పెంపుతోపాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 26 రోజులుగా అంగన్‌వాడీలు సమ్మె చేస్తున్నారు. వారితో దఫదఫాలుగా చర్చలు జరిపిన ప్రభుత్వం వారి డిమాండ్లపై క్లారిటీ ఇవ్వలేకపోయింది. ఆర్థికంగా ప్రభావం పడని వాటికి ఓకే చెప్పింది కానీ జీతాల పెంపుపై వారికిహామీ ఇవ్వలేదు. అందుకే అంగన్‌వాడీ వర్కర్లు సమ్మె విరమించడం లేదు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గా నమ్మించడమే టాస్క్ - ఇక జాతీయ రాజకీయాల ప్రస్తావన ఉండదా ?
టీఆర్ఎస్‌ను భారత రాష్ట్ర సమితిగా మార్చింది.. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తేవడానికి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నా బీఆర్ఎస్ ఇతర రాష్ట్రాల్లో పోటీ చేయడంపై కనీస ఆలోచన చేయడం లేదు. తెలంగాణ వాదమే వినిపిస్తామని తెలంగాణ ప్రజలకు భరోసా ఇస్తున్నారు. తాము ఎంతో దృష్టి పెట్టిన మహారాష్ట్ర వైపు చూడటం లేదు. ఏపీలో అయినా పోటీ చేస్తారనుకుంటే అలాంటి ఆలోచన చేయడం లేదు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ను పేరుకే జాతీయ పార్టీగా ఉంచేసి..కనీసం ఉనికి కాపాడుకుందామన్న ప్రయత్నాల్లో బీఆర్ఎస్ పెద్దలు ఉన్నట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
హైదరాబాద్‌లో జరగాల్సిన కారు రేస్ రద్దు- కేటీఆర్, ఫార్ములా ఈ చీఫ్ అసంతృప్తి
ఫార్ములా రేస్ అభిమానులకు షాక్ తగిలింది. హైదరాబాద్‌లో జరగాల్సిన ఫార్ముల ఈ రేస్‌ను రద్దు చేశారు నిర్వాహకులు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును తప్పుపడుతూ .. ఫార్ములా ఈ ఆపరేషన్స్ ప్రకటన రిలీజ్ చేసింది. హోస్ట్ సిటీ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు ఆ సంస్థ తెలంగాణ మున్సిపల్ శాఖకు నోటీసులు ఇచ్చింది. ఈ-రేస్ సీజన్ 10కు చెందిన నాలుగవ రౌండ్ హైదరాబాద్‌లో ఫిబ్రవరి 10వ తేదీన జరగాల్సి ఉంది. అయితే ఆ రేస్‌ను రద్దు చేస్తున్నట్లు ఫార్ములా ఈ రేస్ నిర్వాహకులు ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన మున్సిపల్ శాఖ.. హోస్ట్ సిటీ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు నిర్వాహకులు తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి