అన్వేషించండి

Top Headlines Today: శాసన మండలిలో వైసీపీకి బిగ్‌షాక్ తప్పదా? తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి వర్సెస్ హరీష్ రావు- నేటి టాప్ న్యూస్

TG Budget Session on 27 July 2024: తెలంగాణ అసెంబ్లీలో శనివారం సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ హరీష్ రావుగా బడ్జెట్ సెషన్ కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో టాప్ 5 వార్తలు మీకోసం.

Andhra Pradesh News Today - శాసన మండలిలో వైసీపీకి బిగ్‌షాక్ తప్పదా? ఎమ్మెల్సీ లోకేష్‌ను కలవడం వెనుక ఏం జరుగుతుంది?
అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపీ ఘోర పరాజ‌యం త‌ర్వాత ఆ పార్టీకి వ‌రుస‌గా షాక్‌ల మీద షాక్‌లు త‌గులుతున్నాయి. పార్టీ నాయ‌కులు ఒక్కొక్క‌రిగా వైసీపీని వీడి ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. తాజాగా వైసీపీకి మ‌రో పెద్ద ఎదురుదెబ్బ త‌గిలింది. మంత్రి నారా లోకేశ్‌ను మండ‌లి డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ జ‌కియా ఖానుమ్ క‌ల‌వ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. కొంత‌కాలంగా ఆమె వైసీపీని వీడి టీడీపీలో చేర‌తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. వైసీపీ నేతలు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించినా, ఆమె మాత్రం శాసనమండలికి హాజరవుతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

'జగన్ గారూ మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?' - ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ వైఎస్ షర్మిల కౌంటర్
ఢిల్లీలో తమ ధర్నాకు కాంగ్రెస్ నేతలు ఎందుకు రాలేదో ఆ పార్టీనే అడగాలన్న మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై.. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి.? అని ప్రశ్నించారు. 'పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుకా.? వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుకా.? 5 ఏళ్లుగా బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకుని విభజన హక్కులు, ప్రత్యేక హోదాను వారికి తాకట్టు పెట్టినందుకా.?' అంటూ నిలదీశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

డోకా లేకుండా ఉన్న తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ధోకా ఇచ్చింది- బడ్జెట్‌ ప్రసంగంలో హరీష్ విమర్శలు
తెలంగాణ బడ్జెట్‌పై అసెంబ్లీలో హోరాహోరీ చర్చసాగింది. మాజీ మంత్రి హరీష్‌రావు అధికార పక్షంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆరు గ్యారంటీలు అమలు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు. అంకెల గారడీతో మభ్యపెట్టేందుకు మాత్రమే బడ్జెట్ ప్రవేశపెట్టారని విమర్శించారు. హరీష్‌రావు చేసిన ఆరోపణలకు అధికార పార్టీ నేతలు కౌంటర్ ఇచ్చారు. ఇలా వాడీవేడిగా సాగింది బడ్జెట్ డిస్కషన్. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

'బ్రోకర్లకు కమీషన్లు ఇచ్చి అధిక వడ్డీలకు అప్పులు తెస్తున్నారు' - కేసీఆర్ బాటలోనే రేవంత్ అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ ప్రభుత్వం బ్రోకర్లకు కమీషన్లు ఇచ్చి మర్చంట్ బ్యాంకర్స్ ద్వారా అధిక వడ్డీలకు రూ.వేల కోట్లు అప్పులు తెచ్చే కుట్రకు తెరతీసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సంచలన ఆరోపణలు చేశారు. కరీంనగర్‌లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన సీఎం రేవంత్ రెడ్డిపైనా విమర్శలు చేశారు. అధిక వడ్డీలకు అప్పులు తీసుకురావడం వల్ల రాష్ట్ర ప్రజలపై మోయలేని భారం పడుబోతోందని అన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

విద్యుత్ మీటర్లు పెట్టేందుకు మోదీతో కేసీఆర్‌ ఒప్పందం- హరీష్‌కు రేవంత్ కౌంటర్- రికార్డులు సరిచేయాలని స్పీకర్‌కు వినతి
తెలంగాణ బడ్జెట్ చర్చ సందర్భంగా ప్రభుత్వంపై హరీష్‌రావు చేసిన కామెంట్స్‌పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. నోరు తెరిస్తే చాలు అబద్దాలతో రెచ్చిపోతున్నారని వాస్తవాలు తెలుసుకొని రికార్డులు సరిచేయాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. హరీష్ రావు సభను సభ్యులు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మోటార్లకు మీటర్ల విషయంలో వాళ్లేదో కేంద్రంతో నిలబడి కొట్లాడినట్లు మాట్లాడుతున్నారు. ఇది అబద్ధం... వారి తప్పులను కప్పి పుచ్చుకోవడానికి సభలో బుకాయించడం సరికాదని రేవంత్ అన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Central Taxes: కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వాటా - తెలుగు రాష్ట్రాలకు ఎంతంటే?
కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వాటా - తెలుగు రాష్ట్రాలకు ఎంతంటే?
Telugu States IAS IPS : కేటాయించిన క్యాడర్‌కే వెళ్లిపోవాలి - తెలుగు రాష్ట్రాల్లో అధికారులకు కేంద్రం ఆదేశాలు - ఎవరెవరంటే ?
కేటాయించిన క్యాడర్‌కే వెళ్లిపోవాలి - తెలుగు రాష్ట్రాల్లో అధికారులకు కేంద్రం ఆదేశాలు - ఎవరెవరంటే ?
BYD eMAX 7: వావ్ అనిపిస్తున్న బీవైడీ కొత్త కారు - సింగిల్ ఛార్జింగ్‌తో ఎంత రన్ అవుతుంది?
వావ్ అనిపిస్తున్న బీవైడీ కొత్త కారు - సింగిల్ ఛార్జింగ్‌తో ఎంత రన్ అవుతుంది?
Vettaiyan box office Day 1 prediction: 'వేట్టయన్'కు సాలిడ్ ఓపెనింగ్... కానీ 'జైలర్'ను రికార్డును బీట్ చేసిందా?
'వేట్టయన్'కు సాలిడ్ ఓపెనింగ్... కానీ 'జైలర్'ను రికార్డును బీట్ చేసిందా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ratan Tata News: అంత పెద్ద రతన్ టాటాకు చిన్న కుర్రాడే బెస్ట్ ఫ్రెండ్Ratan Tata: రతన్ టాటా మృతిపై స్పందించిన మాజీ గర్ల్‌ ఫ్రెండ్Ratan Tata Last Post: సోషల్ మీడియాలో రతన్ టాటా లాస్ట్ పోస్ట్ ఇదేRatan Tata News: మధ్యతరగతి వాడి కోసం ఆలోచించిన ఏకైక వ్యాపారవేత్త రతన్ టాటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Central Taxes: కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వాటా - తెలుగు రాష్ట్రాలకు ఎంతంటే?
కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వాటా - తెలుగు రాష్ట్రాలకు ఎంతంటే?
Telugu States IAS IPS : కేటాయించిన క్యాడర్‌కే వెళ్లిపోవాలి - తెలుగు రాష్ట్రాల్లో అధికారులకు కేంద్రం ఆదేశాలు - ఎవరెవరంటే ?
కేటాయించిన క్యాడర్‌కే వెళ్లిపోవాలి - తెలుగు రాష్ట్రాల్లో అధికారులకు కేంద్రం ఆదేశాలు - ఎవరెవరంటే ?
BYD eMAX 7: వావ్ అనిపిస్తున్న బీవైడీ కొత్త కారు - సింగిల్ ఛార్జింగ్‌తో ఎంత రన్ అవుతుంది?
వావ్ అనిపిస్తున్న బీవైడీ కొత్త కారు - సింగిల్ ఛార్జింగ్‌తో ఎంత రన్ అవుతుంది?
Vettaiyan box office Day 1 prediction: 'వేట్టయన్'కు సాలిడ్ ఓపెనింగ్... కానీ 'జైలర్'ను రికార్డును బీట్ చేసిందా?
'వేట్టయన్'కు సాలిడ్ ఓపెనింగ్... కానీ 'జైలర్'ను రికార్డును బీట్ చేసిందా?
Ratan Tata: 1998లోనే మేడ్ ఇన్ ఇండియా కారు - రతన్ టాటా విజన్ అంత గొప్పది!
1998లోనే మేడ్ ఇన్ ఇండియా కారు - రతన్ టాటా విజన్ అంత గొప్పది!
Ratan Tata: రతన్ టాటాకు కన్నీటి వీడ్కోలు - వర్లి శ్మశానవాటికలో ముగిసిన అంత్యక్రియలు
రతన్ టాటాకు కన్నీటి వీడ్కోలు - వర్లి శ్మశానవాటికలో ముగిసిన అంత్యక్రియలు
Entertainment Top Stories Today: రజనీకాంత్ ‘వేట్టయన్’ రివ్యూ, ‘దేవర 3’పై కొరటాల కామెంట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
రజనీకాంత్ ‘వేట్టయన్’ రివ్యూ, ‘దేవర 3’పై కొరటాల కామెంట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
KTR: మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం దావా - క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్
మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం దావా - క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్
Embed widget