News
News
X

Land Issue : దగ్గుబాటి ఫ్యామిలీ, రాఘవేంద్రరావులకు తెలంగాణ సర్కార్ షాక్ - ఆ వందల కోట్ల విలువైన భూమి ప్రభుత్వానిదేనని వాదన !

రామానాయుడు, రాఘవేంద్రరావులు కొన్న భూమి ప్రభుత్వానిదని తెలంగాణ సర్కార్ హైకోర్టుకు తెలిపింది. ఆ భూమి విలువ ఇప్పుడు వందల కోట్లలో ఉంటుంది.

FOLLOW US: 

Land Issue :  సినీ నిర్మాత రామానాయుడు జీవించి ఉన్నప్పుడు కొనుగోలు చేసిన భూమి ... తప్పుడు పద్దతిలో కొనుగోలు చేశారని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఒక్క రామానాయుడు మాత్రమే కాదు ప్రభుత్వ భూమిని హక్కులు లేని వారి దగ్గర నుంచి మరో దర్శకుడు రాఘవేంద్రరావుతో పాటు గోవింద్ రెడ్డి అనే వ్యక్తి కూడా కొనుగోలు చేశారని ..  హక్కులు లేని వ్యక్తి నుంచి కొనుగోలు చేసినందున వారి కొనుగోలు చెల్లదని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. 

జగన్, కేసీఆర్‌కు కేఏ పాల్ బంపర్ ఆఫర్! చంద్రబాబు, పవన్‌కు కూడా - ‘విమానాలూ పంపుతా’

 రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్‌లో  కొన్నేళ్ల క్రితం 26 ఎకరాల భూమిని రామానాయుడు, రాఘవేంద్రరావు, గోవింద్ రెడ్డి కొనుగోలు చేశారు. వారు ఓ మాజీ సైనికుడి నుంచి కొనుగోలు చేశారు. ఆ సైనికుడికి భూమి ప్రభుత్వం కేటాయించింది. అయితే అలా ఆ సైనికుడికి ప్రభుత్వం కేటాయించలేదని తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి అక్రమంగా రిజిస్టర్ చేయించుకున్నారని ప్రభుత్వం చెబుతోంది.అందుకే  చట్ట ప్రకారం హకులు లేని భూమిని సినీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు, సినీ దర్శకుడు కే రాఘవేంద్రరావు, గోవింద్‌రెడ్డి తదితరులు 26 ఎకరాలకుపైగా కొనుగోలు చేశారని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. 

11మందితో పెళ్లి! 3 వీధుల్లో ముగ్గురు భార్యలు, ఒకరి దగ్గర డబ్బు గుంజి మరో భార్యతో సంసారం

అయితే ఇప్పటికే ఈ వివాదంలో సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది.  15 ఏండ్ల తర్వాత ప్రభుత్వం రికార్డులను సవరించడం చెల్లదని సింగిల్‌ జడ్జి తీర్పు ఇచ్చారు. ఈ తీర్పుపై డివిజన్ బెంచ్ ముందు తెలంగాణ సర్కార్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌పై విచారణ  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ నందతో కూడిన ధర్మాసనం ముందు జరుగుతోంది. 

మాజీ సైనికుడికి భూమి ఇచ్చిన పత్రాలపై సంతకాలకు.. అప్పటి తాసిల్దార్‌ సంతకాలకు పొంతన లేదన్నారు. ఫోర్జరీ సంతకాలతో మాజీ సైనికుడికి కేటాయించినట్టుగా పత్రాలు సృష్టించారని, అతని నుంచి మరొక వ్యక్తి కొనుగోలు చేస్తే వారి నుంచి ప్రతివాదులు భూమిని కొనుగోలు చేశారని, హకులు లేని వ్యక్తుల నుంచి కొనుగోళ్లు చేయడం చెల్లదని చెప్పారు. ఆర్మీలో జవాన్లుగా పనిచేసినవారికి ఐదు ఎకరాలు ఇవ్వాలన్నది ప్రభుత్వ నిబంధన అని, కమాండర్‌ ఇన్‌ చీఫ్‌గా చేసిన నరసింహనాయక్‌కు ఆ పథకం వర్తించదని చెప్పారు. మాజీ సైనికులకు భూమి ఇవ్వాలని 1963లో అమలు చేస్తే అంతకు రెండేండ్ల ముందే నర్సింహనాయక్‌కు భూమి కేటాయించినట్టుగా బోగస్‌ పత్రాలు సృష్టించారని చెప్పారు. తాసిల్దార్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్టు ఫోరెన్సిక్‌ విభాగం నిర్ధారించిందని పేర్కొన్నారు. సంతకాల మధ్య పొంతన లేదని అన్నారు. ప్రభుత్వం ఆ భూమిని స్వాధీనం చేసుకున్నదని వివరించారు.   ఖానామెట్‌లో ప్రస్తుతం ఈ  భూమి విలువ వందల కోట్లు ఉంటుందని భావిస్తున్నారు. 

Published at : 14 Jul 2022 12:24 PM (IST) Tags: Telangana High Court Land Dispute Raghavendra Rao Khanamet Lands Government Lands Ramanaidu

సంబంధిత కథనాలు

TS Cabinet Meet : తెలంగాణ కేబినెట్ భేటీ, మునుగోడు ఉపఎన్నికపై చర్చ!

TS Cabinet Meet : తెలంగాణ కేబినెట్ భేటీ, మునుగోడు ఉపఎన్నికపై చర్చ!

Breaking News Live Telugu Updates: యూపీలో 50 మందితో వెళ్తున్న పడవ బోల్తా- నాలుగు మృతదేహాలు వెలికితీత

Breaking News Live Telugu Updates: యూపీలో 50 మందితో వెళ్తున్న పడవ బోల్తా- నాలుగు మృతదేహాలు వెలికితీత

YS Vijayamma : వైఎస్ విజయమ్మకు తప్పిన ప్రమాదం

YS Vijayamma : వైఎస్ విజయమ్మకు తప్పిన ప్రమాదం

Hyderabad Crime : జీడిమెట్లలో దారుణం, బ్యూటిషన్ పై స్నేహితుడే అత్యాచారం!

Hyderabad Crime : జీడిమెట్లలో దారుణం, బ్యూటిషన్ పై స్నేహితుడే అత్యాచారం!

Delhi Corona Guidelines: అక్కడ మాస్క్‌ తప్పనిసరి, పెట్టుకోకపోతే రూ.500 ఫైన్‌ కట్టాల్సిందే

Delhi Corona Guidelines: అక్కడ మాస్క్‌ తప్పనిసరి, పెట్టుకోకపోతే రూ.500 ఫైన్‌ కట్టాల్సిందే

టాప్ స్టోరీస్

Motorola X30 Pro: ప్రపంచంలోనే బెస్ట్ కెమెరా ఫోన్ - 200 + 50 + 12 మెగాపిక్సెల్ సెన్సార్లతో మోటొరోలా మొబైల్!

Motorola X30 Pro: ప్రపంచంలోనే బెస్ట్ కెమెరా ఫోన్ - 200 + 50 + 12 మెగాపిక్సెల్ సెన్సార్లతో మోటొరోలా మొబైల్!

SC On Political Parties: ఎన్నికల్లో ‘ఫ్రీ’లు చాలా సీరియస్, డిబేట్ అవసరం - నా రిటైర్మెంట్‌లోగా రండి: CJI

SC On Political Parties: ఎన్నికల్లో ‘ఫ్రీ’లు చాలా సీరియస్, డిబేట్ అవసరం - నా రిటైర్మెంట్‌లోగా రండి: CJI

Munugode Congress : "మునుగోడు" ఎలా గెలుద్దాం ? కాంగ్రెస్ సీనియర్ల తర్జన భర్జన !

Munugode Congress :

Normon And Foster : ఏపీ ప్రభుత్వం నుంచి బిల్లులు ఇప్పించండి - సుప్రీంకోర్టులో నార్మన్ ఫోస్టర్స్ పిటిషన్ !

Normon And Foster : ఏపీ ప్రభుత్వం నుంచి బిల్లులు ఇప్పించండి - సుప్రీంకోర్టులో నార్మన్ ఫోస్టర్స్ పిటిషన్ !