KTR: తెలంగాణలో తైవాన్ కంపెనీలకు అధిక ప్రాధాన్యత.. మంత్రి కేటీఆర్ వెల్లడి
తైవాన్ పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఇన్వెస్ట్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తైవాన్ – కనెక్ట్ అనే సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.
![KTR: తెలంగాణలో తైవాన్ కంపెనీలకు అధిక ప్రాధాన్యత.. మంత్రి కేటీఆర్ వెల్లడి Telanagan Minister KTR virtual meet with Taiwan Officials about investments in State KTR: తెలంగాణలో తైవాన్ కంపెనీలకు అధిక ప్రాధాన్యత.. మంత్రి కేటీఆర్ వెల్లడి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/30/5f2aeac1e893a0d5eb8a1ccd0658d5cf_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
తెలంగాణ రాష్ట్రం తైవాన్ పెట్టుబడులకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో తైవాన్ నుంచి భారీగా పెట్టుబడులు రానున్నట్లు తెలిపారు. ఇన్వెస్ట్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తైవాన్ – కనెక్ట్ (Taiwan - Connect) అనే సమావేశంలో కేటీఆర్ ఈ మేరకు వెల్లడించారు. వర్చువల్ విధానంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. తెలంగాణ, తైవాన్ మధ్య వ్యాపార వాణిజ్యాన్ని మరింత ప్రోత్సహించే ఉద్దేశంతో పెట్టుబడి అవకాశాలను కంపెనీలకు అవగాహన కల్పించే నేపథ్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. తైవాన్ పెట్టుబడులకు తెలంగాణ మొదటి నుంచి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. తెలంగాణ, తైవాన్ మధ్య ఇప్పటివరకు అద్భుతమైన భాగస్వామ్యం ఉందని అన్నారు. తైవాన్ పెట్టుబడుల కోసం ఆ దేశంలో పర్యటించిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తైవాన్ దేశానికి సంబంధించిన తైవాన్ కంప్యూటర్ అసోసియేషన్ (టీసీఏ) టెక్నాలజీ పార్ట్‌నర్‌షిప్ అగ్రిమెంట్ చేసిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. భారత్ తైవాన్ స్టార్టప్ అలయెన్స్‌ని ఏర్పాటు చేసిన ఏకైక ఇండియన్ సిటీగా హైదరాబాద్ ఉందని పేర్కొన్నారు.
Also Read: రైళ్ల రాకపోకల సమయాల్లో మార్పులు.. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి.. దక్షిణ మధ్య రైల్వే వెల్లడి
తైవాన్ పారిశ్రామిక సంస్కృతి భేష్..
తైవాన్ పారిశ్రామిక సంస్కృతి అద్భుతమని.. దీని నుంచి ప్రపంచం నేర్చుకోవాల్సింది చాలా ఉందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ దిశగా అక్కడి పారిశ్రామిక వర్గాలతో మరింత భాగస్వామ్యం కోసం ప్రయత్నిస్తామని చెప్పారు. 2020 నుంచి వ్యాపార వాణిజ్య పరిస్థితులకు కోవిడ్ వల్ల అనేక సవాళ్లు ఎదురయ్యాయని.. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ మరింత వేగంగా కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ గత ఐదేళ్లలో సాధించిన ప్రగతిని కేటీఆర్ ఈ సందర్భంగా వివరించారు.
Also Read: వైఎస్ షర్మిలతో ప్రశాంత్ కిషోర్ బృందం భేటీ.. పాదయాత్రపై చర్చ!
రాష్ట్ర జీడీపీ, తలసరి ఆదాయం పెరుగుతోంది..
తెలంగాణ జీడీపీ, తలసరి ఆదాయం క్రమంగా పెరుగుతోందని కేటీఆర్ వెల్లడించారు. రాష్ట్రం ఇప్పటికే సుమారు 32 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించిందని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విషయంలో రాష్ట్రం ఎప్పుడు అగ్ర స్థానంలో నిలుస్తుందని పేర్కొన్నారు. ఐటీ, దాని అనుబంధ రంగాల్లో తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధిస్తోందని వెల్లడించారు. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, పరిశోధన అభివృద్ధి రంగాల్లో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు తెలంగాణ ప్రయత్నిస్తోందని తెలిపారు. దీనిలో భాగంగా తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజాలను రాష్ట్రంలోకి ఆహ్వానించేందుకు తాము సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు.
IT & Industries Minister @KTRTRS virtually participated in the "Taiwan - Connect" Telangana State meeting hosted by @investindia. During the meeting, the Minister highlighted the investment opportunities for Taiwan based companies in Telangana. pic.twitter.com/MR4vhOQpZb
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) September 30, 2021
Also Read: నటుడు పోసాని ఇంటిపై ఇటుక రాళ్లతో దాడులు.. బూతులు తిడుతూ బీభత్సం
Also Read: కుళ్లిన స్థితిలో నటి శవం.. గది నుంచి తీవ్ర దుర్వాసన, ఏం జరిగిందంటే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)