అన్వేషించండి

క్రికెట్ ఆడిన వెంటనే నీళ్లు తాగి 17 ఏళ్ల కుర్రాడి మృతి - గుండెపోటే కారణమా?

UP News: 17 ఏళ్ల కుర్రాడు క్రికెట్ ఆడి వచ్చి నీళ్లు తాగిన వెంటనే కుప్ప కూలిపోయి మృతి చెందాడు.

UP News in Telugu:

17 ఏళ్ల కుర్రాడు మృతి..

యూపీలో అల్మోరా జిల్లాలో దారుణం జరిగింది. 17 ఏళ్ల కుర్రాడు క్రికెట్ ఆడిన వెంటనే నీళ్లు తాగి ప్రాణాలు కోల్పోయాడు. డిసెంబర్ 30వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. పదోతరగతి చదువుతున్న ప్రిన్స్ సైనీ ఫ్రెండ్స్‌తో కలిసి క్రికెట్ ఆడేందుకు వెళ్లాడు. ఆట అయిపోయిన వెంటనే కడుపు నిండా చల్లని నీళ్లు తాగాడు. తరవాత కాసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఒక్కసారిగా షాక్ అయిన స్నేహితులు బాధితుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతానికి ఇది అనుమానాస్పద మృతిగానే మిగిలిపోయింది. గుండెపోటు వల్ల చనిపోయి ఉంటాడని ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే...తల్లిదండ్రులు మాత్రం పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. గతంలోనూ ఇలాంటి మరణాలు నమోదయ్యాయి. క్రికెట్ ఆడుతుండగానే ఓ వ్యక్తి కుప్ప కూలిపోయాడు. గుండెపోటుతో మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.

చల్లని నీళ్లతో ప్రమాదం.. 

ఎండల్లో ఇంటికి వచ్చిన వెంటనే చాలామంది చేసే పని ఫ్రిజ్ లోంచి అతి చల్లని నీరు తీసి తాగడం. ఇది ధమనుల్లో ఆకస్మిక వాసోస్పాస్మ్ ఏర్పడడానికి కారణం అవుతుంది. అంటే ధమనులు కూచించుకుపోయి రక్త ప్రవాహానికి అడ్డు తగులుతాయి. ఈ పరిస్థితి గుండెపోటుకు కారణంగా మారుతుంది. కాబట్టి చల్లని నీరు గుండెపోటుకు ట్రిగ్గర్‌గా చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో చల్లని నీరును తాగడం మానుకోండి. ఎవరైనా జ్వరంతో బాధపడుతున్నప్పుడు శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకోవడం కోసం చల్లని నీరు తాగుతారు. గుండె సమస్య ఉన్న వారిలో ఇలా చల్లని నీరు తాగడం ప్రాణాంతకమైన కార్డియాక్ అరిథ్మియాను ప్రేరేపిస్తుంది. చల్లని నీరు తాగిన వెంటనే శరీరం తీవ్రమైన ప్రతిస్పందనను చూపిస్తుంది. ఆ ప్రతిస్పందనలో గుండెపోటు కూడా రావచ్చు. కాబట్టి చల్లని నీరు తాగడం తగ్గించాలి.

ఇలా చేయాలి..

వైద్యులు చెబుతున్న ప్రకారం ఎల్లప్పుడూ గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీటిని తాగాలి. ఇలా తాగడం వల్ల అవయవ వ్యవస్థ ఆరోగ్యం చక్కగా ఉంటుంది. శరీరం నుండి బ్యాక్టీరియా బయటికి పోతుంది. ఆక్సిజన్, పోషకాల రవాణా రక్తం ద్వారా సవ్యంగా జరుగుతుంది. శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. హృదయ స్పందనలో స్థిరత్వం ఉంటుంది. గుండె కొట్టుకునే వేగం పెరగడం, తగ్గడం వంటివి జరగదు. కాబట్టి అతి చల్లని నీరు తాగడం మానుకోవాలి. గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీటినే తాగడం అలవాటు చేసుకోవాలి. ఎవరికైనా హఠాత్తుగా గుండె ఆగిపోతే... వారి పక్కన ఉన్నవారు మళ్ళీ గుండెను కొట్టుకునేలా చేసే ప్రక్రియ CPR. దీని గురించి ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవడం చాలా అవసరం. ఇది ఎలా చేయాలో తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. మీ ఎదురుగా ఎవరైనా స్పృహ కోల్పోయినట్టు కనిపిస్తే తేలికగా తీసుకోకండి. గుండెపోటు వల్ల వారు పడిపోతే, ఆ వ్యక్తి వద్దకు వెళ్లి రెండు భుజాలను పట్టుకుని గట్టిగా ఊపుతూ వారిని లేపడానికి ప్రయత్నించాలి. ఎంతగా ఊపినా వారు లేవకపోతే, వారు ఊపిరి తీసుకుంటున్నారో లేదో గమనించాలి. ఊపిరి తీసుకోకపోతే వెంటనే ఆ వ్యక్తికి గాలి ఆడేలాగా చేయాలి. బిగుతైన దుస్తులు వేసుకుంటే వాటిని విప్పేయాలి. 

Also Read: బాహుబలిజీ రెజ్లర్ల కన్నీళ్ల కన్నా విలువైందా మీ గొప్పదనం - మోదీపై రాహుల్ సెటైర్లు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

మేడారంలో భక్తులకు హెలికాప్టర్‌ సేవలు, 7 నిముషాలు ఏరియల్‌ వ్యూ చూసేందుకు ఛార్జీ ఎంతో తెలుసా?
మేడారంలో భక్తులకు హెలికాప్టర్‌ సేవలు, 7 నిముషాలు ఏరియల్‌ వ్యూ చూసేందుకు ఛార్జీ ఎంతో తెలుసా?
Disqualification of YSRCP MLAs: వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హతకు స్పీకర్ రోడ్ మ్యాప్ - జగన్ ఎలా కాపాడుకుంటారు?
వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హతకు స్పీకర్ రోడ్ మ్యాప్ - జగన్ ఎలా కాపాడుకుంటారు?
Governor vs Govt in Karnataka : కర్ణాటకలో గవర్నర్ వర్సెస్‌ ప్రభుత్వం; జీ రామ్‌జీ బిల్లుకు వ్యతిరేకంగా స్పీచ్‌ ఉందని చదివేందుకు థావర్ చంద్ గెహ్లాట్ నిరాకరణ
కర్ణాటకలో గవర్నర్ వర్సెస్‌ ప్రభుత్వం; జీ రామ్‌జీ బిల్లుకు వ్యతిరేకంగా స్పీచ్‌ ఉందని చదివేందుకు థావర్ చంద్ గెహ్లాట్ నిరాకరణ
Kamareddy Crime News:కామారెడ్డిలో మూగ జీవాలపై ఘాతుకం- కోతులకు విషం! 15 వానరాలు మృతి!
కామారెడ్డిలో మూగ జీవాలపై ఘాతుకం- కోతులకు విషం! 15 వానరాలు మృతి!

వీడియోలు

Medaram Jathara Pagididda Raju History | పడిగిద్ద రాజు దేవాలయం కథేంటి.? | ABP Desam
Medaram Jatara Day 1 Speciality | మేడారం జాతర మొదటి రోజు ప్రత్యేకత ఇదే | ABP Desam
MI vs DC WPL 2026 | ముంబై ఢిల్లీ విజయం
Rohit, Virat BCCI Contracts Changes | విరాట్​, రోహిత్​కు బీసీసీఐ షాక్?
Ishan Kishan Ind vs NZ T20 | ఇషాన్ కిషన్ పై సూర్య సంచలన ప్రకటన

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
మేడారంలో భక్తులకు హెలికాప్టర్‌ సేవలు, 7 నిముషాలు ఏరియల్‌ వ్యూ చూసేందుకు ఛార్జీ ఎంతో తెలుసా?
మేడారంలో భక్తులకు హెలికాప్టర్‌ సేవలు, 7 నిముషాలు ఏరియల్‌ వ్యూ చూసేందుకు ఛార్జీ ఎంతో తెలుసా?
Disqualification of YSRCP MLAs: వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హతకు స్పీకర్ రోడ్ మ్యాప్ - జగన్ ఎలా కాపాడుకుంటారు?
వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హతకు స్పీకర్ రోడ్ మ్యాప్ - జగన్ ఎలా కాపాడుకుంటారు?
Governor vs Govt in Karnataka : కర్ణాటకలో గవర్నర్ వర్సెస్‌ ప్రభుత్వం; జీ రామ్‌జీ బిల్లుకు వ్యతిరేకంగా స్పీచ్‌ ఉందని చదివేందుకు థావర్ చంద్ గెహ్లాట్ నిరాకరణ
కర్ణాటకలో గవర్నర్ వర్సెస్‌ ప్రభుత్వం; జీ రామ్‌జీ బిల్లుకు వ్యతిరేకంగా స్పీచ్‌ ఉందని చదివేందుకు థావర్ చంద్ గెహ్లాట్ నిరాకరణ
Kamareddy Crime News:కామారెడ్డిలో మూగ జీవాలపై ఘాతుకం- కోతులకు విషం! 15 వానరాలు మృతి!
కామారెడ్డిలో మూగ జీవాలపై ఘాతుకం- కోతులకు విషం! 15 వానరాలు మృతి!
Atreyapuram Brothers: ఆత్రేయపురం పూతరేకులు కాదు... బ్రదర్స్ అండీ - 'శుభం' ఫేమ్ శ్రీనివాస్ గవిరెడ్డి కొత్త సినిమా
ఆత్రేయపురం పూతరేకులు కాదు... బ్రదర్స్ అండీ - 'శుభం' ఫేమ్ శ్రీనివాస్ గవిరెడ్డి కొత్త సినిమా
బ్యాడ్‌న్యూస్‌: దేశంలోనే నంబర్‌ 1 బైక్‌ Hero Splendor Plus ధర పెంపు, కొత్త ధరల లిస్ట్‌ ఇదిగో!
బ్యాడ్‌న్యూస్‌, పల్లె నుంచి పట్నం దాకా సామాన్యులు వాడే ఈ బైక్‌ రేటు పెంపు
Dhurandhar OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'ధురంధర్' - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎప్పటి నుంచంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'ధురంధర్' - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎప్పటి నుంచంటే?
Ee Nagaraniki Emaindi Sequel Cast: 'యానిమల్' నుంచి ఈ నగరానికి... తరుణ్ భాస్కర్ సినిమాలో హీరోగా 'హిట్' యాక్టర్!
'యానిమల్' నుంచి ఈ నగరానికి... తరుణ్ భాస్కర్ సినిమాలో హీరోగా 'హిట్' యాక్టర్!
Embed widget