బాహుబలిజీ రెజ్లర్ల కన్నీళ్ల కన్నా విలువైందా మీ గొప్పదనం - మోదీపై రాహుల్ సెటైర్లు
Vinesh Phogat: వినేష్ ఫోగట్ తన అవార్డులను ఇచ్చిన నేపథ్యంలో ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ X వేదికగా తీవ్ర విమర్శలు చేశారు.
Vinesh Phogat Returns Awards:
రాహుల్ ఆగ్రహం..
రెజ్లర్లు వినేశ్ ఫోగట్ తన ఖేల్ రత్న, అర్జున అవార్డులను తిరిగి ఇచ్చేశారు. తమకు న్యాయం జరగలేదన్న అసహనంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై సెటైర్లు వేశారు. X వేదికగా విమర్శలు గుప్పించారు. WFI మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ పేరు ప్రస్తావించకుండానే పరోక్షంగా విమర్శించారు. మొత్తం దేశాన్ని కాపాడాల్సిన వ్యక్తి ఇలా వ్యవహరించడం చాలా బాధగా ఉందంటూ ప్రధాని మోదీ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాలే మహిళా రెజ్లర్లు ఇలా కన్నీళ్లు పెట్టుకునేలా చేశాయేమో అంటూ మండి పడ్డారు.
"ప్రధాని అంటే దేశాన్ని కాపాడాల్సిన వ్యక్తి. కానీ మహిళా రెజ్లర్ల విషయంలో మాత్రం ఇలా వ్యవహరించడం చాలా బాధగా ఉంది. దేశంలోని ప్రతి యువతికి ఆత్మగౌరవమే ముఖ్యం. ఆ తరవాతే మెడల్స్, అవార్డుల గురించి ఆలోచిస్తారు. బహుశా బాహుబలి (ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ) నుంచి ఆ వ్యక్తికి (బ్రిజ్ భూషణ్) రాజకీయ ప్రయోజనాలు అందాయా? మీ ప్రతిష్ఠ రెజ్లర్ల కన్నీళ్ల కన్నా గొప్పదా"
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత
देश की हर बेटी के लिये आत्मसम्मान पहले है, अन्य कोई भी पदक या सम्मान उसके बाद।
— Rahul Gandhi (@RahulGandhi) December 31, 2023
आज क्या एक ‘घोषित बाहुबली’ से मिलने वाले ‘राजनीतिक फायदे’ की कीमत इन बहादुर बेटियों के आंसुओं से अधिक हो गई?
प्रधानमंत्री राष्ट्र का अभिभावक होता है, उसकी ऐसी निष्ठुरता देख पीड़ा होती है। pic.twitter.com/XpoU6mY1w9
ప్రముఖ మహిళా రెజ్లర్ వినేష్ షోగట్ తన అవార్డులను న్యూఢిల్లీలోని ప్రధాన మంత్రి కార్యాలయం ఎదుట వదిలేయడానికి ప్రయత్నించారు. అయితే ఆమెను కర్తవ్య పథ్ వద్ద పోలీసులు అడ్డగించారు. దీంతో వినేష్ ఫోగట్ తన అవార్డులను కర్తవ్య పథ్ వద్ద పేవ్‌మెంట్‌పై వదిలేశారు. దేశంలో మహిళా రెజ్లర్లకు న్యాయం జరగడం లేదని తన నిరుత్సాహాన్ని వ్యక్తం చేస్తూ అర్జున, ఖేల్‌రత్న అవార్డులను తిరిగి ఇచ్చేస్తానని వినేష్ ఫోగట్ గతంలోనే లేఖ ద్వారా తెలిపారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై భారత టాప్ రెజ్లర్లు వినేష్ ఫోగట్, సాక్షి మలిక్, బజ్‌రంగ్ పూనియా లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ‘నేను మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న, అర్జున అవార్డులను పొందాను. కానీ వాటిని నా జీవితంలో ఉంచుకోవడంలో ఏమాత్రం అర్థం లేదు. ప్రతి మహిళ తన జీవితాన్ని గౌరవంగా జీవించాలని అనుకుంటుంది. కాబట్టి ప్రధాన మంత్రి గారూ... నేను నా మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న, అర్జున అవార్డులను వెనక్కి ఇచ్చేయాలని అనుకుంటున్నాను. కాబట్టి ఇకమై మేం గౌరవంగా జీవించాలనుకునే జీవితంలో ఈ అవార్డులు నాకు భారం కాబోవు.’ అని వినేష్ ఫోగట్ ప్రధాన మంత్రికి లేఖ రాశారు.
Also Read: Mann Ki Baat: అయోధ్య రాముడి కోసం భజనలు చేయండి, భక్తిని చాటుకోండి - మన్‌కీ బాత్‌లో ప్రధాని