By: ABP Desam | Updated at : 30 Jan 2023 01:11 PM (IST)
Edited By: jyothi
టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడికి తీవ్ర అస్వస్థత
Batchula Arjunudu Hospitalised: టీడీపీకి చెందిన మరో నేత అస్వస్థతకు గురయ్యారు. విజయవాడకు చెందిన టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం తెల్లవారుజామున ఆయనకు తీవ్రమైన గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు విజయవాడలోని రమేష్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆయనకు స్టంట్ వేశారు. బీపీ ఎక్కువగా ఉండటం వల్లే ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని చెప్పారు. ఎప్పటికప్పుడు అర్జునుడి ఆరోగ్య పరిస్థితిని పరీక్షిస్తున్నట్లు తెలిపారు. అర్డునుడి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన చంద్రబాబు.. ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు.
బచ్చుల అర్జునుడు టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1995 నుండి 2000 వరకు ప్రైమరీ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ సొసైటీ (పి.ఏ.సి.ఎస్) అధ్యక్షుడిగా పని చేశారు. ఆయన 2000 నుంచి 2005 వరకు మచిలీపట్నం మున్సిపాలిటీ ఛైర్మన్‌గా పని చేశాడు. బచ్చుల అర్జునుడు 2014లో కృష్ణా జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా నియమితుడై.. 2017లో జరిగిన ఎన్నికల్లో శాసన సభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయన 2020లో టీడీపీ కేంద్ర కమిటీ క్షమశిక్షణా కమిటీ చైర్మన్‌గా నియమితుడయ్యారు.
కోలుకుంటున్న తారకరత్న
నందమూరి తారకరత్న ఆరోగ్య విషయంపై ఆయన బాబాయి నందమూరి బాలకృష్ణ స్పందించారు. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపారు. అవయవాలు అన్నీ బాగానే పని చేస్తున్నాయని అన్నారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ, ఆరోగ్యం మెరుగుపడడం కోసం ఎదురు చూస్తున్నామని అన్నారు. గుండెలో క్లాట్ అవడం, కాస్త ఇంటర్నల్ బ్లీడింగ్ అవడం వల్ల స్టంట్ వేయడం కుదరలేదని చెప్పారు. ప్రస్తుతం వైద్యులు స్టెప్ బై స్టెప్ పర్యవేక్షిస్తున్నారని అన్నారు.
బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో హైదరాబాద్ నుంచి వచ్చిన గుండె వైద్య నిపుణులు వైద్యం చేస్తున్నారని బాలకృష్ణ చెప్పారు. ఆస్పత్రిలో వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. అభిమానుల ప్రార్థనలు, ఆశీస్సులతో తారకరత్న త్వరలోనే కోలుకుంటారని బాలకృష్ణ ఆకాంక్షించారు.
తారకరత్న ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆయన ప్రస్తుతం పోరాడుతున్నాడని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. ప్రత్యేక విమానంలో బెంగళూరుకు వెళ్లిన ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ తారకరత్నను చూసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. తారకరత్న ఎక్మోపై లేరని ఎన్టీఆర్ స్పష్టం చేశారు. వైద్యులు చేస్తున్న చికిత్సకు స్పందిస్తుండడం కాస్త ఊరటనిచ్చే అంశమని అన్నారు. అయితే, క్రిటికల్ కండిషన్ నుంచి బయటపడ్డారని చెప్పలేమని అన్నారు. తన అన్న తారకరత్నకు ఎన్‌హెచ్ హాస్పిటల్‌లో మెరుగైన వైద్యం అందుతోందని అన్నారు. ఆత్మబలం, మనోబలం, అభిమానుల ఆశీస్సులు, తాతగారి ఆశీస్సులతో మళ్లీ కోలుకొని, ఇంతకుముందులాగే మనందరితో కలిసి తిరగాలని ఆకాంక్షించారు. ఇలాంటి పరిస్థితిలో తమకు అండగా నిలిచిన కర్ణాటక ప్రభుత్వానికి, తనకు ఆప్తుడైన కర్ణాటక ఆరోగ్య మంత్రి కేశవ సుధాకర్ కు ఎన్టీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
అభిమానుల ఆశీస్సులు, ప్రార్థనల ఫలితంగా తారకరత్న త్వరగా కోలుకోవాలని కల్యాణ్ రామ్ ఆకాంక్షించారు. అభిమానులు ప్రార్థనలు చేయాలని పిలుపునిచ్చారు.
బెంగళూరుకు ప్రత్యేక విమానంలో నందమూరి కుటుంబ సభ్యులు
తారక రత్నను చూసేందుకు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, నారా బ్రహ్మిణీ వీరితో పాటే టీడీపీ అధినేత చంద్రబాబు కోడలు, లోకేష్ భార్య నారా బ్రాహ్మణి కూడా ఆస్పత్రికి వచ్చారు. ముందుగా తారకరత్నను చూసిన కుటుంబ సభ్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తారకరత్న ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని వైద్యులు వారికి తెలిపారు. అవసరమైతే విదేశాల నుంచి ఎక్స్‌పర్ట్స్‌ను పిలిపించాలని జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ సహా కుటుంబ సభ్యులంతా కోరినట్లు తెలుస్తోంది.
తారకరత్న ఆరోగ్య పరిస్థితులపై కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి సుధాకరన్ కూడా ఆరా తీశారు. నారాయణ హృదయాలకు వచ్చి వైద్యులతో మాట్లాడారు. కుటుంబ సభ్యులకు పూర్తి సమాచారం తెలియజేయాలని ముఖ్యమంత్రి బొమ్మై.. మంత్రిని ఆదేశించినట్లు సమాచారం. అనంతరం జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తో కూడా మంత్రి మాట్లాడారు.
కొత్త విధానంలో ఇంటర్ మూల్యాంకనం, ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?
TS Constable Technical Papers: నేడే కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ టెక్నికల్ పరీక్షలు!
Dogs Attack: రాత్రిళ్లు సంచరించే కుక్కలను పట్టుకోడానికి ప్రత్యేక టీంలు
Inter Academic Calender: ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ విడుదల, ఈ ఏడాది వచ్చే సెలవులివే!
TS Police SI Exam: ఏప్రిల్ 3 నుంచి ఎస్ఐ, ఏఎస్ఐ తుదిపరీక్ష హాల్‌టికెట్లు, పరీక్షలు ఎప్పుడంటే?
RGV On Jagan Governament : సీఎం జగన్ అసెంబ్లీని ఎప్పుడు రద్దు చేస్తారో చెప్పేసిన ఆర్జీవీ - కానీ చిన్న ట్విస్ట్ ఉందండోయ్ ..
Samantha : అమ్మది అలెప్పీ అయినా మలయాళం నేర్పలేదు - కొచ్చిలో తల్లిపై సమంత కంప్లైంట్
LSG Vs DC: వార్నర్ సేనను మట్టికరిపించిన లక్నో - 50 పరుగులతో ఘనవిజయం!
Lokesh On Kethireddy : చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు- గుడ్ మార్నింగ్ మహానటుడు అంటూ కేతిరెడ్డిపై లోకేశ్ సెటైర్లు