Afghanistan Crisis: ఉత్కంఠగా అఫ్గానిస్తాన్ నుంచి అధికారుల తరలింపు... ఐటీబీపీ సాహసం... కమాండోలలో తెలుగు వ్యక్తి రాజశేఖర్
అఫ్గానిస్థాన్ నుంచి భారతీయ అధికారుల తరలింపునకు అడుగడుగునా అడ్డంకులే. ఈ అడ్డంకులన్నింటినీ ఎదుర్కొని దౌత్య అధికారులను దేశానికి తరలించిన ఐటీబీపీ కమాండోలలో మన తెలుగు వాడు రాజశేఖర్ కూడా ఒకరు.
అఫ్గానిస్థాన్ లో తాలిబన్ల తుపాకీ రాజ్యమేలుతోంది. ఎక్కడికక్కడ ఆంక్షలు.. మహిళల పరిస్థితి మరింత దయనీయం. దేశం విడిచి వెళ్లే దారిలేక.. తాలిబన్ల పాలనలో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఎక్కడ చూసిన తుపాకులతో తాలిబన్లు గుంపులు గుంపుగా కనిపిస్తున్నారు. అంతటి ఉద్రిక్త పరిస్థితుల నుంచి భారతీయులను దేశానికి తీసుకురావడం సామాన్య విషయం కాదు. ప్రాణాలతో బయటపడతామో లేదో తెలియని పరిస్థితుల్లో తీవ్ర ఆందోళనలో ఉన్న భారతీయుల్లో మనో ధైర్యం నింపి వారిని దేశానికి తీసుకొచ్చారు ఐటీబీపీ కమాండోల బృందం. ఈ బృందంలో ఏపీలోని శ్రీకాకుళానికి చెందిన రాజశేఖర్ కూడా ఉన్నారు.
రెండు బృందాలుగా తరలింపు
గత రెండేళ్లుగా అఫ్గానిస్థాన్ లోని భారత రాయబార కార్యాలయంలో ఐటీబీపీ కమాండర్ గా రాజశేఖర్ విధులు నిర్వహిస్తున్నారు. కాబుల్‌లోని భారత రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న వారిని దేశానికి తరలించేదుకు చేపట్టిన ఆపరేషన్ లో రాజశేఖర్ పాల్గొన్నారు. తాలిబన్లు అఫ్గానిస్థాన్‌లోని ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమిస్తూ కాబుల్‌లోకి ప్రవేశించారు. ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం పారిపోవడంతో భద్రతా దళాలు చేతులెత్తేశాయి. దీంతో ఆగస్టు 14కి తాలిబన్లు కాబుల్‌ని హస్తగతం చేసుకున్నారు. ఈ సమాచారంతో భారత రాయబార కార్యాలయ సిబ్బందిని తరలించాలని భారత ప్రభుత్వం ఆదేశించింది. మొత్తం సిబ్బందిని రెండు బృందాలుగా విభజించి తరలించాలని నిర్ణయించారు. మొదటి బృందంలో విదేశాంగశాఖ అధికారులు 20 మంది, రక్షణగా 25 మంది భద్రతా సిబ్బందిని తరలించాలని నిర్ణయించారు.
Viral Video: కటౌట్ చూసి అన్నీ నమ్మేయొద్దు డ్యూడ్... ఈ బామ్మ ఇంగ్లీష్ వింటే మీరు కూడా నిజమే అంటారు
రెండు సార్లు అడ్డగింత
15న రాత్రి 8.30 గంటలకు 45 మంది బృందంతో భారత రాయబార కార్యాలయం నుంచి బయలుదేరి టర్కీస్ ఎయిర్‌బేస్ చేరుకున్నామని ఐటీబీపీ సీనియర్ కమాండర్ రాజశేఖర్ తెలిపారు. రోడ్డు పొడవునా జనాలున్నారన్నారు. వారిలో తాలిబన్లు వారిలో తాలిబన్లు ఉన్నారేమో చూసుకుంటూ ముందుకెళ్లామని తెలిపారు. మొదటి బృందాన్ని 16వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు భారత్ కు తరలించారు. రెండో బృందంలో తరలింపు సమయానికి కాబుల్ తాలిబన్ల వశమైపోయింది. రాత్రి కర్ఫ్యూ ఉందని, వెళ్లడానికి వీల్లేదని తాలిబన్లు అడ్డుకున్నారని రాజశేఖర్ తెలిపారు. రాత్రి 11 గంటల సమయంలో మరో మార్గంలో టర్కీస్ ఎయిర్‌బేస్ వద్దకు బయలుదేరితే దారి మధ్యలో తాలిబన్లు అడ్డగించడంతో రెండోసారీ వెనుదిరిగామని ఆయన తెలిపారు.
Also Read: Afghanistan Crisis: మహిళా న్యూస్ యాంకర్లపై తాలిబన్ల నిషేధం
తాలిబన్ల భద్రత మధ్యే...
పరిస్థితి తీవ్రత పెరుగుతుండటంతో 16వ తేదీ ఉదయం భారత రాయబార కార్యాలయం అధికారులు తాలిబన్లతో చర్చించారు. సంప్రదింపుల తర్వాత అధికారుల తరలింపునకు అనుమతిచ్చారు. తాలిబన్లు ఎస్కార్ట్‌గా వచ్చి 17వ తేదీ వేకువజామున టర్కీస్ ఎయిర్‌బేస్‌కు చేర్చారు. ఉదయం 7 గంటలకు బయల్దేరి జామ్‌నగర్ మీదుగా సాయంత్రానికి ఢిల్లీ చేరుకున్నామని రాజశేఖర్ తెలిపారు.
Also Read: Afghanistan Taliban Crisis: ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్ల కసరత్తు.. మాజీ అధ్యక్షుడితో భేటీ