Sri Lanka Loan From India: చమురు కొనుగోళ్ల కోసం భారత్‌ సాయం కోరిన శ్రీ లంక

చమురు కొనుగోళ్ల కోసం 500 మిలియన్ డాలర్ల రుణం ఇవ్వాలని భారత్‌ను శ్రీలంక కోరింది.

FOLLOW US: 

శ్రీలంక ఆర్థిక స్థితి దారుణంగా మారింది. ముఖ్యంగా విదేశీ మారకద్రవ్య సంక్షోభం తీవ్రమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకు తగ్గట్లే ఆ దేశంలో చమురు కొనుగోళ్లకు చెల్లించేందుకు కూడా నిధులు లేవు. దీంతో భారత్ సాయాన్ని కోరింది శ్రీలంక.

చమురు కొనుగోళ్ల కోసం 500 మిలియన్ డాలర్ల రుణం ఇవ్వాలని భారత్‌ను శ్రీలంక కోరింది. తమ వద్ద ఉన్న చమురు నిల్వలు వచ్చే జనవరి వరకు మాత్రమే సరిపోతాయని ఇటీవల ఆ దేశ ఇంధన శాఖ మంత్రి ఉదయ గమ్మన్‌పిలా అన్నారు.

" భారత్ నుంచి 500 మిలియన్ డాలర్ల రుణం కోసం ఆ దేశ హైకమిషన్‌లో ప్రయత్నిస్తున్నాం. ఇండో- శ్రీలంక ఎకనామిక్ పార్టనర్ షిప్ ఒప్పందంలో భాగంగా ఈ సాయం కోరాం.                        "
-సుమిత్ విజయ్‌సింఘే, సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ ఛైర్మన్

ఈ నిధులు పెట్రోలియం, డీజిల్ దిగుమతులకు వినియోగించనున్నట్లు ఆయన తెలిపారు. త్వరలో భారత్, శ్రీలంక ఇంధన శాఖ కార్యదర్శులు ఒప్పందాలపై సంతకాలు చేసే అవకాశం ఉంది.

శ్రీలంకకు కరోనా మహమ్మారి దెబ్బకు ఎగుమతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పర్యటక రంగంపై కూడాా ఈ ప్రభావం తీవ్రంగా పడింది. ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు కూడా ఆ దేశ విదేశీ మారక ద్రవ్యం నిల్వలు భారీగా పడిపోయాయి. ప్రస్తుతం తీవ్ర ఆహార, ఆర్థిక సంక్షోభాన్ని శ్రీలంక ఎదుర్కొంటోంది. దీంతో భారత్ సహా మిత్ర దేశాల సాయం కోరుతోంది.

ఆహార సంక్షోభం..

శ్రీలంకలో ఆహార సంక్షోభం ముదురుతోంది. దీనికి కారణం.. విదేశీ పైసల నిల్వలు పడిపోవడం ఒకటైతే రెండోది సేంద్రియ సాగును కచ్చితం చేయడం. అంతేకాదు విదేశాల నుంచి తిండి గింజలను, పాల పొడులను, పప్పు ధాన్యాల దిగుమతులను నిషేధించింది. ఇవన్నీ కలిసి శ్రీలంకలో తిండికి తిప్పలను తెచ్చిపెట్టాయి. బియ్యం, చక్కెర, పాలపొడి, పప్పులు, చిరుధాన్యాలు, తృణధాన్యాలకు కొరత భారీగా పెరిగింది. పప్పులు, చక్కెరల ధరలు రెట్టింపయ్యాయి. కొందరు వ్యాపారులు దానినే అదనుగా చేసుకుని తిండిపదార్థాలను బ్లాక్​ చేసేశారు. ఇంత జరుగుతున్నా తిండి సంక్షోభం ఏమీ లేదంటూనే ఇటీవల దేశంలో ఆర్థిక ఎమర్జెన్సీని ప్రకటించారు ఆ దేశాధ్యక్షుడు గోటబయా రాజపక్స. 

Also Read: Kerala Rain Fury: కేరళలో మహా విలయం.. వర్షాలు, వరదల ధాటికి 21 మంది మృతి

Also Read: హైదరాబాద్‌లో ఉల్టా సీన్.. యువకుడి న్యూడ్ వీడియోలతో యువతి బ్లాక్ మెయిల్

Also Read: భర్త నిద్రిస్తుండగా అక్కడ వేడి వేడి నీళ్లు పోసిన భార్య

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: India loan Sri Lanka Crude oil

సంబంధిత కథనాలు

Vemulawada Kid Kidnap Case: గంటల వ్యవధిలో చిన్నారి కిడ్నాప్ కేసును ఛేదించిన వేములవాడ పోలీసులు, క్షేమంగా తల్లీ ఒడికి బాలుడు

Vemulawada Kid Kidnap Case: గంటల వ్యవధిలో చిన్నారి కిడ్నాప్ కేసును ఛేదించిన వేములవాడ పోలీసులు, క్షేమంగా తల్లీ ఒడికి బాలుడు

Bandi Sanjay About KCR: కేసీఆర్ పాతబస్తీకి పోవాలంటే ఒవైసీ పర్మిషన్ తీసుకోవాలి: సీఎంపై బండి సంజయ్ సెటైర్స్

Bandi Sanjay About KCR: కేసీఆర్ పాతబస్తీకి పోవాలంటే ఒవైసీ పర్మిషన్ తీసుకోవాలి: సీఎంపై బండి సంజయ్ సెటైర్స్

Breaking News Live Updates: క్షేమంగానే ఉన్నాను, ఆధారాలతో వస్తున్నాను: నటి కరాటే కళ్యాణి

Breaking News Live Updates: క్షేమంగానే ఉన్నాను, ఆధారాలతో వస్తున్నాను: నటి కరాటే కళ్యాణి

Ukraine Winner : యుద్ధంలో విన్నర్ ఉక్రెయిన్ - డిసైడయ్యేది ఎప్పుడంటే ?

Ukraine Winner :  యుద్ధంలో విన్నర్ ఉక్రెయిన్ - డిసైడయ్యేది ఎప్పుడంటే ?

Nellore Candle Rally Protest: తలలు నిమిరారు, బుగ్గలు తమిడారు, ఇప్పుడెక్కడికి పోయారు: సీఎం జగన్‌కు మహిళల సూటిప్రశ్న

Nellore Candle Rally Protest: తలలు నిమిరారు, బుగ్గలు తమిడారు, ఇప్పుడెక్కడికి పోయారు: సీఎం జగన్‌కు మహిళల సూటిప్రశ్న
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Mahesh Babu: ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్ - స్టేజ్ ఎక్కి డాన్స్ చేసిన మహేష్

Mahesh Babu: ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్ - స్టేజ్ ఎక్కి డాన్స్ చేసిన మహేష్

Sony Xperia Ace III: అత్యంత చవకైన సోనీ 5జీ ఫోన్ వచ్చేసింది - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Sony Xperia Ace III: అత్యంత చవకైన సోనీ 5జీ ఫోన్ వచ్చేసింది - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Karate Kalyani Counter : పాప తల్లిదండ్రులతో మీడియా ముందుకు కరాటే కల్యాణి - తనపై భారీ కుట్ర జరుగుతోందని ఆరోపణ !

Karate Kalyani Counter : పాప తల్లిదండ్రులతో మీడియా ముందుకు కరాటే కల్యాణి - తనపై భారీ కుట్ర జరుగుతోందని ఆరోపణ !

Tecno Pova 3: 50 మెగాపిక్సెల్ కెమెరా, 7000 ఎంఏహెచ్ బ్యాటరీతో స్మార్ట్ ఫోన్ - ధర రూ.14 వేలలోపే!

Tecno Pova 3: 50 మెగాపిక్సెల్ కెమెరా, 7000 ఎంఏహెచ్ బ్యాటరీతో స్మార్ట్ ఫోన్ - ధర రూ.14 వేలలోపే!