(Source: ECI/ABP News/ABP Majha)
Spacex Fires Employees: జీతమిచ్చే వాళ్లపై జోక్‌లేస్తే జీవితం తలకిందులైపోక తప్పదు-స్పేస్ ఉద్యోగులకు గట్టి షాక్
ఎలన్ మస్క్‌ని విమర్శిస్తూ లేఖ రాసినందుకు ఉద్యోగులను తొలగించింది స్పేస్ ఎక్స్ సంస్థ. పని పరంగా టార్చర్ పెడుతున్నారంటున్న ఉద్యోగులు.
బాస్ మాటనే కాదంటారా..అనుభవించండి..
బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనేది కార్పొరేట్ ప్రపంచంలో తరచుగా వినిపించే మాట. అది తప్పైనా, ఒప్పైనా ఉద్యోగులు సైలెంట్‌గా ఉండాల్సిందే. లేదని, కాదని వాదిస్తే "ఖాన్‌తో గేమ్స్ ఆడొద్దు" అంటూ వార్నింగ్ ఇచ్చేస్తారు బాస్‌లు. ఇక పరిధి దాటి విమర్శించారా అంతే సంగతులు. ఉద్యోగం ఊడిపోక తప్పదు. స్పేస్‌ఎక్స్ సంస్థలోనూ ఇప్పుడిదే జరిగింది. తనను విమర్శించారనే కారణంగా ఉద్యోగులను తొలగించాడు స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్. పని పరంగా విపరీతమైన ఒత్తిడి తీసుకొస్తున్నాడని, చాలా ఇబ్బంది పెడుతున్నాడని కొందరు ఉద్యోగులు ఓ లెటర్‌ని బాగా సర్కులేట్ చేశారట. ఇది అటు ఇటు తిరిగి చివరకు స్పేస్‌ఎక్స్ అధ్యక్షుడు గ్వైన్ షాట్‌వెల్ కంట పడింది. ఆ లెటర్ చూడగానే ఆయన షాక్ అయ్యారు. విషయం ఎలన్ మస్క్ వరకూ వెళ్లే సరికి ఆ ఉద్యోగుల్ని వెంటనే తొలగించారు. అమెరికాలోని కొన్ని వార్తా సంస్థలు ఇదే విషయాన్ని ధ్రువీకరించాయి. స్పేస్‌ఎక్స్ అధ్యక్షుడు గ్వైన్ షాట్‌వెల్ ఈ వివరాల్ని వెల్లడించిట్టు ప్రచురించాయి.
వివాదాలకు కేరాఫ్ అడ్రెస్‌గా ఎలన్ మస్క్
మొదటగా న్యూయార్క్ టైమ్స్ ఈ విషయాన్ని ప్రపంచానికి వెల్లడించింది. స్పేస్‌ఎక్స్‌లో పని చేసే ముగ్గురు ఉద్యోగుల నుంచి సమాచారం సేకరించి ధ్రువీకరించినట్టు తెలుస్తోంది. అయితే ఎంత మంది ఉద్యోగులను ఫైర్ చేశారన్న విషయంలో మాత్రం స్పష్టత రాలేదు. హద్దులు దాటి ప్రవర్తించిన అందరినీ తొలగించినట్టు తెలుస్తోంది. ఇదంతా ఎందుకు జరిగింది అంటే ఓ విషయంలో ఎలన్ మస్క్ నిర్ణయంతో కొందరు ఉద్యోగులు విభేదించారట. అది సరికాదని అసంతృప్తి వ్యక్తం చేశారట. ఇదే ఎలన్ మస్క్‌కి ఆగ్రహం కలిగించింది. తమ వ్యతిరేకతను ఈ స్థాయిలో వ్యక్తం చేయాల్సిన అవసరం ఏముంది అన్నది స్పేస్ఎక్స్ వాదన. అయితే ఉద్యోగులు మాత్రం తమపై పని ఒత్తిడి విపరీతంగా ఉండటం వల్లే ఇలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చిందని వివరణ ఇస్తున్నారు.
ఈ మధ్య కాలంలో ఎలన్ మస్క్ వైఖరిపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. బిల్‌గేట్స్‌తో జరిగిన ఓ ఆన్‌లైన్ సమ్మిట్‌లో మస్క్ కాస్త పొగరుగా ప్రవర్తించారని, ట్విటర్ సీఈవో పరాగ్ అగర్వాల్‌నూ కించపరిచారని వార్తలు వచ్చాయి. అదే కాకుండా ఉద్యోగులతోనూ చాలా రూడ్‌గా ఉంటున్నారని అందుకే వాళ్లు ఇలా లెటర్స్ రూపంలో తమ అసహనాన్ని బయట పెడుతున్నారనీ అంటున్నారు. మొత్తానికి ఇన్నాళ్లు ప్రపంచ కుబేరుడి జాబితాలో అగ్రస్థానంలో ఎలన్ మస్క్ పేరు..ఇప్పుడు వివాదాలకు కేరాఫ్ అడ్రెస్‌గా మారే అవకాశం కనిపిస్తోంది. అయితే ఎవరో కొందరు ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నంత మాత్రాన కంపెనీపై బురద జల్లటంసరి కాదని స్పేస్‌ఎక్స్ ప్రతినిధులు అంటున్నారు.