అన్వేషించండి

Water Crisis: త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో నీటి కరవు, బెంగళూరు కన్నా దారుణ పరిస్థితులు తప్పవా?

Water Crisis: త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో నీటి కరవు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని సెంట్రల్ వాటర్ కమిషన్ రిపోర్ట్ వెల్లడించింది.

Water Crisis in Southern States: బెంగళూరులో నీటి కొరత ఏ స్థాయిలో ఉందో చూస్తూనే ఉన్నాం. ఇప్పటికీ ఇంకా నగరం ఈ సమస్య నుంచి బయటపడలేదు. వర్షాకాలం వరకూ ఈ తిప్పలు తప్పేలా కనిపించడం లేదు. వేసవి వచ్చిందంటే మరి కొన్ని సిటీల్లోనూ ఇదే ఇబ్బంది. ఈ క్రమంలోనే ఓ రిపోర్ట్‌ సంచలన విషయం వెల్లడించింది. దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడులోని రిజర్వాయర్‌లలో నీటి నిల్వ సామర్థ్యం క్రమంగా తగ్గుతోందని Central Water Commission (CWC) స్పష్టం చేసింది. ఈ రాష్ట్రాల్లోని రిజర్వాయర్‌ కెపాసిటీతో పోల్చుకుంటే కేవలం 17% మాత్రమే నీటి నిల్వ ఉందని వెల్లడించింది. ఈ మేరకు CWC ఓ బులిటెన్ విడుదల చేసింది. ఈ ప్రాంతాల్లోని పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసింది. మొత్తం 42 రిజర్వాయర్‌లలో 53.334 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటి నిల్వ సామర్థ్యం ఉందని వివరించింది. కానీ..ఇప్పుడు ఈ మొత్తంలో కేవలం 17% మాత్రమే నిల్వ ఉందని స్పష్టం చేసింది. గతేడాది ఇదే సమయంలో పరిశీలించగా అప్పుడు నీటి నిల్వలు 29% వరకూ ఉన్నాయి. కానీ ఈ సారి అది దారుణంగా పడిపోయింది. దీనిపైనే CWC హెచ్చరికలు చేసింది. దాదాపు పదేళ్లుగా సగటున 23%గా ఉంటున్న ఈ నీటి నిల్వలు ఈ స్థాయిలో పడిపోవడం సాధారణ విషయం కాదని అంటోంది. రానురాను ఈ దక్షిణాది రాష్ట్రాల్లో నీటి కొరత ఎదురయ్యే ముప్పు ఉందని వెల్లడించింది. సాగు, తాగు నీటికీ ఇబ్బంది కలగొచ్చని అంచనా వేస్తోంది. 

ఆ రాష్ట్రాల్లో మెరుగు..

ఇక హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్‌కీ అంతరాయం కలిగే అవకాశముందని సెంట్రల్ వాటర్ కమిషన్ అభిప్రాయపడుతోంది. అటు అసోం, ఒడిశా, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. అక్కడి రిజర్వాయర్‌లలో నీటి నిల్వలు క్రమంగా పెరుగుతున్నాయి. గతేడాదితో పోల్చి చూస్తే ఈ సారి నిల్వలు  మరింత పెరిగాయి. ఈ రాష్ట్రాల్లో మొత్తం 23 రిజర్వాయర్‌లను పరిశీలించింది.  20.430 BCM కెపాసిటీ ఉన్న ఈ రిజర్వాయర్‌లలో ప్రస్తుతానికి 7.889 BCM మేర నీటి నిల్వలున్నాయని వెల్లడించింది. గుజరాత్, మహారాష్ట్రలోనూ గతేడాదితో పోల్చుుకుంటే నీటి నిల్వలు తగ్గిపోతున్నాయని వివరించింది. ఉత్తరాది రాష్ట్రాల్లోనూ పరిస్థితులు కాస్త ఆందోళనకరంగానే ఉన్నాయని సెంట్రల్ వాటర్ కమిషన్ వెల్లడించింది. ఇక బ్రహ్మపుత్ర,నర్మదా నదీ పరీవాహక ప్రాంతాల్లో నీటి నిల్వలు సంతృప్తికరంగా ఉన్నాయని స్పష్టం చేసింది. 

బెంగళూరులో కటకట

బెంగళూరులో వాటర్ ట్యాంకర్స్‌తో నీళ్లు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. స్నానాలు కూడా చేయడానికి నీళ్లు లేక అలాగే ఉండిపోతున్నారు నగర ప్రజలు. ఇంకొందరు షాపింగ్ మాల్స్‌లోకి వెళ్లి స్నానాలు కానిస్తున్నారు. ఇంత కన్నా దారుణమైన రోజుల్ని బహుశా ఇక చూడమేమో అని వాపోతున్నారు. వాటర్ ట్యాంకర్‌ ఓనర్లు నిలువునా దోచుకుంటున్నారు. నీళ్లు సరఫరా చేసేందుకు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం ఆంక్షలు విధించినా కొన్ని చోట్ల ఈ దోపిడీ కొనసాగుతూనే ఉంది. 

 Also Read: Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ అలజడి, CRPF సిబ్బందిపై మిలిటెంట్‌ల దాడి - ఇద్దరు సైనికులు మృతి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Road Show: కేటీఅర్‌పై టమాటాలు, ఆలుగడ్డలతో దాడి, బీఆర్ఎస్ రోడ్‌ షోలో ఉద్రిక్తత!
కేటీఅర్‌పై టమాటాలు, ఆలుగడ్డలతో దాడి, బీఆర్ఎస్ రోడ్‌ షోలో ఉద్రిక్తత!
Chiranjeevi: పద్మ విభూషణ్‌ అందుకున్న మెగాస్టార్‌ చిరంజీవి - వీడియో వైరల్‌
పద్మ విభూషణ్‌ అందుకున్న మెగాస్టార్‌ చిరంజీవి - వీడియో వైరల్‌
Aavesham movie OTT: సడెన్‌గా ఓటీటీకి వచ్చేసిన ఫహాద్‌ ఫాజిల్‌ 'ఆవేశం'- స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!
సడెన్‌గా ఓటీటీకి వచ్చేసిన ఫహాద్‌ ఫాజిల్‌ 'ఆవేశం'- స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!
KTR: రాహుల్ గారు భ్రమలో ఉన్నారా? డ్రామా ఆడుతున్నారా? కేటీఆర్ ఫైర్
రాహుల్ గారు భ్రమలో ఉన్నారా? డ్రామా ఆడుతున్నారా? కేటీఆర్ ఫైర్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Padma Sri KS Rajanna | చేతులు, కాళ్లు సరిగ్గా లేకున్నా పద్మ శ్రీ వరించింది. ఇంతకు ఎవరీయనా..? | ABPProducer  A. M. Rathnam on Pawan Kalyan | OG , హరిహర వీరమల్లులో ఏది ముందు వస్తుంది..? | ABP DesamMP Navneet Kaur on Owaisi Brothers | ఒవైసీ బ్రదర్స్ ఆట కట్టించడానికి 15 సెకన్లు చాలంటున్ననవనీత్ కౌర్Kishan Reddy | Secunderabad MP Candidate | కాంగ్రెస్ గుర్తు గాడిద గుడ్డుగా మార్చబోతున్నారు| ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Road Show: కేటీఅర్‌పై టమాటాలు, ఆలుగడ్డలతో దాడి, బీఆర్ఎస్ రోడ్‌ షోలో ఉద్రిక్తత!
కేటీఅర్‌పై టమాటాలు, ఆలుగడ్డలతో దాడి, బీఆర్ఎస్ రోడ్‌ షోలో ఉద్రిక్తత!
Chiranjeevi: పద్మ విభూషణ్‌ అందుకున్న మెగాస్టార్‌ చిరంజీవి - వీడియో వైరల్‌
పద్మ విభూషణ్‌ అందుకున్న మెగాస్టార్‌ చిరంజీవి - వీడియో వైరల్‌
Aavesham movie OTT: సడెన్‌గా ఓటీటీకి వచ్చేసిన ఫహాద్‌ ఫాజిల్‌ 'ఆవేశం'- స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!
సడెన్‌గా ఓటీటీకి వచ్చేసిన ఫహాద్‌ ఫాజిల్‌ 'ఆవేశం'- స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!
KTR: రాహుల్ గారు భ్రమలో ఉన్నారా? డ్రామా ఆడుతున్నారా? కేటీఆర్ ఫైర్
రాహుల్ గారు భ్రమలో ఉన్నారా? డ్రామా ఆడుతున్నారా? కేటీఆర్ ఫైర్
Kishan Reddy: రేపే ఎల్బీ స్టేడియంలో బీజేపీ భారీ సభ, మోదీ ఎన్నికల సందేశం - కిషన్ రెడ్డి
రేపే ఎల్బీ స్టేడియంలో బీజేపీ భారీ సభ, మోదీ ఎన్నికల సందేశం - కిషన్ రెడ్డి
Special Trains: ఓటు వేయడానికి వెళ్తున్నారా? టికెట్లు దొరకట్లేదా? ఈ స్పెషల్ ట్రైన్‌లో ట్రై చేయండి!
ఓటు వేయడానికి వెళ్తున్నారా? టికెట్లు దొరకట్లేదా? ఈ స్పెషల్ ట్రైన్‌లో ట్రై చేయండి!
Chandrababu Biopic : యూట్యూబ్‌లో దూసుకుపోతున్న చంద్రబాబు బయోపిక్ 'తెలుగోడు'
యూట్యూబ్‌లో దూసుకుపోతున్న చంద్రబాబు బయోపిక్ 'తెలుగోడు'
CM Jagan: లండన్ పర్యటనకు వెళ్లేందుకు సీఎం జగన్ పిటిషన్ - అనుమతి ఇవ్వొద్దంటూ సీబీఐ కౌంటర్, తీర్పు వాయిదా
లండన్ పర్యటనకు వెళ్లేందుకు సీఎం జగన్ పిటిషన్ - అనుమతి ఇవ్వొద్దంటూ సీబీఐ కౌంటర్, తీర్పు వాయిదా
Embed widget