అన్వేషించండి

Sonali Phogat Murder Case: CBI చేతికి సోనాలీ ఫోగాట్ హత్య కేసు- గోవా సీఎం కీలక నిర్ణయం

Sonali Phogat Murder Case: భాజపా నేత సోనాలీ ఫోగాట్ హత్య కేసును సీబీఐకు అప్పగిస్తున్నట్లు గోవా సీఎం తెలిపారు.

Sonali Phogat Murder Case: హరియాణాకు చెందిన టిక్‌టాక్ స్టార్, భాజపా నేత సోనాలీ ఫోగాట్ హత్య కేసును సీబీఐకు అప్పగిస్తూ గోవా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంచలనం సృష్టించిన ఈ కేసును తీవ్ర ఒత్తిళ్ల నడుమ సీబీఐ దర్యాప్తునకు అప్పగించాలని నిర్ణయించినట్లు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ సోమవారం ప్రకటించారు. 

" మా పోలీసులపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. కానీ, ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి, సోనాలీ ఫోగాట్‌ కుటుంబ సభ్యుల డిమాండ్‌ మేరకు ఈ కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయించాం. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు విజ్ఞప్తి లేఖ రాశాను.                                                   "
- ప్రమోద్ సావంత్, గోవా సీఎం

ఇదీ జరిగింది

ఈ ఏడాది ఆగస్టు చివరి వారంలో గోవా పర్యటనకు వెళ్లిన సోనాలీ ఫోగాట్‌ అనుమానాస్పద రీతిలో మరణించారు. ఆమె మొదట గుండెపోటుతో మరణించినట్లు వార్తలు వచ్చాయి. అయితే పోస్టుమార్టం నివేదికలో మాత్రం ఆమె శరీరంపై పలు చోట్ల గాయాలు ఉన్నట్టు తేలింది. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు.

ఉత్తర గోవాలో ఆమె బస చేసిన క్లబ్‌లో జరిగిన పార్టీలో సోనాలీ తాగే డ్రింక్‌లో హానికరమైన పదార్థాలు కలిపారని దర్యాప్తులో తేలింది. అదే ఆమె మరణానికి దారితీసిందని గోవా పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో సోనాలీ సహాయకులైన సుధీర్‌ సంగ్వాన్‌, సుఖ్వీందర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 

సీసీటీవీ ఫుటేజీలు

ఫోగాట్​ హత్య కేసులో మరో రెండు సీసీటీవీ దృశ్యాలు బయటపడ్డాయి. ఈ రెండు వీడియోలు ఆమె చనిపోయే రోజు బసచేసిన హొటల్‌లోనివేనని పోలీసులు తెలిపారు​. ఓ వీడియోలో సుధీర్​ సంగ్వాన్​, సుఖ్​విందర్​.. సోనాలీకి బలవంతంగా డ్రింక్ తాగిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఆ వీడియోలో ఆ ఇద్దరు వ్యక్తులు కలిసి సోనాలీకి ఏవో తాగిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. 

మరో వీడియోలో సుధీర్​ సంగ్వాన్​, సుఖ్​విందర్ ఆమెను బయటకు తీసుకెళ్తున్నారు. మెట్లు ఎక్కేటప్పుడు ఆమె పడిపోయేది.. అయినా ఆగకుండా తీసుకెళ్లారు. అయితే డ్రింక్​ తాగే వరకు సోనాలీ మామూలుగానే డ్యాన్స్ చేశారు. డ్రింక్ తాగించిన తర్వాత ఆమె పడిపోయారు.

మాజీ టిక్‌టాక్‌ స్టార్‌గా, 'బిగ్‌బాస్‌' టీవీ రియాలిటీ షో ద్వారా ఫోగాట్‌కు పేరొచ్చింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో హరియాణాలోని ఆదంపుర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థిగా ఆమె పోటీచేశారు. అయితే ఆ ఎన్నికలో ఆమె ఓడిపోయారు. ఆమె భర్త కొన్నేళ్ల కిందటే మృతి చెందారు. వారికి ఒక కుమార్తె ఉంది.

Also Read: Gyanvapi Masjid Verdict: జ్ఞానవాపి మసీదు కేసులో కోర్టు సంచలన తీర్పు

Also Read: NIA Raids: దేశంలోని 60 ప్రాంతాల్లో NIA మెరుపు దాడులు- గ్యాంగ్‌స్టర్లే లక్ష్యంగా!

టాప్ హెడ్ లైన్స్

Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
Milei Cabala Magic: వరల్డ్ కప్ ఫైనల్ కు వెళ్లనని అర్జెంటీనా ప్రెసిడెంట్ షాకింగ్ అనౌన్స్ మెంట్, ఆ మూఢ న‌మ్మ‌కాల కార‌ణంగానే ఈ నిర్ణ‌యం!
వరల్డ్ కప్ ఫైనల్ కు వెళ్లనని అర్జెంటీనా ప్రెసిడెంట్ షాకింగ్ అనౌన్స్ మెంట్, ఆ మూఢ న‌మ్మ‌కాల కార‌ణంగానే ఈ నిర్ణ‌యం!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget