Gyanvapi Masjid Verdict: జ్ఞానవాపి మసీదు కేసులో కోర్టు సంచలన తీర్పు
Gyanvapi Masjid Verdict: దేశావ్యాప్తంగా చర్చనీయాంశమైన జ్ఞానవాపి మసీదు కేసులో వారణాసి జిల్లా కోర్టు కీలక ఆదేశాలిచ్చింది.
![Gyanvapi Masjid Verdict: జ్ఞానవాపి మసీదు కేసులో కోర్టు సంచలన తీర్పు Gyanvapi Masjid Case Varanasi Court Verdict Highlights Court Holds Civil Suits Challenging Title Of Mosque Maintainable Gyanvapi Masjid Verdict: జ్ఞానవాపి మసీదు కేసులో కోర్టు సంచలన తీర్పు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/12/e1b23194f6b389a2b6324f182b0cb4d91662960362787218_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Gyanvapi Masjid Verdict: ఉత్తర్‌ప్రదేశ్ జ్ఞానవాపి మసీదు కేసులో వారణాసి జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మసీదు ప్రాంగణంలో హిందువులు ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతించాలన్న పిటిషన్‌పై సానుకూలంగా స్పందించింది.
ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. తదుపరి వాదనలు సెప్టెంబర్ 22న విననున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా ముస్లిం పక్షాలు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.
కోలాహలం
తీర్పు అనంతరం కోర్టు బయట కోలాహలం నెలకొంది. హిందువులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పాటలు పాడుతూ, డ్యాన్స్ చేశారు.
#WATCH | Varanasi, UP: "Bharat is happy today, my Hindu brothers & sisters should light diyas to celebrate," says petitioner from Hindu side Manju Vyas as she dances & celebrates the Gyanvapi Shringar Gauri verdict pic.twitter.com/hO7frpErNF
— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 12, 2022
భారీ భద్రత
అత్యంత సున్నితమైన కేసు కావడంతో వారణాసిలో ఇప్పటికే 144 సెక్షన్ విధించారు. పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. సోమవారం కావడంతో కాశీ విశ్వనాథ్ ఆలయం వద్ద భద్రతను భారీగా పెంచారు.
ఇదీ కేసు
జ్ఞాన్వాపి మసీదు వెలుపలి గోడపై ఉన్న హిందూ దేవతామూర్తులకు పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఐదుగురు మహిళలు వారణాసి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన వారణాసి సివిల్ జడ్జి కోర్టు అక్కడ వీడియోగ్రఫీ సర్వేకు ఆదేశాలిచ్చారు.
సర్వేలో
దీంతో జ్ఞాన్వాపి మసీదు- శృంగార్ గౌరీ ప్రాంగణంలో వీడియోగ్రఫీ సర్వే చేశారు. ప్రార్థన స్థలంలోని భూగర్భ నేలమాళిగలు, చెరువు, మూడు గోపురాలను సర్వే బృందం వీడియో తీసింది. అయితే మసీదులోని కొలనులో శివలింగం కనిపించినట్లు పిటిషనర్ల తరపు న్యాయవాది తెలిపారు. ఈ సర్వే నివేదికను అడ్వకేట్ కమిషనర్ కోర్టులో సమర్పించారు. అయితే అది శివలింగం కాదంటూ మసీద్ కమిటీ వాదిస్తోంది.
సుప్రీం కోర్టుకు
ఈ వ్యవహారం తర్వాత సుప్రీం కోర్టుకు చేరింది. అయితే జ్ఞానవాపి మసీదు వివాదం కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసును సివిల్ కోర్టు నుంచి వారణాసి జిల్లా కోర్టుకు బదిలీ చేసింది. ఈ కేసును ఉత్తర్‌ప్రదేశ్ జుడీషియల్ సర్వీసులో ఉన్న అత్యంత సీనియర్, అనుభవమున్న న్యాయమూర్తి విచారిస్తారని సుప్రీం కోర్టు పేర్కొంది.
ఈ సర్వేలో కనిపించిన శివలింగం తదితర దేవతలను పూజించే హక్కులను కల్పించాలని హిందూ పక్షం దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా విచారణ జరపాలని జిల్లా జడ్జిని ఆదేశించింది.
Also Read: NIA Raids: దేశంలోని 60 ప్రాంతాల్లో NIA మెరుపు దాడులు- గ్యాంగ్‌స్టర్లే లక్ష్యంగా!
Also Read: Bengaluru: శభాష్ డాక్టర్ సాబ్! సర్జరీ చేయడానికి ఆసుపత్రికి 3 కిమీ పరుగు!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)