News
News
X

Shraddha Murder Case: శ్రద్ధా హత్య కేసులో కీలక అప్‌డేట్- అఫ్తాబ్‌కు నార్కో పరీక్షలు

Shraddha Murder Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాల్కర్ హత్య కేసు నిందితుడు అఫ్తాబ్‌కు నార్కో పరీక్షలు నిర్వహించనున్నారు దిల్లీ పోలీసులు.

FOLLOW US: 
 
Shraddha Murder Case: సహజీవనం చేస్తోన్న ప్రియురాలు శ్రద్ధాను ఘోరంగా హత్య చేసిన కేసులో నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలాకు దిల్లీ పోలీసులు నార్కో పరీక్షలు చేయనున్నారు. అఫ్తాబ్ పూనావాలాకు నార్కో టెస్టు నిర్వహించాలన్న పోలీసుల అభ్యర్థనను దిల్లీ కోర్టు అనుమతించింది.

అఫ్తాబ్ చెప్పేదాంట్లో ఎంత నిజం ఉందో తెలుసుకునేందుకు అత‌నికి ఈ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. విచార‌ణ స‌మ‌యంలో హంత‌కుడు త‌ప్పుడు స‌మాచారం ఇస్తున్న‌ట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో విచార‌ణ‌ను లోతుగా చేసేందుకు పోలీసులు నార్కో ప‌రీక్ష‌లు చేప‌ట్ట‌నున్నారు.

మానసిక స్థితి

నార్కో పరీక్షల ద్వారా నిందితుడి మాన‌సిక స్థితి ఎలా ఉందో పోలీసులు తేల్చ‌నున్నారు. ఒక‌వేళ అఫ్తాబ్ మాన‌సికంగా స‌రిగా లేకుంటే అప్పుడు ఏం చేయాలో కూడా పోలీసులు ఓ నిర్ణ‌యాన్ని తీసుకోనున్నారు. శ్ర‌ద్ధా ఫోన్‌ను అఫ్తాబ్ ఏం చేశాడు, ఆమెను ముక్క‌లుగా న‌రికేందుకు వాడిన క‌త్తి ఎక్క‌డ ఉందో తెలుసుకునేందుకు పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నారు.

News Reels

ఇదీ కేసు

అఫ్తాబ్, శ్రద్ధ.. ముంబయిలోని ఓ కాల్ సెంటర్‌లో పనిచేశారు. అక్కడ వారు మొదట కలుసుకున్నారు. తరువాత డేటింగ్ ప్రారంభించారు. ఆమె కుటుంబం వారి సంబంధాన్ని ఆమోదించకపోవడంతో ఈ జంట దిల్లీకి పారిపోయి లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో జీవిస్తున్నారు.అయితే శ్రద్ధా తల్లిదండ్రులు మాత్రం.. ఆమె సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా తమ కుమార్తె యోగక్షేమాలను తెలుసుకుంటున్నారు.

కానీ చాలా కాలంగా ఆమె సోషల్ మీడియా ఖాతాలో ఎటువంటి అప్‌డేట్ రాకపోవడంతో శ్రద్ధ తండ్రి దిల్లీకి వచ్చారు. తన కూతురు వివరాలు తెలియకపోవడంతో ఆమె తండ్రి దిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అఫ్తాబ్‌పై అనుమానం

తన కుమార్తె ముంబయిలోని కాల్ సెంటర్‌లో పనిచేసేదని, అక్కడ అఫ్తాబ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడిందని, వారి స్నేహం సన్నిహితంగా మారిందని శ్రద్ధ తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడటం ప్రారంభించారని, అయితే కుటుంబం దానిని అంగీకరించలేదని శ్రద్ధా తండ్రి ఆరోపించారు. దీంతో అతని కూతురు, అఫ్తాబ్ ముంబయి వదిలి దిల్లీకి వచ్చి ఇక్కడి ఛతర్‌పుర్ ప్రాంతంలో ఉంటున్నట్లు తెలిపారు. ఆయన ఫిర్యాదు మేరకు దిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిఘా ద్వారా అఫ్తాబ్‌ను పట్టుకున్నారు.

అఫ్తాబ్‌ను ప్రశ్నించగా, అమ్మాయి తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తోందని, దీని వల్ల వారి మధ్య తరచూ గొడవలు జరగినట్లు తెలిపాడు. మే నెలలో శ్రద్ధాను దారుణంగా చంపి, ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి.. నగరంలోని పలు ప్రాంతాల్లో పారేసినట్లు ఒప్పుకున్నాడు.

దర్యాప్తులో

అఫ్తాబ్ అమీన్ పూనావాలా (Aftab) గురించి రోజుకో సంచలన విషయం బయటపడుతోంది. 28 ఏళ్ల యువకుడు ఇంత కిరాతకంగా హత్య చేసి, దీని నుంచి తప్పించుకునేందుకు చేసిన పనులు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. అయితే ఆ యువకుడు 'డెక్స్‌టర్' (Web Series Dexter) అనే డ్రామా వెబ్ సిరీస్ ద్వారా 'స్పూర్తి' పొందాడని దర్యాప్తులో తేలింది. 

Also Read: Shraddha Walkar Murder Case: వెబ్‌ సిరీస్ చూసి ఆధారాలు మాయం చేసిన అఫ్తాబ్- మామూలోడు కాదు!

Published at : 16 Nov 2022 04:30 PM (IST) Tags: Shraddha Murder Delhi Police To Conduct Narco Analysis Aftab

సంబంధిత కథనాలు

Gold-Silver Price 03 December 2022: పోటీలు పడి మరీ షాకులిస్తున్న పసిడి, వెండి - ఒక్కసారే భారీగా పెరిగాయిగా!

Gold-Silver Price 03 December 2022: పోటీలు పడి మరీ షాకులిస్తున్న పసిడి, వెండి - ఒక్కసారే భారీగా పెరిగాయిగా!

AP Inter Exam Fee: ఇంటర్‌ సెకండియర్ పరీక్ష ఫీజు చెల్లించేందుకు 19 వరకు అవకాశం! ఆలస్య రుసుముతో ఎప్పటివరకంటే?

AP Inter Exam Fee: ఇంటర్‌ సెకండియర్ పరీక్ష ఫీజు చెల్లించేందుకు 19 వరకు అవకాశం! ఆలస్య రుసుముతో ఎప్పటివరకంటే?

Mlc Kavitha CBI Notices : ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు, దిల్లీ లిక్కర్ లెక్కలపై విచారణ!

Mlc Kavitha CBI Notices : ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు, దిల్లీ లిక్కర్ లెక్కలపై విచారణ!

Breaking News Live Telugu Updates: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు!

Breaking News Live Telugu Updates: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు!

Dress Code : వైద్య విద్యార్థులు డ్రస్ కోడ్, జీన్స్ ఫ్యాంట్ టీ షర్టులు ధరించొద్దని ఆదేశాలు!

Dress Code : వైద్య విద్యార్థులు డ్రస్ కోడ్, జీన్స్ ఫ్యాంట్ టీ షర్టులు ధరించొద్దని ఆదేశాలు!

టాప్ స్టోరీస్

TS Govt : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం, దివ్యాంగుల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ

TS Govt :  తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం, దివ్యాంగుల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ

NRI Hospital Godava : ఎన్నారై ఆస్పత్రి డైరక్టర్ల మధ్య గొడవలే కొంప ముంచాయా ? ఈడీ, ఐటీ దాడుల వెనుక అసలేం జరిగింది ?

NRI Hospital Godava : ఎన్నారై ఆస్పత్రి డైరక్టర్ల మధ్య గొడవలే కొంప ముంచాయా ? ఈడీ, ఐటీ దాడుల వెనుక అసలేం జరిగింది ?

Impact Player: ఐపీఎల్‌లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్ - ఒక ఆటగాడిని అదనంగా!

Impact Player: ఐపీఎల్‌లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్ - ఒక ఆటగాడిని అదనంగా!

Monster Movie Review : హానీ రోజ్‌తో లక్ష్మీ మంచు లిప్ లాక్, మోహన్‌లాల్‌తో ఫైట్ - 'మాన్‌స్టర్' ఎలా ఉందంటే?

Monster Movie Review : హానీ రోజ్‌తో లక్ష్మీ మంచు లిప్ లాక్, మోహన్‌లాల్‌తో ఫైట్ - 'మాన్‌స్టర్' ఎలా ఉందంటే?