అన్వేషించండి

Shraddha Walkar Murder Case: వెబ్‌ సిరీస్ చూసి ఆధారాలు మాయం చేసిన అఫ్తాబ్- మామూలోడు కాదు!

Shraddha Walkar Murder Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా హత్య కేసులో నిందితుడైన అఫ్తాబ్.. ఓ వెబ్ సిరీస్ చూసి ఆనవాళ్లను మాయం చేసేందుకు ప్రయత్నించినట్లు తేలింది.

Shraddha Walkar Murder Case: దిల్లీలో తనతో సహజీవనం చేసిన యువతిని హత్య చేసి, ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా నరికిన అఫ్తాబ్ అమీన్ పూనావాలా (Aftab) గురించి రోజుకో సంచలన విషయం బయటపడుతోంది. 28 ఏళ్ల యువకుడు ఇంత కిరాతకంగా హత్య చేసి, దీని నుంచి తప్పించుకునేందుకు చేసిన పనులు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. అయితే ఆ యువకుడు 'డెక్స్‌టర్' (Web Series Dexter) అనే డ్రామా వెబ్ సిరీస్ ద్వారా 'స్పూర్తి' పొందాడని దర్యాప్తులో తేలింది. 

మామూలోడు కాదు!

డెక్స్‌టర్ అనేది సీరియల్ కిల్లింగ్స్‌కు సంబంధించిన ఓ క్రైమ్ సిరీస్. ఇందులో వ్యక్తి పోలీసులకు ఫోరెన్సిక్ టెక్నీషియన్‌గా పని చేస్తాడు. కానీ ఖాళీ సమయంలో క్రూరమైన నేరస్థులను చంపుతూ ఉంటాడు. ఈ సిరీస్ చూసిన అఫ్తాబ్.. ఇందులో చూపించినట్లుగా ఆధారాలను మాయం చేసేందుకు ప్రయత్నించినట్లు తేలింది.

కాల్ సెంటర్‌లో చేరడానికి ముందు అఫ్తాబ్ చెఫ్‌గా పని చేసినట్లు సమాచారం. కాబట్టి శరీరాన్ని కత్తి సాయంతో ఎలా కట్ చేయాలో అఫ్తాబ్‌కు బాగా తెలుసు. అఫ్తాబ్ ఒక రిఫ్రిజిరేటర్‌ని తీసుకువచ్చాడని, అందులోనే శ్రద్ధా శరీర భాగాలను 18 రోజుల పాటు దాచినట్లు అధికారులు తెలిపారు.

ఇలా మొదలు

అఫ్తాబ్, శ్రద్ధ.. ముంబయిలోని ఓ కాల్ సెంటర్‌లో పనిచేశారు. అక్కడ వారు మొదట కలుసుకున్నారు. తరువాత డేటింగ్ ప్రారంభించారు. ఆమె కుటుంబం వారి సంబంధాన్ని ఆమోదించకపోవడంతో ఈ జంట దిల్లీకి పారిపోయి లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో జీవిస్తున్నారు.

అయితే శ్రద్ధా తల్లిదండ్రులు మాత్రం.. ఆమె సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా తమ కుమార్తె యోగక్షేమాలను తెలుసుకుంటున్నారు. కానీ చాలా కాలంగా ఆమె సోషల్ మీడియా ఖాతాలో ఎటువంటి అప్‌డేట్ రాకపోవడంతో శ్రద్ధ తండ్రి దిల్లీకి వచ్చారు. తన కూతురు వివరాలు తెలియకపోవడంతో ఆమె తండ్రి దిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అఫ్తాబ్‌పై అనుమానం

తన కుమార్తె ముంబయిలోని కాల్ సెంటర్‌లో పనిచేసేదని, అక్కడ అఫ్తాబ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడిందని, వారి స్నేహం సన్నిహితంగా మారిందని శ్రద్ధ తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడటం ప్రారంభించారని, అయితే కుటుంబం దానిని అంగీకరించలేదని శ్రద్ధా తండ్రి ఆరోపించారు. దీంతో అతని కూతురు, అఫ్తాబ్ ముంబయి వదిలి దిల్లీకి వచ్చి ఇక్కడి ఛతర్‌పుర్ ప్రాంతంలో ఉంటున్నట్లు తెలిపారు. ఆయన ఫిర్యాదు మేరకు దిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిఘా ద్వారా అఫ్తాబ్‌ను పట్టుకున్నారు.

అఫ్తాబ్‌ను ప్రశ్నించగా, అమ్మాయి తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తోందని, దీని వల్ల వారి మధ్య తరచూ గొడవలు జరగినట్లు తెలిపాడు. మే నెలలో శ్రద్ధాను దారుణంగా చంపి, ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి.. నగరంలోని పలు ప్రాంతాల్లో పారేసినట్లు ఒప్పుకున్నాడు.

Also Read: Shraddha Walker Murder Case: శ్రద్ధా కేసు అప్‌డేట్- ఆమె శరీర భాగాలు ఫ్రిడ్జ్‌లో ఉండగానే మరో అమ్మాయితో!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Babu Attacks Journalist: మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
Mohan babu Hospital : బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
Mohanbabu Gun:  గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
Nagababu: నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mohan babu Audio on Manchu Manoj | నా గుండెల మీద తన్నావ్ రా మనోజ్ | ABP DesamMohan babu Attack Media | మీడియా ప్రతినిధిని దారుణంగా కొట్టిన మోహన్ బాబు | ABP DesamManchu Mohan babu Attack | కొడుకును, మీడియాను తరిమి కొట్టిన మోహన్ బాబు | ABP Desamముంబయిలో బస్ బీభత్సం, ఏడుగురు మృతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Babu Attacks Journalist: మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
Mohan babu Hospital : బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
Mohanbabu Gun:  గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
Nagababu: నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
Sana Sathish: చానా చరిత్ర ఉండాది సామీ... ! టీడీపీ రాజ్యసభ క్యాండిడేట్ మామూలోడు కాదు..
చానా చరిత్ర ఉండాది సామీ... ! టీడీపీ రాజ్యసభ క్యాండిడేట్ మామూలోడు కాదు..
Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
RCB News: డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
Gautham Krishna - Bigg Boss Telugu: సోలో బాయ్ గౌతమే విన్నర్ అంటోన్న సోషల్ మీడియా - అతనిలో ప్లస్, మైనస్‌లు ఏంటి?
సోలో బాయ్ గౌతమే విన్నర్ అంటోన్న సోషల్ మీడియా - అతనిలో ప్లస్, మైనస్‌లు ఏంటి?
Embed widget