అన్వేషించండి

Shraddha Walker Murder Case: శ్రద్ధా కేసు అప్‌డేట్- ఆమె శరీర భాగాలు ఫ్రిడ్జ్‌లో ఉండగానే మరో అమ్మాయితో!

Shraddha Walker Murder Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా హత్యలో షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి.

Shraddha Walker Murder Case: సంచలనం సృష్టించిన శ్రద్ధా వాల్కర్‌ (26) (Shraddha Walker) హత్య కేసులో (Shraddha Murder case) షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. సహజీవనం చేస్తోన్న ప్రియురాలు శ్రద్ధాను అఫ్తాబ్ అమీన్ పూనావాలా (28) (Aftab) అత్యంత క్రూరంగా చంపేశాడు. లవర్‌ను 35 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌లో దాచి.. ఆ తర్వాత ఆమె శరీర భాగాలను దిల్లీలోని (Delhi) పలు ప్రదేశాల్లో అఫ్తాబ్ పడేశాడు. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసే కొద్దీ షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. 

మరో అమ్మాయితో

శ్ర‌ద్ధాను చంపి ఆమె శ‌రీర భాగాల‌ను ఫ్రిడ్జ్‌లో దాచి పెట్టిన స‌మ‌యంలోనే.. త‌న రూమ్‌కు మ‌రో యువతిని అఫ్తాబ్ తీసుకువ‌చ్చిన‌ట్లు పోలీసులు తెలిపారు. అఫ్తాబ్‌, శ్ర‌ధ్దాలు బంబ్లీ డేటింగ్ యాప్ ద్వారా ప‌రిచ‌యమయ్యారు. శ్ర‌ద్ధాను చంపిన 20 రోజుల వ్య‌వ‌ధిలోనే అదే డేటింగ్ యాప్‌లో మ‌రో అమ్మాయిని అఫ్తాబ్ ప‌రిచయం చేసుకున్నాడు. ఆమెతోనూ డేటింగ్ మొద‌లుపెట్టాడు.

ఆ అమ్మాయిని కూడా ప‌దేప‌దే ఇంటికి తీసుకువ‌చ్చాడు. ఆ స‌మ‌యంలో అఫ్తాబ్‌ రూమ్‌లోనే శ్ర‌ద్ధ శ‌రీర భాగాలు ఉన్న‌ట్లు పోలీసులు పేర్కొన్నారు. 300 లీట‌ర్ల ఫ్రిడ్జ్‌లో శ్రద్ధా శ‌రీర భాగాల‌ను అఫ్తాబ్ దాచాడు. అయితే కొత్త గ‌ర్ల్‌ఫ్రెండ్‌ను ఇంటికి తీసుకువ‌చ్చిన స‌మ‌యంలో ఆ ముక్క‌ల‌ను క‌ప్‌బోర్డ్‌లోకి మార్చేవాడని పోలీసులు తెలిపారు.

మరకలు

శ్రద్ధాను హత్య చేసిన తర్వాత చెఫ్ అయిన అఫ్తాబ్‌.. ర‌క్త‌పు మ‌ర‌క‌ల‌ను ఎలా క్లీన్ చేయాలి, మాన‌వ శ‌రీర నిర్మాణం గురించి గూగుల్‌లో సెర్చ్ చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. అయితే అత‌ను వాడిన క‌త్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. శ్ర‌ద్ధా స‌జీవంగా ఉంద‌ని తెలిసేందుకు ఆమెకు చెందిన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను అఫ్తాబ్ వాడాడు. ఆ అకౌంట్ ద్వారా శ్ర‌ద్ధా ఫ్రెండ్స్‌తో అత‌ను ట‌చ్‌లో ఉన్నాడు. కానీ రెండు నెల‌లుగా ఫోన్ స్విచాఫ్ ఉండ‌డంతో శ్ర‌ద్ధా ఫ్రెండ్స్‌కు అనుమానం వ‌చ్చింది.

ప్రస్తుతం అఫ్తాబ్ ఇంటికి వచ్చిన మరో గర్ల్ ఫ్రెండ్.. వివరాలను కనుగొనడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. అఫ్తాబ్ ప్రొఫైల్ వివరాలను అభ్యర్థిస్తూ డేటింగ్ యాప్ బంబ్లీ లేఖ రాయాలని దిల్లీ పోలీసులు పరిశీలిస్తున్నారు.

Also Read: Delhi Crime News: సహజీవనం చేస్తోన్న యువతిని 35 ముక్కలుగా నరికి- నగరంలో విసిరేశాడు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget