Maharashtra Omicron Outbreak: బీఅలర్ట్.. మహారాష్ట్రలో మరో 7 ఒమిక్రాన్ కేసులు.. 12కు చేరిన సంఖ్య
దేశంలో ఒమిక్రాన్ కేసులు మరింత పెరిగాయి. కొత్తగా మరో 7 కేసులు నమోదయ్యాయి.
దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో మరో 7 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం మహారాష్ట్రలోనే ఒమిక్రాన్ కేసుల సంఖ్య 8కి చేరింది. ఈ మేరకు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Seven more people tested positive for the #Omicron variant of COVID19 in Maharashtra. Total 8 cases of Omicron variant reported in Maharashtra so far: State Public Health Dept
— ANI (@ANI) December 5, 2021
దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 12కు పెరిగింది. కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, దిల్లీలో ఇప్పటివరకు ఈ కేసులు వెలుగుచూశాయి. టాంజానియా నుంచి దిల్లీకి వచ్చిన ఓ వ్యక్తికి ఈ రోజు ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధరణైంది.
వీరిని ఐసోలేషన్‌లో ఉంచారు. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లను వెతికే పనిలో ఉన్నారు అధికారులు. అనుమానితుల శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపారు. ఈ ఫలితాలు ఇంకా రాలేదు.
అయితే ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి అధికంగా ఉంటుందని కానీ దాని వల్ల ఇప్పటివరకు ఎక్కడా మరణాలు సంభవించలేదని నిపుణులు అంటున్నారు.
వ్యాప్తి ఎక్కువ..
ఒమిక్రాన్ వేరియంట్‌పై మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపే కీలక వ్యాఖ్యలు. ఒమ్రికాన్ వ్యాప్తి అధికంగా ఉందని కాదని దాని లక్షణాలు మాత్రం స్వల్పంగా ఉన్నాయన్నారు.
Also Read: Rahul Gandhi on Nagaland Firing: 'కాల్పులు జరిగితే కేంద్ర హోంశాఖ ఏం చేస్తోంది?'
Also Read: Omicron Symptoms: లైట్‌గా జలుబు ఉందా? లైట్ తీసుకోవద్దు.. ఒమిక్రాన్‌కు అదే ప్రధాన లక్షణమట!
Also Read: Sabarimala Rush: ఒమిక్రాన్ భయాల వేళ పోటెత్తిన శబరిమల.. రికార్డ్ స్థాయిలో 42 వేల మందికి దర్శనం
Also Read: Omicron Cases in India: 'ఒమిక్రాన్‌కు వేగం ఎక్కువ.. కానీ లక్షణాలు స్వల్పమే'
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 2,796 మంది మృతి.. దిల్లీలో తొలి ఒమ్రికాన్ కేసు
Also Read: ఇలాంటి పేపర్ ప్లేట్లలో రోజూ భోజనాలు లాగిస్తున్నారా? అయితే ఈ రోగాలు రాక తప్పవు