అన్వేషించండి
Advertisement
16 th August 2024 News Headlines: టాటా గ్రూప్ ఛైర్మన్‌తో చంద్రబాబు సమావేశం, నేడు నింగీలోకి ఎగరనున్న ఈవోఎస్-08 ఉపగ్రహం వంటి మార్నింగ్ టాప్ న్యూస్
16 th August 2024 School News Headlines Today: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తాజా వార్తల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఇది మీ స్కూల్ అసెంబ్లీలో చదవడానికి పనికొస్తాయి.
16 th August 2024 School News Headlines Today:
నేటి ప్రత్యేకత:
- సర్దార్ గౌతు లచ్చన్న జయంతి
- ఆంధ్రప్రదేశ్ ఎనిమిదో ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య జయంతి
- స్వామి రామకృష్ణ పరమహంస వర్థంతి
- మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి జయంతి
ఆంధ్రప్రదేశ్ వార్తలు:
- టాటా గ్రూప్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో సీఎం చంద్రబాబు నేడు సమావేశం కానున్నారు. పెట్టుబడులు ఆకర్షణే లక్ష్యంగా ఈ సమావేశం జరగనుంది. నూతన పారిశ్రామిక విధానం రూపకల్పనపై సీఐఐ డీజీ చంద్రజిత్ బెనర్జీ నేతృత్వంలో ప్రతినిధుల బృందంతోనూ చంద్రబాబు చర్చిస్తారు.
- పోలవరం ప్రాజెక్టుపై అధ్యయనం చేసిన విదేశీ నిపుణుల బృందం ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు చేసింది. డిజైన్ మార్పులతో కొత్త డయాఫ్రం వాల్, ప్రధాన డ్యాం నిర్మించాలని సూచించింది. కాఫర్ డ్యాంలతోనే ముందుకు పోవాలని సూచించింది.
తెలంగాణ న్యూస్ :
- మూడో విడత రైతు రుణమాఫీ నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. నేడు రైతుల ఖాతాల్లో నగదు జమ కానున్నట్లు సీఎం తెలిపారు. ఈ విడతలో రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల రుణమాఫీ కానుంది. దీంతో 14 లక్షల 45వేల మంది రైతులకు లాభం చేకూరనుంది.
- తెలంగాణలో మరో రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని తెలిపింది. వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
జాతీయ వార్తలు :
- భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కాసేపట్లో భూ పరిశీలన ఉపగ్రహం ఈవోఎస్-08ని నింగిలోకి పంపనుంది. శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఈ ఉపగ్రహాన్ని ఎస్ఎస్ఎల్వీ-డీ3 రాకెట్ ద్వారా ప్రయోగించనున్నారు. ఈవోఎస్–08 ఉపగ్రహాన్ని మోసుకెళ్లే SSLV-D3 రాకెట్ ఆగస్టు 16న ఉదయం 9.17 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనుంది.
- కేంద్ర ప్రభుత్వం రైతులకు ఉపయోగపడే మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. చీడపీడల నివారణ సలహాలు, సూచనలు అందించేలా కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, డీపీపీక్యూఎస్, ఐసీఏఆర్ శాస్త్రవేత్తల సహకారంతో నేషనల్ పెస్ట్ సర్వైలెన్స్ సిస్టం యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు.
అంతర్జాతీయ వార్తలు :
- ఆఫ్రికాలోని డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మంకీపాక్స్ విజృంభిస్తోంది. ఈ వైరస్ కారణంగా కాంగోలో ఈ ఏడాదిలో ఇప్పటివరకే దాదాపు 548 మంది మరణించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్‌ను ‘‘ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి’’గా ప్రకటించింది.
- ఇజ్రాయెల్‌పై యుద్ధం విషయంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌పై యుద్ధానికి వెనక్కి తగ్గితే.. దైవాగ్రహం తప్పదని అన్నారు. ప్రతీకారం విషయంలో వెనక్కి తగ్గినా.. రాజీపడినా దైవాగ్రహానికి గురికాక తప్పదని ఇరానీయులను హెచ్చరించారు.
క్రీడలు :
- పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ తరఫున ఆడిన క్రీడాకారుల బృందాన్ని ప్రధాని మోదీ అభినందించారు. ప్రధాని తన నివాసంలో క్రీడాకారులను కలిసి వారితో మాట్లాడారు. ఒలింపిక్స్‌లో వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా షూటర్ మను బాకర్ పతకం సాధించిన తన పిస్టల్‌ను ప్రధానికి చూపించింది.
మంచిమాట
మనకు లభించే చిన్న అవకాశాలే... భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
హైదరాబాద్
అమరావతి
సినిమా రివ్యూ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement