(Source: ECI/ABP News/ABP Majha)
RSS chief Mohan Bhagwat: దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ హిందువులే: ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్
RSS chief Mohan Bhagwat: దేశంలో నివసించే ప్రతి ఒక్కరూ హిందూవులేనని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు.
RSS chief Mohan Bhagwat: ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో నివసించే ప్రతి ఒక్కరూ హిందువులేనని ఆయన అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో సుర్గుజా జిల్లాలోని అంబికాపుర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
All people of India are Hindus irrespective of religion: RSS chief Mohan Bhagwat pic.twitter.com/0K7b46DfVo
— JAMMU LINKS NEWS (@JAMMULINKS) November 16, 2022
గౌరవించాలి
దేశంలో ఇతర మతాలు, విశ్వాసాలు, సంప్రదాయాలను అందరూ గౌరవించాలని భగవత్ పిలుపునిచ్చారు. కరోనా సమయంలో దేశమంతా కలిసి పోరాడిందని గుర్తుచేశారు.
జనాభా విధానంపై
ఇటీవల నాగ్‌పుర్‌లో జరిగిన దసరా ర్యాలీలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొన్నారు. వర్గాల-ఆధారిత జనాభా అసమానత ఓ ప్రధాన అంశమని ఈ సందర్భంగా భగవత్ అన్నారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదన్నారు.
" దేశంలో అన్ని వర్గాల వారికి వర్తించేలా ఓ సమగ్ర 'జనాభా విధానాన్ని' రూపొందించాలి. ఎందుకంటే దేశంలో వివిధ వర్గాల జనాభాలో సమతుల్యత ఉండాల్సిన అవసరం ఉంది. జనాభా అసమానతలు భౌగోళిక సరిహద్దుల్లో మార్పులకు దారి తీస్తాయి. కొన్ని వర్గాల్లో జనాభా సమతుల్యత లేని కారణంగా తూర్పు తైమూర్, కొసావో, దక్షిణ సూడాన్ వంటి కొత్త దేశాలు ఏర్పడ్డాయి. "
Also Read: Gujarat Polls 2022: రెబల్ నేతలను దారిలోకి తెచ్చేందుకు హోం మంత్రి అమిత్ షా కొత్త టెక్నిక్