అన్వేషించండి

Robot Suicide: పని ఒత్తిడితో సూసైడ్ చేసుకున్న రోబో, ఈ ఉద్యోగాలపై మర మనుషులకూ విసుగొచ్చేస్తోందా!

South Korea: సౌత్‌ కొరియాలో ఓ రోబో పని ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రపంచవ్యాప్తంగా అలజడి సృష్టించింది. వర్క్ లోడ్‌ గురించి చర్చ కూడా జరుగుతోంది.

Robot Commits Suicide: రోబోకి ఎమోషన్స్ ఉంటే ఎలా ఉంటుందో శంకర్‌ తన రోబో మూవీలో చూపించేశారు. ఐశ్వర్యా రాయ్‌ని ప్రేమించి చివరకు తనను తయారు చేసిన బాస్‌కే చుక్కలు చూపిస్తుంది చిట్టి. ఇప్పుడు సౌత్ కొరియాలోనూ ఓ రోబో ఎమోషన్‌లో ఎవరూ ఊహించని పని చేసింది. ఏకంగా ఆత్మహత్య చేసుకుంది. ఈ సూసైడ్‌ కారణమేంటో తెలుసా..వర్క్ ప్రెజర్. పని ఒత్తిడి పెరిగి ఆ రోబో ఆత్మహత్య చేసుకుంది. సౌత్‌ కొరియాలోని గూమి సిటీ కౌన్సిల్ ఇది ప్రకటించింది. జూన్ 26వ తేదీన అడ్మినిస్ట్రేటివ్‌గా పని చేస్తున్న Cyborg రోబో సూసైడ్ చేసుకుందని వెల్లడించింది. ఆరున్నర అడుగులు ఎత్తున్న మెట్ల నుంచి దూకినట్టు తెలిపింది. అలా దూకే ముందు కాసేపు గుండ్రంగా తిరిగిందని, గందరగోళంగా కనిపించిందని అధికారులు వెల్లడించారు. గతేడాది ఆగస్టులో ఈ రోబోని రిక్రూట్ చేసుకున్నారు. అయితే సైబార్గ్ రోబో ఎందుకీ పని చేసిందని ఆరా తీయడం మొదలు పెట్టారు. అప్పుడే ఆ రోబో డిప్రెషన్‌లోకి వెళ్లినట్టు తెలిసింది. చెల్లా చెదురైన ఆ రోబో ముక్కల్ని సేకరించి వాటిని అనలైజ్ చేసేందుకు పంపించారు. 

కాలిఫోర్నియాకి చెందిన Bear Robotics సంస్థ ఈ రోబోని తయారు చేసింది. అంతకు ముందు రెస్టారెంట్‌లలో ఫుడ్ సర్వ్ చేసేందుకు రోబోలను డిజైన్ చేసింది. అయితే తొలిసారి సిటీ కౌన్సిల్ ఆఫీసర్‌గా ఈ కంపెనీ తయారు చేసిన రోబోని ఎంపిక చేశారు. "ఈ రోబో ఎంతో పని చేసేది. డాక్యుమెంట్ డెలివరీలతో పాటు సిటీని ప్రమోట్ చేసేది" అని అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ విరామం లేకుండా పని చేసిందట ఈ రోబో. సౌత్‌ కొరియా రోబో టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో చాలా ముందుంది. ప్రపంచంలోనే ఎక్కడా లేని స్థాయిలో ఇక్కడ రోబోలున్నాయి. పది మంది ఉద్యోగులకు ఓ రోబో చొప్పున అందుబాటులో ఉన్నట్టు  International Federation of Robotics వెల్లడించింది. అయితే ఓ రోబో పని ఒత్తిడి తట్టుకోలేక సూసైడ్ చేసుకుందన్న ప్రకటనే ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. 

 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Sales Petrol Pumps:పెట్రోల్ బంకులు, డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లలో మద్యం అమ్మకాలు! ఏప్రిల్ 1 నుంచి అమలు!
పెట్రోల్ బంకులు, డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లలో మద్యం అమ్మకాలు! ఏప్రిల్ 1 నుంచి అమలు!
RaghunathTemple: శ్రీనగర్ లో 36 ఏళ్ల నిరీక్షణకు తెర! కాశ్మీర్ పండిట్ ల ఊచకోతతో మూతపడిన రఘునాథ్ మందిరానికి పూర్వ వైభవం
శ్రీనగర్ లో 36 ఏళ్ల నిరీక్షణకు తెర! కాశ్మీర్ పండిట్ ల ఊచకోతతో మూతపడిన రఘునాథ్ మందిరానికి పూర్వ వైభవం
Trump Warns Iran: ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం- త్వరగా నిర్ణయం తీసుకోకపోతే అంతమే!
ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం- త్వరగా నిర్ణయం తీసుకోకపోతే అంతమే!
Iran Navy Chief Killed : హార్మూజ్ జలసంధి కింగ్ పిన్ అంతం - ఇరాన్ నావికాదళాధిపతి మృతి - ఇక నౌకలకు అడ్డే లేదు!
హార్మూజ్ జలసంధి కింగ్ పిన్ అంతం - ఇరాన్ నావికాదళాధిపతి మృతి - ఇక నౌకలకు అడ్డే లేదు!

వీడియోలు

Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Shane Warne 460 Crores Profil from RR | షేన్ వార్న్ కుటుంబానికి 460 కోట్ల లాభం | ABP Desam
Aryaman Birla IPL Player to RCB Owner | ఆర్సీబీ కొత్త బాస్ ఆర్యమన్ బిర్లా ఎమోషనల్ జర్నీ | ABP Desam
Ganguly Comments on Dhoni Retirement | ధోనీ రిటైర్మెంట్‌పై గంగూలీ వ్యాఖ్యలు | ABP Desam
Ben Duckett Out of IPL 2026 | ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Petrol Crisis: హైదరాబాద్‌లో రోజుకు 100 ట్యాంకర్ల పెట్రోల్ ఖాళీ! ABP దేశంతో తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్  
హైదరాబాద్‌లో రోజుకు 100 ట్యాంకర్ల పెట్రోల్ ఖాళీ! ABP దేశంతో తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్  
Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Trump Warns Iran: ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం- త్వరగా నిర్ణయం తీసుకోకపోతే అంతమే!
ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం- త్వరగా నిర్ణయం తీసుకోకపోతే అంతమే!
Iran Navy Chief Killed : హార్మూజ్ జలసంధి కింగ్ పిన్ అంతం - ఇరాన్ నావికాదళాధిపతి మృతి - ఇక నౌకలకు అడ్డే లేదు!
హార్మూజ్ జలసంధి కింగ్ పిన్ అంతం - ఇరాన్ నావికాదళాధిపతి మృతి - ఇక నౌకలకు అడ్డే లేదు!
Hyderabad No petrol: నిల్వలున్నా ఇంధన సెగ - హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలకు కారణం ఎవరు?
నిల్వలున్నా ఇంధన సెగ - హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలకు కారణం ఎవరు?
Bandi Sanjay Song: బండి సంజయ్ సింగ్ ఏ సాంగ్ - రిలీజ్ ఎప్పుడంటే ?
బండి సంజయ్ సింగ్ ఏ సాంగ్ - రిలీజ్ ఎప్పుడంటే ?
Metformin: డయాబెటిస్ రోగులకు గుడ్ న్యూస్ -మెట్‌ఫార్మిన్ గురించి సంచలన విషయాలు కనిపెట్టిన సైంటిస్టులు
డయాబెటిస్ రోగులకు గుడ్ న్యూస్ -మెట్‌ఫార్మిన్ గురించి సంచలన విషయాలు కనిపెట్టిన సైంటిస్టులు
Telangana News: ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!
ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!
Embed widget