Top Headlines Today: బుడమేరుకు రిటైనింగ్ వాల్ కు ఏపీ ప్రభుత్వం ప్లాన్! కూల్చివేతలపై హైడ్రా కీలక నిర్ణయం - నేటి టాప్ న్యూస్
Andhra Pradesh News | హైదరాబాద్ లో అక్రమ కట్టడాల కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించారు. పూర్తయిన నివాస కట్టడాలను కూల్చడం లేదని క్లారిటీ ఇచ్చారు.
నివాస కట్టడాల కూల్చివేతపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన, టార్గెట్ ఆ నిర్మాణాలు
జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. సామాన్యులు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు అనే వ్యత్యాసం లేకుండా నిబంధనల్ని అతిక్రమించి చెరువులు, జలాశయాల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేస్తోంది. నివాస కట్టడాలను హైడ్రా కూల్చివేయడంపై ప్రజల్లో ఆందోళన నెలకొంది. అక్రమ కట్టడాల కూల్చివేతపై స్పందించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. FTL, బఫర్ జోన్లలో చేపడుతున్న కొత్త నిర్మాణాలను మాత్రమే కూల్చివేస్తున్నట్లు స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
దువ్వాడకు లైవ్‌లో ఫోన్ చేసిన మాధురి, ఆ ఇంటి విషయంలో ట్విస్ట్, పైగా రూ.2కోట్లు అప్పు!
టెక్కలి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇష్యూపై దివ్వల మాధురి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీడియా సమక్షంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు మాధురి ఫోన్ చేసి మాట్లాడారు. ఫోన్ లో ఇంటి రిజిస్ట్రేషన్ పై దువ్వాడ శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చారు. మాధురికి తాను రూ.2 కోట్లు అప్పు ఉన్నానని దువ్వాడ శ్రీనివాస్ చెప్పారు. ఇంటి నిర్మాణానికి, రాజకీయ అవసరాలు, ఇతర అవసరాల కోసం మాధురి వద్ద అప్పు చేసినట్లుగా దువ్వాడ శ్రీనివాస్ ఫోన్లో చెప్పారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
హైడ్రా అక్కర్లేదు, అది మేమే కూల్చేస్తాం, నోటీసులపై మురళీ మోహన్ క్లారిటీ
ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ జయభేరి కన్‌స్ట్రక్షన్స్‌కు నోటీసులు రావడంపై సంస్థ వ్యవస్థాపకుడు, సినీ నటుడు మురళీ మోహన్ స్పందించారు. హైడ్రా అధికారులు తమకు నోటీసులు పంపిన విషయం నిజమే అని అన్నారు. 33 ఏళ్లుగా తాను రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నానని మురళీ మోహన్ గుర్తు చేసుకున్నారు. కానీ, తాను ఎలాంటి అక్రమణలకు పాల్పడలేదని చెప్పారు. బఫర్ జోన్ లో 3 అడుగుల మేరకు రేకుల షెడ్ ఉన్నట్లు గుర్తించామని హైడ్రా అధికారులు అంటున్నారని వివరించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
బుడమేరుకు రిటైనింగ్ వాల్ ఆలోచన ఉంది - నారాయణ కీలక వ్యాఖ్యలు
విజయవాడలో వరద ప్రభావం ఇంకా కొన్ని చోట్ల కొనసాగుతోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు పొంగూరు నారాయణ, కొండపల్లి శ్రీనివాస్ పర్యటించారు. ఇందిరా నాయక్ నగర్ లో వరద ముంపులో ఉన్న ప్రాంతాలకు వెళ్లి అక్కడి బాధితులతో మంత్రులు మాట్లాడారు. ఆహారం పంపిణీ, తాగు నీటి సరఫరాపై బాధితులను వివరాలు అడిగి మంత్రి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బుడమేరుకు వరద ముప్పు నుంచి తప్పించేలా రిటైనింగ్ వాల్ నిర్మించాలనే ప్రతిపాదన పరిశీలిస్తున్నట్లుగా నారాయణ చెప్పారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
మనిషి లక్షణాలు కూడా లేవు ఛీఛీ - జగన్ 8 ప్రశ్నలకు టీడీపీ దిమ్మదిరిగే కౌంటర్
ఏపీ ప్రభుత్వం విజయవాడలో వరద బాధితులకు అందిస్తున్న సహాయ కార్యక్రమాల విషయంలో వైఎస్ జగన్ సుదీర్ఘ సోషల్ మీడియా పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. మీరు ఈ ట్వీట్ బెంగళూరులో ఉండి వేసారా? లండన్ లో ఉండి వేసారా? అని ఎద్దేవా చేస్తూ కౌంటర్ పోస్ట్ చేసింది. గత ఏడు రోజులుగా వరదలో కూడా బురద రాజకీయం చేస్తున్న నీ రోత రాజకీయానికి సమాధానాలు.. ఇవే అంటూ కౌంటర్ ఇచ్చింది. ముందుగా.. తమరు ఇస్తానన్న కోటి వరద బాధిత ప్రజలకు ఎప్పుడు ఇస్తున్నారు? అని ప్రశ్నించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి