Duvvada Issue: దువ్వాడకు లైవ్‌లో ఫోన్ చేసిన మాధురి, ఆ ఇంటి విషయంలో ట్విస్ట్, పైగా రూ.2కోట్లు అప్పు!
Srikakulam News: మాధురికి తాను రూ.2 కోట్లు అప్పు పడ్డానని, గతంలో ఇల్లు కట్టడం, ఎన్నికల అవసరాల కోసం తాను మాధురి వద్ద అప్పు చేసినట్లుగా దువ్వాడ శ్రీనివాస్ చెప్పారు.
Duvvada Srinivas Madhuri: టెక్కలి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇష్యూపై దివ్వల మాధురి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీడియా సమక్షంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు మాధురి ఫోన్ చేసి మాట్లాడారు. ఫోన్ లో ఇంటి రిజిస్ట్రేషన్ పై దువ్వాడ శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చారు. మాధురికి తాను రూ.2 కోట్లు అప్పు ఉన్నానని దువ్వాడ శ్రీనివాస్ చెప్పారు. ఇంటి నిర్మాణానికి, రాజకీయ అవసరాలు, ఇతర అవసరాల కోసం మాధురి వద్ద అప్పు చేసినట్లుగా దువ్వాడ శ్రీనివాస్ ఫోన్లో చెప్పారు.
టెక్కలికి చెందిన చింతాడ పార్వతీశంకి రూ.60 లక్షలు ఇవ్వాలని.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తన వ్యాపారాలు దెబ్బతిన్నాయని దువ్వాడ మాట్లాడారు. తన ఇష్టపూర్వకంగానే తన ఆస్తిని మాధురికి రిజిస్ట్రేషన్ చేశానని దువ్వాడ శ్రీనివాస్ వెల్లడించారు. మరిన్ని వివరాలు ప్రెస్ మీట్ పెట్టి చెబుతాననని దువ్వాడ శ్రీనివాస్ చెప్పారు.
‘‘నా ఆస్తిలోకి నా అనుమతి లేకుండా ఎవరు రావడానికి అర్హత లేదు. దువ్వాడ శ్రీనివాస్ ఇంటిని కబ్జా చేసేందుకు వాణీ ప్రయత్నం చేశారు. యాక్సిడెంట్ సమయంలో నా వాయిస్, దువ్వాడ శ్రీనివాస్ వాయిస్ ను సృష్టించారు. దువ్వాడ వాణినే వాయిస్ ఆ రికార్డ్ ప్లాన్ చేశారు. ఆ వైరల్ అవుతున్న ఆడియో టేప్ వారు క్రియేట్ చేసినదే. మా దంపతుల మధ్య కొన్ని రోజులుగా విభేదాలు ఉన్నాయి. నాపై హత్యాయత్నం కూడా చేశారు. దానిపై పోలీసులకు ఫిర్యాదు చేశాను. పార్టీ కార్యక్రమాలు చేసేందుకు, ఈ ఇంటిని దువ్వాడ శ్రీనివాస్ కు అద్దెకు ఇస్తాను.
దువ్వాడ శ్రీనువాస్ ఇంటి వద్ద గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న దువ్వాడ వాణి, కుమార్తెలు రాత్రి ఒంటి గంట సమయంలో ఇంటిని కాళీ చేశారు. ప్రస్తుతం ఆ ఇంటిని నేనే స్వాధీనపర్చుకున్నాను’’ అని దివ్వల మాధురి వెల్లడించారు. గొడవ సద్దుమణగడంతో ఇంటి వద్ద నుంచి అందరినీ పోలీసులు ఖాళీ చేయించారు.