Republic Day: జనవరి 26న భారీ ఉగ్రదాడులకు పక్కా ప్లాన్.. భద్రతా బలగాలు హై అలర్ట్!
జనవరి 26న భారీ ఉగ్రదాడులకు పథకం పన్నినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో బలగాలు హైఅలర్ట్‌లో ఉన్నాయి.
దేశంలో సెక్యూరిటీ ఏజెన్సీలు, బలగాలు హైఅలర్ట్‌లో ఉన్నాయి. రిపబ్లిక్ డే నాడు భారీ ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలకు పక్కా సమాచారం అందటంతో అప్రమత్తం అయ్యాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాల్లో భద్రతను పెంచాలని ఇప్పటికే బలగాలకు ఆదేశాలు వచ్చినట్లు సమాచారం.
భారీ దాడులకు..
భద్రతా బలగాలకు వచ్చిన సమాచారం ప్రకారం.. హై ప్రొఫైల్ లీడర్లతో పాటు రద్దీగా ఉండే ప్రాంతాలు, మార్కెట్లను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది. రైల్వే స్టేషన్లు, బస్‌స్టాండ్లు, ఆధ్యాత్మిక ప్రాంతాలపై కూడా దృష్టి పెట్టే అవకాశం ఉంది.
దీంతో ముఖ్యంగా యూనిట్ కంట్రోల్ రూమ్‌లు 24/7 అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. నిఘా వర్గాలతో ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంచుకుని సివిల్ పోలీసులకు అందించాలని పేర్కొంది.
భద్రతా బలగాలతో పాటు మిలిటరీ సిబ్బంది కూాడా అప్రమత్తంగా ఉండాలని.. క్యాంప్ ఏరియాల్లో కూడా నిరంతర పర్యవేక్షణ చేయాలని సదరు నోటీసులో ప్రభుత్వం పేర్కొన్నట్లు సమాచారం.
దుమారం..
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ.. పంజాబ్ పర్యటనలో ఎదురైన భద్రతా లోపాలపై రాజకీయ దుమారం రేగింది. కేంద్ర హోంశాఖ కూడా ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఇప్పటికే పంజాబ్ సర్కార్‌ను దీనిపై నివేదిక అందజేయాలని హోంశాఖ ఆదేశించింది. అయితే భద్రతా లోపాలను పంజాబ్ సర్కార్ ఖండించింది.
Also Read: Jawed Habib Spitting Video: హెయిర్ స్టైలిష్ హబీబ్‌పై ఎఫ్ఐఆర్.. మహిళ తలపై ఉమ్మేసి హెయిర్ స్టైలింగ్
Also Read: DigiLocker: యూనివర్సిటీలకు UGC కీలక ఆదేశాలు.. ఇక ఆ సర్టిఫికెట్లకు చెల్లుబాటు
Also Read: Covid Cases Today: దేశంలో కరోనా డేంజర్ బెల్స్.. ఒక్కరోజులో అక్షరాల లక్ష కేసులు