Parimal Nathwani Wins Rajya Sabha: జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల్లో గెలిచిన వైసీపీ మాజీ మాజీ ఎంపీ - కాంగ్రెస్‌కుకు షాక్!
RajyaSabha Elections: వైసీపీ మాజీ ఎంపీ పరిమళ్ నత్వానీ జార్ఖండ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. బీజేపీ మద్దతుతో స్వతంత్రంగా బరిలోకి దిగిన ఆయన 28 ఓట్లు సాధించారు.

Parimal Nathwani BJP backed candidate: జార్ఖండ్ రాష్ట్రంలో ఆసక్తికరంగా సాగిన రాజ్యసభ ఎన్నికల పోరు ముగిసింది. ఈ ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో బరిలోకి దిగిన ప్రముఖ పారిశ్రామికవేత్త, వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ పరిమల్ నత్వానీ ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి ప్రణవ్ ఝాపై నత్వానీ స్పష్టమైన ఆధిక్యతతో విజయం జెండా ఎగురవేశారు.
జార్ఖండ్ అసెంబ్లీ వేదికగా జరిగిన ఈ రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌లో పరిమల్ నత్వానీకి అనుకూలంగా ఫలితం వచ్చింది. మొత్తం పోలైన ఓట్లలో నత్వానీకి 28 ఓట్లు రాగా.. ఆయన ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝా కేవలం 20 ఓట్లకే పరిమితమయ్యారు. దీంతో నత్వానీ జార్ఖండ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించారు.
झारखंड राज्यसभा चुनाव में परिमल नाथवानी ने जीत दर्ज की। चुनाव में उन्हें कुल 30 मत प्राप्त हुए, जबकि 2 वोट रद्द घोषित किए गए। नतीजों के बाद राजनीतिक गलियारों में चर्चाओं का दौर तेज हो गया है।#ParimalNathwani #RajyaSabhaElection #JharkhandPolitics #ElectionResult #JharkhandNews pic.twitter.com/wLAvdwgqOj
— Air Now (@airnowindia) June 18, 2026
బీజేపీ వ్యూహాత్మక మద్దతు.. కలిసివచ్చిన సమీకరణాలు
స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగినప్పటికీ పరిమల్ నత్వానీకి భారతీయ జనతా పార్టీ మొదటి నుంచీ పూర్తి స్థాయిలో అండగా నిలిచింది. జార్ఖండ్ ముక్తి మోర్చా , కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉన్నప్పటికీ, నత్వానీ తనకున్న వ్యక్తిగత పరిచయాలు, వ్యూహాత్మక చతురతతో ప్రతిపక్ష బీజేపీ శాసనసభ్యుల ఓట్లతో పాటు కొందరు స్వతంత్రులు, ఇతర చిన్న పార్టీల మద్దతును కూడా కూడగట్టుకోవడంలో విజయవంతమయ్యారు. ఈ క్రాస్ ఓటింగ్, వ్యూహాత్మక ఓటింగే ఆయన విజయాన్ని సునాయాసం చేసింది.
కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ..
మరోవైపు, ఈ ఫలితం కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బగా నిలిచింది. తమ అభ్యర్థి ప్రణవ్ ఝాను గెలిపించుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం గట్టి ప్రయత్నాలు చేసినప్పటికీ, ఆశించిన స్థాయిలో ఓట్లను సాధించలేకపోయింది. కూటమిలోని మిత్రపక్షాల ఓట్లను పూర్తిగా తమ వైపు తిప్పుకోవడంలో కాంగ్రెస్ వ్యూహం విఫలమైందని, ఈ ఫలితం ద్వారా అధికార కూటమిలోని అంతర్గత సమన్వయ లోపం మరోసారి బయటపడిందని అభిప్రాయపడుతున్నారు.
పరిమల్ నత్వానీ పొలిటికల్ ట్రాక్ రికార్డ్
రిలయన్స్ ఇండస్ట్రీస్ కార్పొరేట్ వ్యవహారాల డైరెక్టర్‌గా ఉన్న పరిమల్ నత్వానీకి రాజ్యసభ కొత్తేమీ కాదు. గతంలో ఆయన జార్ఖండ్ నుంచే రెండుసార్లు స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా రాజ్యసభ సభ్యుడిగా సేవలు అందించారు. ఇప్పుడు మళ్లీ జార్ఖండ్ రాజకీయాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చి, బీజేపీ మద్దతుతో తన పట్టును నిరూపించుకుంటూ నాలుగోసారి పెద్దల సభలో అడుగుపెడుతున్నారు.
ట్రెండింగ్ వార్తలు





















