అన్వేషించండి

Meenakshi Natrajan Nomination Cancelled: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు భారీ షాక్ - రాజ్యసభ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ - హైదరాబాద్ కేసే కారణం

Rajya Sabha MP Seat MP 2026: తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మీనాక్షీ నటరాజన్ మధ్యప్రదేశ్‌లో రాజ్యసభ నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. హైదరాబాద్‌లో ఉన్న కేసును దాచడమే కారణం.

Congress Defeat Madhya Pradesh: మధ్యప్రదేశ్  రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా, గాంధీ కుటుంబానికి అత్యంత నమ్మకస్థురాలిగా ఉన్న సీనియర్ నేత మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ ఆశలు ఒక్కసారిగా గల్లంతయ్యాయి. మధ్యప్రదేశ్ నుండి రాజ్యసభకు వెళ్లేందుకు ఆమె దాఖలు చేసిన నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి  మంగళవారం స్క్రూటినీలో తిరస్కరించారు. అఫిడవిట్‌లో అత్యంత కీలకమైన సమాచారాన్ని దాచారనే కారణంతో ఎన్నికల అధికారి తీసుకున్న ఈ కఠిన నిర్ణయం కాంగ్రెస్ శిబిరంలో తీవ్ర కలకలం రేపుతోంది.

ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం.. అభ్యర్థులు తమపై ఉన్న పెండింగ్ క్రిమినల్ కేసులు, కోర్టు చార్జ్‌షీట్ల వివరాలను అఫిడవిట్ ఫామ్-26లో స్పష్టంగా వెల్లడించాల్సి ఉంటుంది. అయితే, మీనాక్షీ నటరాజన్ తన నామినేషన్ పత్రాల్లో హైదరాబాద్‌లోని ఒక స్థానిక న్యాయస్థానంలో తనపై నమోదైన క్రిమినల్ కేసుకు సంబంధించిన సమాచారాన్ని పొందుపరచలేదనే విషయాన్ని ప్రత్యర్థి వర్గం తెరపైకి తెచ్చింది. గతంలో తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల పర్యవేక్షణ సమయంలో, హైదరాబాద్‌లో జరిగిన ఒక పొలిటికల్ ప్రొటెస్ట్,  ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం , శాంతిభద్రతల ఉల్లంఘనకు సంబంధించిన కేసు నాంపల్లి కోర్టు పరిధిలో పెండింగ్‌లో ఉన్నట్లు తేలింది.

ఈ  హైదరాబాద్ కనెక్షన్ కేసును క్షుణ్ణంగా రీసెర్చ్ చేసిన బీజేపీ లీగల్ సెల్ విభాగం.. కోర్టు చార్జ్‌షీట్ కాపీలు, ఎఫ్ఐఆర్ నంబర్లతో సహా రిటర్నింగ్ అధికారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. నిబంధనల ప్రకారం పెండింగ్ క్రిమినల్ కేసుల సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా దాచడం  తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. బీజేపీ సమర్పించిన పక్కా లీగల్ ఆధారాలను, కోర్టు రికార్డులను సుదీర్ఘంగా పరిశీలించిన ఎన్నికల అధికారులు.. మీనాక్షీ నటరాజన్ అఫిడవిట్‌లో లోపాలు ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించుకుని ఆమె నామినేషన్‌ను అధికారికంగా రద్దు చేశారు.

ఈ కీలక పరిణామంతో మధ్యప్రదేశ్, తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తెలంగాణ ఇన్‌చార్జ్‌గా ఉన్న మీనాక్షిని టార్గెట్ చేస్తూ.. అధికార బలంతో, సాంకేతిక కారణాలను నెపంగా చూపి బీజేపీ రాజకీయం చేస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. రాజకీయ నిరసనల్లో నమోదయ్యే సాధారణ కేసులను అడ్డం పెట్టుకొని నామినేషన్ రద్దు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని, దీనిపై తాము తక్షణమే  సుప్రీంకోర్టును ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. 

మరోవైపు, బీజేపీ ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందించింది. చట్టం ఎవరికైనా ఒక్కటేనని, స్వయంగా ఒక రాష్ట్రానికి ఇన్‌చార్జ్‌గా ఉంటూ కోర్టు కేసుల వివరాలను దాచిపెట్టి దొడ్డిదారిన రాజ్యసభకు వెళ్లాలనుకోవడం కాంగ్రెస్ దివాళాకోరుతనానికి నిదర్శనమని ఎద్దేవా చేసింది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ తరఫున సింగిల్ అభ్యర్థిగా బరిలో ఉన్న మీనాక్షి నామినేషన్ రద్దు కావడంతో, అక్కడ ఖాళీగా ఉన్న స్థానంలో అధికార బీజేపీ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవం   కావడం ఇక లాంఛనంగానే మారింది.  

మధ్యప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడ రాజ్యసభ ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి గెలవడానికి కనీసం 58 ఓట్లు అవసరం. ఈ లెక్కన కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షీ నటరాజన్ సులువుగా గెలవడానికి సరిపడా సంఖ్యాబలం కాంగ్రెస్ క్యాంప్‌కు ఉంది. అయితే, తమకు ఇద్దరు అభ్యర్థులను గెలిపించుకోగా మిగిలే అదనపు ఓట్లకు తోడు, మరో 10 ఓట్లను ఎలాగోలా మేనేజ్ చేయవచ్చనే వ్యూహంతో బీజేపీ చివరి నిమిషంలో మహేష్ కేవత్‌ను మూడో అభ్యర్థిగా బరిలోకి దించింది. ఈ ఊహించని పరిణామంతో అప్రమత్తమైన కాంగ్రెస్ క్యాంప్.. తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి, క్రాస్ ఓటింగ్ జరగకుండా చూసేందుకు పీసీసీ అధ్యక్షుడు జితు పట్వారీ, దిగ్‌విజయ్ సింగ్, ఉమంగ్ సింఘార్ వంటి సీనియర్ నేతలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి గట్టి ప్రయత్నాలే చేసింది. తమ అభ్యర్థి 500 శాతం గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసినప్పటికీ.. ఈ లోపే నామినేషన్ సాంకేతిక కారణాలతో తిరస్కరణకు గురై కాంగ్రెస్ శ్రేణులను కోలుకోలేని దెబ్బతీసింది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News:మహిళలతో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ
మహిళలతో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ
Petrol-Diesel Windfall Tax: పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
ABP Desam Top 10, 15 August 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 15 August 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 14 August 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
ABP Desam Top 10, 14 August 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News:మహిళలతో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ
మహిళలతో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ
Petrol-Diesel Windfall Tax: పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
Embed widget