అన్వేషించండి

Rajkot: గేమ్‌జోన్ నడిపేందుకు పర్మిట్‌ లేదు, ఒకటే ఎగ్జిట్ డోర్‌తో ప్రాణనష్టం - రాజ్‌కోట్ ఘటన దర్యాప్తులో కీలక విషయాలు

Rajkot Game Zone: రాజ్‌కోట్‌లోని గేమ్‌జోన్‌ని ఎలాంటి అనుమతులు లేకుండా నడుపుతున్నారని, ఫైర్ NOC రాలేదని అధికారులు ధ్రువీకరించారు.

Rajkot Fire Accident: గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో గేమ్‌జోన్‌ అగ్ని ప్రమాదం (Rajkot Game Zone Fire Accident) దేశవ్యాప్తంగా అలజడి సృష్టించింది. ఈ ఘటనలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. వీళ్లతో 9 మంది చిన్నారులన్నారు. ఈ ప్రమాదం జరిగినప్పటి నుంచి అసలు ఈ గేమ్‌జోన్‌లో భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం...ఈ గేమ్‌ జోన్‌లో అగ్నిప్రమాదానికి సంబంధించి NOC ఇంకా రావాల్సి ఉంది. ఈ సర్టిఫికేట్ రాకుండానే జోన్‌ ప్రారంభించారు. పైగా మొత్తం జోన్‌కి కేవలం ఒకే ఒక ఎగ్జిట్ ఉంది. మృతుల సంఖ్య ఎక్కువగా నమోదు కావడానికి ఇది కూడా ఓ కారణమే అంటున్నారు అధికారులు. వీకెండ్ కావడం, పైగా టికెట్‌ ధర కేవలం రూ.99 పెట్టడం వల్ల ఎక్కువ మంది వచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే... ప్రమాదానికి కారణమేంటన్నది మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. 

"ఈ అగ్ని ప్రమాదానికి కారణమేంటో ఇంకా స్పష్టత రాలేదు. మంటల్ని పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. బలమైన గాలులు వీస్తుండడం వల్ల మంటలు ఎగిసి పడుతున్నాయి. వీటిని ఆర్పడంలో మా ఆపరేషన్‌లో ఇదే సవాలుగా మారింది"

- అగ్ని మాపక అధికారులు

ఇక్కడ జరిగిన ప్రమాదం వల్ల కిలోమీటర్ల మేర పొగలు కమ్ముకున్నాయి. ఆ స్థాయిలో మంటలు చెలరేగాయి. కొన్ని మృతదేహాలు గుర్తు పట్టలేని స్థితిలో ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. DNA శాంపిల్స్ ద్వారా బాధితుల కుటుంబ సభ్యులకి అప్పగించే పనిలో ఉన్నామని వివరించారు. నిజానికి...ఈ గేమ్‌జోన్‌ని ఆపరేట్ చేసేందుకు అవసరమైన లైసెన్స్‌లు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. రాజ్‌కోట్‌ మన్సిపల్ కార్పొరేషన్‌ అనుమతి ఇవ్వకుండానే ఇది మొదలైంది. మున్సిపల్ కార్పొరేషన్‌ దీన్ని పట్టించుకోకుండా వదిలేయడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు మండి పడుతున్నారు. రాజ్‌కోట్‌ మేయర్  ఘటనా స్థలాన్ని పరీశించారు. గేమ్‌జోన్‌కి Fire NOC లేదని ధ్రువీకరించారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ కూడా ఒక్కటే ఉండడంపైనా విచారణ జరుపుతామని వెల్లడించారు. ఈ కారణంగానే ప్రమాదం జరిగిన వెంటనే లోపలి వాళ్లు బయటకు రాలేకపోయారని వివరించారు. ఇప్పటికే ఈ గేమ్‌జోన్ మేనేజర్‌, ఓనర్‌ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గుజరాత్‌లోని అన్ని గేమ్‌జోన్స్‌నీ పరిశీలించాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనను గుజరాత్‌ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టనుంది. 

 

Also Read: Viral Video: కదులుతున్న ట్రక్‌లోని సరుకులు చోరీ, ధూమ్‌ రేంజ్‌ స్టంట్‌లు చేసిన దొంగలు - వైరల్ వీడియో

టాప్ హెడ్ లైన్స్

India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Breaking News: భోగాపురం పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ వచ్చేసింది
భోగాపురం పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ వచ్చేసింది
ABP Desam Top 10, 26 July 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
ABP Desam Top 10, 26 July 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
Iran US Conflict: 13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Embed widget