అన్వేషించండి

Rajasthan Sand Storm: రాజస్థాన్‌లో ఇసుక తుఫాన్ - బీభత్సం అన్నది చిన్నమాటే - ఈ దృశ్యాలు చూస్తే షాకే

Rajasthan Sand Storm: రాజస్థాన్‌లో శనివారం భారీ ఇసుక తుపాను బీభత్సం సృష్టించింది. పట్టపగలే చీకటి అలుముకోవడంతో వాహనాలు నిలిచిపోయాయి. ఇసుక తుఫాను దృశ్యాలు హాలీవుడ్ సినిమాల్లోని దృశ్యాలను తలపించాయి.

Dust Storm Rajasthan 2026:   రాజస్థాన్‌లోని చురు జిల్లాలో ప్రకృతి ప్రకోపానికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భానుడి భగభగలతో అల్లాడిపోతున్న ప్రజలకు ఊరట లభిస్తుందనుకుంటే, ప్రకృతి ఊహించని విధంగా  ఇసుక తుపాను  రూపంలో విరుచుకుపడింది.  
 
రాజస్థాన్‌లోని చురు జిల్లా శనివారం మధ్యాహ్నం ఒక భీకర ఇసుక తుపాను  గుప్పిట్లోకి వెళ్లిపోయింది. మధ్యాహ్నం సరిగ్గా 2 గంటల సమయంలో ఆకాశం ఒక్కసారిగా రంగు మారి, భారీ ఇసుక మేఘాలు నగరాన్ని కమ్మేశాయి. కేవలం కొద్ది నిమిషాల్లోనే ఇసుక గోడలా విరుచుకుపడటంతో, పట్టపగలే చిమ్మచీకటి అలుముకుంది. అప్పటివరకు ఎండతో అల్లాడిన జనం, ఈ హఠాత్తు పరిణామంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. గాలిలో ఇసుక రేణువుల ధాటికి వాహనదారులు కనీసం ఎదురుగా ఉన్న రోడ్డును కూడా చూడలేక వాహనాలను ఎక్కడికక్కడ నిలిపివేశారు. 

 అర్ధగంట పాటు ఇ సుక నరకం! 

ఈ ఇసుక తుపాను సుమారు 30 నిమిషాల పాటు ఏకధాటిగా కొనసాగింది. గాలి వేగం ఎంత తీవ్రంగా ఉందంటే.. రోడ్లపై వెళ్తున్న వారు ప్రాణభయంతో సమీపంలోని షాపులు, భవనాల కింద ఆశ్రయం పొందారు. దృశ్యమానత  సున్నాకి పడిపోవడంతో వాహనదారులు మధ్యాహ్నమే హెడ్‌లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వచ్చింది. బలమైన గాలుల ధాటికి జిల్లాలోని పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోగా, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.  

 మొదట దుమ్ము.. తర్వాత వర్షం! 

భయంకరమైన ఇసుక తుపాను ముగిసిన వెంటనే చురు జిల్లాలో వర్షం కురిసింది. ఆకాశం నుంచి ఇసుక వర్షం కురుస్తున్నట్లుగా వాతావరణం కనిపించింది. ఈ వర్షం వల్ల వాతావరణం కొంత చల్లబడినప్పటికీ, అంతకుముందు సంభవించిన ఇసుక తుపాను సృష్టించిన బీభత్సం నుంచి ప్రజలు కోలుకోవడానికి సమయం పట్టింది. చురుతో పాటు శ్రీగంగనగర్, జైపూర్, బికనీర్ వంటి నగరాల్లో కూడా ఇలాంటి ధూళి తుపానులు సాధారణ జీవనాన్ని అతలాకుతలం చేశాయి.

 ఎండల నుంచి  ధూళి ఉపద్రవం వైపు.. 

గత కొద్ది రోజులుగా రాజస్థాన్‌ను ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చురులో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటిపోవడంతో జనం ఇళ్లకే పరిమితమయ్యారు. తీవ్రమైన వేడి గాలుల  కారణంగా రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఇలాంటి సమయంలో కురిసిన ఈ ఇసుక తుపాను ప్రజలకు ఒక వింత అనుభూతిని, అదే సమయంలో భయాన్ని కలిగించింది. ప్రకృతి సృష్టించిన ఈ  బ్లాక్ అవుట్ దృశ్యాలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చర్చనీయాంశంగా మారాయి.
 
రాజస్థాన్ ఎడారి ప్రాంతం కావడంతో ఇసుక తుపానులు సహజమే అయినప్పటికీ, ఈ స్థాయిలో పట్టపగలు చీకటి అలుముకోవడం పర్యావరణ మార్పులకు సంకేతమని నిపుణులు భావిస్తున్నారు. ప్రాణనష్టం జరగకపోయినప్పటికీ, ఆస్తి నష్టం ,  సాధారణ జీవనానికి కలిగిన అంతరాయం ప్రజలను బెంబేలెత్తించింది. శనివారం మధ్యాహ్నం చురు వాసులకు ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది.

 

టాప్ హెడ్ లైన్స్

Ronaldo Suspension Shock: కోచ్‌తో విభేదించి క్యాంప్ వీడినందుకు దిగ్గజానికి భారీ షాక్.. రొనాల్డోపై సస్పెన్షన్ వేటు
కోచ్‌తో విభేదించి క్యాంప్ వీడినందుకు దిగ్గజానికి భారీ షాక్.. రొనాల్డోపై సస్పెన్షన్ వేటు
ABP Desam Top 10, 10 October 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
ABP Desam Top 10, 10 October 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
Embed widget