Queen Elizabeth Funeral: రాణిని చివరిసారి చూసేందుకు కూడా మేఘన్‌కు నో పర్మిషన్!
Queen Elizabeth Funeral: రాణి ఎలిజబెత్ 2ను చివరి చూపు చూడకుండా ప్రిన్స్ హ్యారీ భార్య మేఘన్‌ను రాజ కుటుంబం అడ్డుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
![Queen Elizabeth Funeral: రాణిని చివరిసారి చూసేందుకు కూడా మేఘన్‌కు నో పర్మిషన్! Queen Elizabeth ii Funeral Meghan Markle may not attend Queen Elizabeth funeral Here is why all you need to know Queen Elizabeth Funeral: రాణిని చివరిసారి చూసేందుకు కూడా మేఘన్‌కు నో పర్మిషన్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/11/8fce364bd22ee1799deeddd304255c3d1662884617386218_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Queen Elizabeth Funeral: క్వీన్ ఎలిజబెత్ 2ను చివరి చూపు చూసేందుకు ప్రిన్స్ హ్యారీ భార్య మేఘన్‌కు అనుమతి ఇవ్వలేదట. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. దీంతో ప్రిన్స్ హ్యారీ మాత్రం క్వీన్ ఎలిజబెత్ పార్థివ దేహానికి నివాళులు అర్పించినట్లు వార్తలు వస్తున్నాయి.
ఎందుకు?
స్కాట్లండ్‌లోని బాల్మోరల్ కోటలో మృత్యుశయ్యపై ఉన్న రాణిని చూసేందుకు మేఘన్ రావడానికి వీల్లేదని కింగ్ చార్లెస్ పట్టుబట్టారట. హ్యారీ దంపతులు గురువారం లండన్‌లోనే ఉన్నారు. రాణిని కడసారి చూసేందుకు వీరిద్దరూ బాల్మోరల్ బయల్దేరుతున్నట్టు తెలియగానే చార్లెస్ నేరుగా హ్యారీకి ఫోన్ చేసి మేఘన్ రాకూడదని చెప్పినట్లు సమాచారం. దీంతో హ్యారీ ఒంటరిగానే వెళ్లి నాయనమ్మకు నివాళులు అర్పించారు.
మేఘన్ అమెరికా వెళ్లి రాణి అంత్యక్రియల సమయానికి లండన్ తిరిగొస్తారని చెబుతున్నారు. అప్పటివరకు హ్యారీ లండన్‌లోనే ఉండనున్నారు.
ఎప్పటి నుంచో
బ్రిటన్ రాజ కుటుంబంలో కొన్నేళ్లుగా విభేదాలు నెలకొన్నాయి. రాణి ఎలిజబెత్–2 మృతి తర్వాత ఇవి మరోసారి బయటపడ్డాయి. కింగ్ చార్లెస్, ఆయన పెద్ద కుమారుడు ప్రిన్స్ విలియంతో చిన్న కుమారుడు ప్రిన్స్ హ్యారీకి చాలా ఏళ్లుగా సత్సంబంధాలు లేవు. రాజకుటుంబం అభ్యంతరాలను పట్టించుకోకుండా అమెరికా నటి మేఘన్ మార్కెల్‌ను హ్యారీ పెళ్లాడటంతో ఈ విభేదాలు తారస్థాయికి చేరాయి. దీంతో హ్యారీ దంపతులు రాచరికపు హోదానే వదులుకున్నారు. ఆ తర్వాత హ్యారీ భార్య మేఘన్.. రాజ కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేశారు.
ప్రిన్స్ హ్యారీని పెళ్లి చేసుకుని బ్రిటన్ రాజకుటుంబంలోకి అడుగుపెట్టాక ఎన్నో ఇబ్బందులు పడ్డానని ఆమె అన్నారు. రాజకుటుంబం నుంచి విడిపోయిన తర్వాత అమెరికాలోని పాపులర్ టీవీ షో ఓఫ్రా విన్ఫ్రే కార్యక్రమానికి ప్రత్యేక ఇంటర్వ్యూలో మేఘన్ సంచలన ఆరోపణలు చేశారు.
Also Read: Bharat Jodo Yatra: 'ఎందుకీ బ్రహ్మచర్యం, పెళ్లి చేసుకోండి అమ్మాయిని చూస్తాం'- సిగ్గుపడిన రాహుల్!
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 5 వేల కరోనా కేసులు- ఏడుగురు మృతి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)