Punjab Gun Culture: గన్ కల్చర్‌పై పంజాబ్ ప్రభుత్వం సీరియస్, ఆంక్షలతో ఉక్కుపాదం
Punjab Gun Culture: పంజాబ్‌లో గన్ కల్చర్‌పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుంది.
Punjab Gun Culture:
లైసెన్స్ సులువు కాదు..
పంజాబ్ ప్రభుత్వం గన్ కల్చర్‌పై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో ఆయుధాల వినియోగింపై భగవంత్ మాన్ సర్కార్ కఠినంగా వ్యవహరించనుంది. ఈ మేరకు కొన్నిమార్గదర్శకాలు జారీ చేసింది. రోజూ రాష్ట్రంలో ఏదో ఓ చోట కాల్పుల ఘటనలు వెలుగు చూస్తున్నాయి. అందుకే..ప్రభుత్వం వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఆయుధాలను పబ్లిక్‌గా డిస్‌ప్లే చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. అంతే కాదు. గన్ లైసెన్స్ కూడా మునుపటిలా సులువుగా దొరకదు. ఇందుకు కూడా చాలా రూల్స్ పెట్టారు. అన్ని ప్రాంతాల్లోనూ సోదాలు, తనిఖీలు నిర్వహించనున్నారు. పంజాబీ సాంగ్స్‌లో కూడా ఎక్కడా ఆయుధాలు కనిపించకుండా కఠిన నిబంధనలు అమలు చేయనున్నారు. డ్రగ్స్, ఆయుధాలు ఇకపై పంజాబీ సాంగ్స్‌లో కనిపించకూడదని ప్రభుత్వం హెచ్చరించింది.
ఇవే ఆ మార్గదర్శకాలు..
1. ఇప్పటికే లైసెన్స్‌లు పొందిన గన్స్‌ని వచ్చే మూడు నెలల్లో పూర్తి స్థాయిలో రివ్యూ చేయాలి. ఇకపై లైసెన్స్‌లు అంత సులువుగా జారీ చేయరు. అత్యవసర పరిస్థితులు అయితే తప్ప ఆయుధాలు క్యారీ చేయడానికి అనుమతినివ్వరు.
2. సోషల్ మీడియా సహా బహిరంగ ప్రదేశాల్లో ఆయుధాలను డిస్‌ప్లే చేయకూడదు. దీనిపై పూర్తి స్థాయి నిషేధం ఉంటుంది.
3. పలు ప్రాంతాల్లో అక్కడక్కడా తనిఖీలు చేపడతారు.
4. పాటల్లో హింసను, ఆయుధాల వినియోగాన్ని ప్రేరేపించే విధంగా చూపించటం నిషేధం. కచ్చితంగా ఈ నిబంధనను పాటించాల్సిందే.
5. ఏ వర్గం గురించైనా సరే అసభ్యకరమైన భాషలో మాట్లాడితే వెంటనే FIR నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటారు.
6. నిర్లక్ష్యంగా ఆయుధాలను వినియోగించడం, వాటిని సెలెబ్రెటీ హోదా కోసం అనవసరంగా కాల్చడం, ప్రాణాలకు ముప్పు కలిగించేలా వ్యవహరించటం లాంటివి చేస్తే FIR నమోదు చేస్తారు. కఠినంగా శిక్షిస్తారు.
CM @BhagwantMann Sahib instructs to impose a complete ban on carrying and displaying arms (Weapons in public gatherings, places of worship, wedding parties or any other event.
— Raj Gill, (@rajlali) November 13, 2022
Excellent decision, it will control the hun culture to a large extent in #Punjab pic.twitter.com/k65eVKqKMX
CM Bhagwant Mann imposed complete ban on Punjabi songs glorifying weapons or violence #AAP #GunCulture
— Gagandeep Singh (@Gagan4344) November 13, 2022
Also Read: Army chief: ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం- దేనికైనా రెడీగా ఉన్నాం: ఆర్మీ చీఫ్