Pune Women : లేచింది మహిళా లోకం .. నిలబడింది పురుష ప్రాణం ! పుణె మహిళ సాహసం తెలిస్తే..
బస్సు నడుపుతున్న డ్రైవర్‌కు హఠాత్తుగా ఫిట్స్ వచ్చాయి. వెంటనే స్పందించిన ప్రయాణికుల్లోని మహిళ బస్సును కంట్రోల్ చేసింది ఆస్పత్రికి డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్లింది. డ్రైవర్‌ను కాపాడింది
![Pune Women : లేచింది మహిళా లోకం .. నిలబడింది పురుష ప్రాణం ! పుణె మహిళ సాహసం తెలిస్తే.. Pune Woman Drives Bus For 10 Kms After Driver Suffers Seizure, Takes Him to The Hospital Pune Women : లేచింది మహిళా లోకం .. నిలబడింది పురుష ప్రాణం ! పుణె మహిళ సాహసం తెలిస్తే..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/17/f01150d1b19eb4a83d728aac8e686677_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
స్కూలు పిల్లలు, కొంత మంది వారి తల్లులు ఉన్న బస్ జోరుగా వెళ్తోంది. హఠాత్తుగా బస్ షేక్ అయిపోయింది. ఏం జరిగిందా అని అందరూ డ్రైవర్ వైపు చూస్తే.. డ్రైవర్ కూడా షేకైపోతున్నాడు. ఫిట్స్ వచ్చినట్లుగా ఊగిపోతున్నాడు. వచ్చినట్లుగా కాదు నిజంగానే ఫిట్స్ వచ్చాయి. దాంతో ఓ మహిళ ఉన్న పళంగా వెళ్లింది.. ముందుగా బస్‌ను కంట్రోల్ చేసింది. తర్వాత డ్రైవర్‌ను పక్క సీట్లో కూర్చోబెట్టి.. చేతిలో ఇనుప ముక్క పెట్టి.. తర్వాత డ్రైవింగ్ సీట్లో కూర్చుంది. పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్పత్రికి శరవేగంగా తీసుకెళ్లింది. ఆ డ్రైవర్ ను ఆస్పత్రిలో చేర్పించింది. అప్పటి వరకూ ఆమె ముఖంలో ఎక్కడా ఆందోళన కనిపించలేదు. చేయాలనుకున్న లక్ష్యం మాత్రమే కనిపించింది.
Also Read: Covid Vaccine for Children: గుడ్‌న్యూస్.. 12-14 ఏళ్ల పిల్లలకు అప్పటి నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ!
సాధారణంగా తాము ప్రయాణిస్తున్న వాహనానికి ఏదైనా చిన్న ప్రమాదం లాంటిదేదో చోటు చేసుకుబోతోంటే.. ఎక్కువ మంది తమ ప్రాణాలు ఎలా కాపాడుకోవాలా అని చూస్తారు. కిటీకీలోంచి దూకుదామా... గేట్ దగ్గరనుంచి దిగిపోదామాఅని వెదుకుతారు. ఆడవాళ్లు అయితే ఎక్కువగా అలాంటి ఆలోచనలు చేయకుండా భయంతో కేకలు వేస్తారని అనుకుంటాం. సహజంగా జరిగేది కూడా అదే. కానీ పుణెకు చెందిన యోగితా సతావ్ అనే మహిళ మాత్రం ఆ టైప్ కాదు. ఏదైనా సమస్య వస్తే నెక్ట్స్ ఎలా స్పందించాలా ఆమెను చూస్తే అర్థమైపోతుంది.
యోగితా ప్రయాణిస్తున్న బస్సులోనే డ్రైవర్‌కు ఫిట్స్ వచ్చాయి. ఆమె భయపడలేదు. వెంటనే స్టీరింగ్ అందుకుంది. డ్రైవర్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లింది. ఎక్కడా ఆందోళన చెందకుండా ఆమె డ్రైవ్ చేసిన విధానం అందరికీ నచ్చింది. బస్‌లోని వాళ్లే ఆమె డ్రైవింగ్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. క్షణాల్లో అది వైరల్ అయిపోయింది. ఈ ఘటన జనవరి ఏడో తేదీన జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
#Pune woman drives the bus to take the driver to hospital after he suffered a seizure (fit) on their return journey. #Maharashtra pic.twitter.com/Ad4UgrEaQg
— Ali shaikh (@alishaikh3310) January 14, 2022
Also Read: బ్రిటిషు గడ్డను ఏలనున్న భారత మూలాలున్న నేత ! కల కాదు నిజంగానే జరగబోతోందా ?
ఇప్పుడు పుణెలో యోగితా సతావ్ ఓ రేంజ్ సెలబ్రిటీ అయ్యారు. ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని మహిళలకు సూచించడం ప్రారంభించారు. మహిళా లోకం లేస్తే పురుష ప్రపంచం దద్దరిల్లడం అనేది పాత సంగతి ఇప్పుడు. వారు అనుకుంటే పురుషుల ప్రాణాలు ఇట్టే నిలబడతాయని తాజా సంగతి.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)