President Xi Jinping: మిలిటరీకి జిన్‌పింగ్ కీలక ఆదేశాలు, మరింత పవర్‌ఫుల్ అవ్వాలని పిలుపు
President Xi Jinping: మిలిటరీని నవీకరించుకోవాలంటూ చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్ ఆదేశాలు జారీ చేశారు.
President Xi Jinping:
వాల్ ఆఫ్ స్టీల్‌గా మారాలి..
చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కీలక ఆదేశాలిచ్చారు. దేశ సైన్యాన్ని నవీకరించుకోవాలంటూ పిలుపునిచ్చారు. Great Wall of Steelలా శక్తిమంతం అవ్వాలని అన్నారు. అమెరికాతో వివాదం ముదురుతున్న నేపథ్యంలో జిన్ పింగ్ ఈ ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రక్షణాపరంగా దేశం పవర్‌ఫుల్ అవ్వాలని తేల్చి చెప్పారు జిన్‌పింగ్. పార్లమెంట్ సమావేశాల ముగింపు సమయంలో మాట్లాడిన ఆయన...ఈ ఆదేశాలిచ్చారు. జాతీయ భద్రతకు, పౌరుల రక్షణకు కచ్చితంగా కట్టుబడి ఉండాలని వెల్లడించారు. దేశ భద్రతే అభివృద్ధికి కీలకమని అన్నారు. దశాబ్ద కాలం తరవాత కేబినెట్‌లో చాలా మార్పులు చేశారు జిన్‌పింగ్. సెక్యూరిటీ విభాగంలోని ప్రస్తుత అధికారులను తొలగించి...తనకు సన్నిహితంగా ఉండే వాళ్లను నియమించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలోనూ చైనా నంబర్ వన్‌గా నిలవాలని లక్ష్యం నిర్దేశించారు. సెల్ఫ్ రిలయెన్స్‌తో దూసుకుపోవాలని తేల్చి చెప్పారు. చైనా నుంచి వచ్చే చిప్‌లపై అమెరికా ఆంక్షలు విధించిన నేపథ్యంలో జిన్‌పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. తైవాన్ అంశాన్నీ ప్రస్తావించిన ఆయన...అంతర్గత వ్యవహారాల్లో విదేశాలు జోక్యం చేసుకోవడాన్ని కచ్చితంగా వ్యతిరేకించాల్సిందేనని అన్నారు.
ప్రధానిగా లీ జియాంగ్..
చైనా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నికయ్యారు జిన్‌పింగ్. అప్పటి నుంచి ప్రభుత్వంలో మార్పులు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే లీ జియాంగ్ (Li Xiang)కు ప్రధాని పదవి అప్పగించింది చైనా. ఝెజియాంగ్‌కు గవర్నర్‌గా, షాంఘైలో పార్టీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన లీ జియాంగ్...అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు అత్యంత సన్నిహితుడు. అందుకే ఆయనకు ప్రధాని పదవి కట్టబెట్టారు. గతేడాది అక్టోబర్‌లో వారం రోజుల పాటు పార్టీ సమావేశం జరిగింది. అప్పుడే లీ జియాంగ్‌కు ప్రధాని పదవి ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. దాదాపు పదేళ్లుగా లీ కెకియాంగ్ ప్రధాని పదవిలో కొనసాగుతున్నారు. ఇప్పుడాయనను పక్కన పెట్టి తన సన్నిహితుడికి నెంబర్.2 ఛైర్‌ను కేటాయించారు జిన్‌పింగ్. ఇప్పటికే జిన్‌పింగ్ రికార్డు సృష్టించారు. మావో జెడాంగ్ రెండు సార్లు చైనాకు అధ్యక్షుడిగా ఎన్నికై రికార్డు సృష్టించగా...ఆ రికార్డుని బద్దలుకొట్టి మూడోసారి ఆ పదవిని చేపట్టారు. మరో ఐదేళ్ల పాటు ఆయనకే అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తూ చైనా పార్లమెంట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆయన ఎన్నికకు ఆమోద ముద్ర వేసింది. ఈ ఎన్నికతో చైనాకు ఇకపై జీవిత కాల అధ్యక్షుడిగా కొనసాగనున్నారు జిన్‌పింగ్.
రాజ్యాంగ సవరణలు..
గతేడాది అక్టోబర్‌లో చైనా కమ్యూనిస్ట్ పార్టీ సమావేశాలు జరిగాయి. అప్పుడే పార్టీ రాజ్యాంగంలో సవరణలు కూడా చేశారు. ఇదంతా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను మూడోసారీ అదే పదవిలో కొనసాగేలా చేసేందుకే. నిజానికి...ఆ వారం రోజుల కాంగ్రెస్ ఉద్దేశం కూడా అదే. జిన్‌పింగ్‌కు మరి కొన్ని అధికారాలు కట్టబెట్టి ఆయననే మూడోసారి అధ్యక్షుడిగా కొనసాగించేలా తీర్మానం చేస్తారని ముందు నుంచి చెబుతూనే ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే సెంట్రల్ కమిటీలోని 370 మంది సీనియర్ లీడర్స్ కొన్ని కీలక తీర్మానాలు ప్రవేశపెట్టడంతో పాటు పార్టీ రాజ్యాంగంలోనూ సవరణలు చేశారు. జిన్‌పింగ్‌కి సర్వాధికారాలు కట్టబెట్టే సవరణలు ఇవి.
Also Read: Oscars 2023: నాటు నాటు పాట కొన్నేళ్ల పాటు నిలిచిపోతుంది, దేశం గర్విస్తోంది - ప్రధాని మోదీ ప్రశంసలు