News
News
X

Oscars 2023: నాటు నాటు పాట కొన్నేళ్ల పాటు నిలిచిపోతుంది, దేశం గర్విస్తోంది - ప్రధాని మోదీ ప్రశంసలు

Oscars 2023: ఆస్కార్ అవార్డు దక్కించుకున్న RRR, The Elephant Whisperers టీమ్‌లను అభినందిస్తూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

FOLLOW US: 
Share:

Oscars 2023: 

ట్వీట్‌లో ప్రశంసలు.. 

ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన RRR చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు దక్కింది. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు సినిమా పాటగానూ రికార్డు సృష్టించింది. ఈ క్రమంలోనే ఈ అరుదైన ఫీట్ సాదించిన RRR టీమ్‌కి రాజకీయ, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ట్విటర్ వేదికగా వరుస ట్వీట్‌లతో అభినందిస్తున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ RRR టీమ్‌కి కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ చేశారు. ఇండియన్ డాక్యుమెంటరీ 'The Elephant Whisperers'కి ఆస్కార్ రావడమూ గర్వంగా ఉందని అన్నారు. నాటు నాటు పాట ప్రపంచవ్యాప్తంగా కొన్నేళ్ల పాటు నిలిచిపోతుందని ప్రశంసించారు. భారత్ గర్విస్తోంది అంటూ ట్వీట్ చేశారు. 

"అద్బుతం. నాటు నాటు పాటకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. ఈ పాట మరి కొన్నేళ్ల పాటు నిలిచిపోతుంది. సంగీత దర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్‌కు, చిత్ర బృందానికి అభినందనలు. భారత్‌ గర్విస్తోంది"

- ప్రధాని నరేంద్ర మోదీ

The Elephant Whisperers డాక్యుమెంటరీని కొనియాడారు ప్రధాని. ప్రకృతితో సహజీవనం చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేసిందంటూ కొనియాడారు. 

"The Elephant Whisperers టీమ్‌కు నా అభినందనలు. ప్రకృతితో మమేకమై జీవించడం ఎంత ముఖ్యమో ప్రపంచానికి చాటి చెప్పారు. "

- ప్రధాని నరేంద్ర మోదీ

Published at : 13 Mar 2023 10:55 AM (IST) Tags: PM Narendra Modi oscars Oscars 2023 The Elephant Whisperers RRR naatu Naatu RRR. Naatu Naatu

సంబంధిత కథనాలు

Eatala Rajender: పంజాబ్ వెళ్లి డబ్బులు ఇచ్చుడు కాదు, రాష్ట్ర రైతులను ఆదుకోండి కేసీఆర్ - బీజేపీ ఎమ్మెల్యే ఈటల

Eatala Rajender: పంజాబ్ వెళ్లి డబ్బులు ఇచ్చుడు కాదు, రాష్ట్ర రైతులను ఆదుకోండి కేసీఆర్ - బీజేపీ ఎమ్మెల్యే ఈటల

5G మొదలైందో లేదో అప్పుడే 6G గురించి మాట్లాడుతున్నాం, భారత్ విశ్వాసానికి ఇది నిదర్శనం - ప్రధాని మోదీ

5G మొదలైందో లేదో అప్పుడే 6G గురించి మాట్లాడుతున్నాం, భారత్ విశ్వాసానికి ఇది నిదర్శనం - ప్రధాని మోదీ

RRB Group D Result: రైల్వే 'గ్రూప్‌-డి' తుది ఫలితాలు విడుదల, ఉద్యోగాలకు ఎంతమంది ఎంపికయ్యారంటే?

RRB Group D Result: రైల్వే 'గ్రూప్‌-డి' తుది ఫలితాలు విడుదల, ఉద్యోగాలకు ఎంతమంది ఎంపికయ్యారంటే?

Delhi Liquor Policy: సిసోడియా కస్టడీ మరోసారి పొడిగింపు,బెయిల్ పిటిషన్‌పై ఈడీ వివరణ కోరిన కోర్టు

Delhi Liquor Policy: సిసోడియా కస్టడీ మరోసారి పొడిగింపు,బెయిల్ పిటిషన్‌పై ఈడీ వివరణ కోరిన కోర్టు

ABP Desam Top 10, 22 March 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 22 March 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

టాప్ స్టోరీస్

IND Vs AUS 3rd ODI: మెల్లగా బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా - సగం ఓవర్లు ముగిసేసరికి స్కోరు ఎంతంటే?

IND Vs AUS 3rd ODI: మెల్లగా బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా - సగం ఓవర్లు ముగిసేసరికి స్కోరు ఎంతంటే?

Minister KTR: ఒక్క ట్వీట్ చేస్తే అక్కడ అరెస్ట్ - ఇక్కడ మేం అన్నీ భరిస్తున్నాం: మంత్రి కేటీఆర్

Minister KTR: ఒక్క ట్వీట్ చేస్తే అక్కడ అరెస్ట్ - ఇక్కడ మేం అన్నీ భరిస్తున్నాం: మంత్రి కేటీఆర్

Cars Price Hike: ఏప్రిల్ 1 నుంచి మరింత పెరగనున్న కార్ల ధరలు - ఎందుకు? ఎంత?

Cars Price Hike: ఏప్రిల్ 1 నుంచి మరింత పెరగనున్న కార్ల ధరలు - ఎందుకు? ఎంత?

షాకింగ్ లుక్: గుర్తు పట్టలేనంతగా మారిపోయిన సీనియర్ హీరోయిన్!

షాకింగ్ లుక్: గుర్తు పట్టలేనంతగా మారిపోయిన సీనియర్ హీరోయిన్!