News
News
వీడియోలు ఆటలు
X

President Droupadi Murmu: సుఖోయ్‌లో విహరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, IAFపై ప్రశంసలు

President Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుఖోయ్ ఎయిర్ క్రాఫ్ట్‌లో ప్రయాణించారు.

FOLLOW US: 
Share:

President Droupadi Murmu:

అసోంలో పర్యటన..

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రస్తుతం అసోం పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె తేజ్‌పూర్‌లోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌ను సందర్శించారు. అంతే కాదు. సుఖోయ్ 30 MKI ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ప్రయాణించారు. ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ప్రయాణం చేసిన నాలుగో భారత రాష్ట్రపతిగా నిలిచారు. అంతకు ముందు గౌరవ వందనం అందుకున్న ఆమె...ఆ తరవాత  సుఖోయ్‌లో ప్రయాణించారు. ఫ్లైయింగ్ సూట్ వేసుకుని కాసేపు సుఖోయ్‌లో విహరించారు. గ్రూప్ కేప్టెన్ నవీన్ కుమార్ తివారీ ఈ క్రాఫ్ట్‌ను నడిపారు. సుఖోయ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ప్రయాణించడం ఎంతో గొప్ప అనుభూతిని పంచిందని ద్రౌపది ముర్ము వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఓ బ్రీఫ్ నోట్ విడుదల చేశారు. 

"సుఖోయ్ లాంటి ఎయిర్ క్రాఫ్ట్‌లో ప్రయాణించడం చాలా గొప్ప అనుభూతినిచ్చింది. దేశ రక్షణ శాఖ ఇంత  బలోపేతం అవడం నిజంగా గర్వంగా ఉంది. సముద్ర జలాలైనా, గగనతలంలోనైనా భారత్ ఈ స్థాయిలో పురోగతి సాధించడం గొప్ప విషయం. ఈ అవకాశం ఇచ్చిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కి, ఇతర సిబ్బందికి నా ధన్యవాదాలు"

- ద్రౌపది ముర్ము,భారత రాష్ట్రపతి 

2 కిలోమీటర్ల ప్రయాణం..

దాదాపు 2 కిలోమీటర్ల పాటు సుఖోయ్‌లో ప్రయాణించారు ముర్ము. సముద్ర మట్టానికి 800 కిలోమీటర్ల ఎత్తులో విహరించారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా అసోంకు వచ్చారు రాష్ట్రపతి. మొదట కజిరంగ నేషనల్ పార్క్‌లోని గజ్ ఉత్సవాన్ని ప్రారంభించారు. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కార్యక్రమం మొదలై 30 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. గురువారం (ఏప్రిల్ 6న)ఆమె అసోంకు చేరుకున్నారు. గవర్నర్ గులాబ్ చంద్ కటారియా,ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆమెకు గౌరవ స్వాగతం పలికారు. గజ్ ఉత్సవాన్ని ప్రారంభించిన సమయంలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ఏనుగులతో మనుషులకున్న ఘర్షణను తగ్గించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని స్పష్టం చేశారు. మౌంట్‌ కాంచనగంగ సాహసయాత్ర - 2023ను ప్రారంభించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలనూ వీక్షించారు. మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ 2009లో సుఖోయ్ ఎయిర్‌ క్రాఫ్ట్‌లో ప్రయాణించారు. ఆ తరవాత అబ్దుల్ కలాం కూడా ఇదే ఎయిర్‌క్రాఫ్ట్‌లో విహరించారు. 

Also Read: Cong Leader Threatens Judge: రాహుల్‌కు శిక్ష వేసిన ఆ జడ్జ్ నాలుక కోసేస్తాం, కాంగ్రెస్‌ నేత సంచలన వ్యాఖ్యలు

Published at : 08 Apr 2023 02:37 PM (IST) Tags: Assam Droupadi Murmu President Droupadi Murmu Sukhoi 30 MKI Sukhoi Aircraft Tezpur Air Force Station

సంబంధిత కథనాలు

PSTU Admissions: తెలుగు యూనివర్సిటీ ప్రవేశ ప్రకటన విడుదల, కోర్సుల వివరాల ఇలా!

PSTU Admissions: తెలుగు యూనివర్సిటీ ప్రవేశ ప్రకటన విడుదల, కోర్సుల వివరాల ఇలా!

APPSC Group1 Mains: జూన్‌ 3 నుంచి 'గ్రూప్‌-1' మెయిన్స్ పరీక్షలు! హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారా?

APPSC Group1 Mains: జూన్‌ 3 నుంచి 'గ్రూప్‌-1' మెయిన్స్ పరీక్షలు! హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారా?

Hayath Nagar Deaths Case: రాజేశ్, టీచర్ మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి! అసలు విషయం తేల్చిన పోలీసులు

Hayath Nagar Deaths Case: రాజేశ్, టీచర్ మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి! అసలు విషయం తేల్చిన పోలీసులు

IBPS RRB XII Recruitment 2023: ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్ విడుదల - ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు ఎప్పుడంటే?

IBPS RRB XII Recruitment 2023: ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్ విడుదల - ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు ఎప్పుడంటే?

CPI Ramakrishna: సీఎం జగన్ ముందస్తుకు వెళ్తే అదే జరుగుతుంది, మేం స్వాగతిస్తాం - సీపీఐ రామక్రిష్ణ వ్యాఖ్యలు

CPI Ramakrishna: సీఎం జగన్ ముందస్తుకు వెళ్తే అదే జరుగుతుంది, మేం స్వాగతిస్తాం - సీపీఐ రామక్రిష్ణ వ్యాఖ్యలు

టాప్ స్టోరీస్

Gorantla Butchaiah Chowdary: సీఎం జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా అవినాష్ కేసుకు బ్రేకులు: గోరంట్ల బుచ్చయ్య సెటైర్లు

Gorantla Butchaiah Chowdary: సీఎం జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా అవినాష్ కేసుకు బ్రేకులు: గోరంట్ల బుచ్చయ్య సెటైర్లు

Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్‌అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్

Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్‌అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్

Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?

Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!